NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

దీదీకి మరో షాక్..బెంగాల్ మరో మంత్రిపై సీబీఐ దాడులు

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆమె మంత్రివర్గంలోని సభ్యులు, టీఎంసీ నేతలు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎంసీ నేతలపై సీబీఐ దాడుల పరంపర కొనసాగుతోంది. పశువుల అక్రమ రవాణా కేసులో టీఎంసీ నేత అనుబ్రత మోండల్ ను ఇంతకు ముందే సీబీఐ అరెస్టు చేసి జైలుకు పంపగా, ఇటీవలే టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్ లో మంత్రి పార్ధ చటర్జీని సీబీఐ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించింది. ఇప్పుడు తాజాగా బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ న్యాయశాఖ మంత్రి మోలోయ్ ఘటక్ నివాసం, కార్యాలయాలపై సీబీఐ బృందం దాడులు చేసింది. పశ్చిమ బర్దమాన్ జిల్లాలోని అసన్ సోల్ లో ఆయనకు ఉన్న మూడు నివాసాల్లో, కోల్ కతాలోని లేక్ గార్డెన్ లో ఉన్న నివాసంలో ఒకే సారి సోదాలు నిర్వహిస్తున్నారు సీబీఐ బృందాలు. ఈ సారి  సోదాల్లో సీబీఐకి చెందిన మహిళా అధికారులు కూడా పాల్గొనడం విశేషం. ఈ కేసుకు సంబంధించి మోలోయ్ ఘటక్ ను గతంలో ఈడీ ప్రశ్నించింది. సీఎం మమత బెనర్జీ మేనల్లుడ టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సహా పలువురు టీఎంసీ నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘాలో ఉన్న తరుణంలో ఈ సోదాలు జరుగుతున్నాయి.

WB CM Mamata Banerjee

 

మోలోయ్ ఘటక్ నిన్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. అమిత్ షా పర్యవేక్షణలో దేశ వ్యవహారాలు భయానంగా ఉన్నాయంటూ విమర్శించారు. బొగ్గు కుంభకోణంలో ఇంతకు ముందు అభిషేక్ బెనర్జీని ఈడీ పలు మార్లు విచారించింది. బొగ్గు స్మగ్లింగ్ కు సంబంధించి సీబీఐ 2020 నవంబర్ నెలలో కేసు నమోదు చేసింది. బొగ్గు అక్రమ రవాణా కేసులో గత ఏడాది ఆగస్టులో ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ఈడీ తన మొదటి చార్జిషీటును దాఖలు చేసింది. వినయ్ మిశ్రా సోదరుడు వికాస్, బంకురా పోలీస్ స్టేషన్ మాజీ అధికారి అశోక్ మిశ్రాను ప్రధాన నిందితులుగా పేర్కొన్న ఈడీ.. అభిషేక్ బెనర్జీ పేరు ను చార్జిషీట్ లో పేర్కొనలేదు. మరో పక్క పశ్చిమ బెంగాల్ లో నియమితులైన ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులకు ఇటీవల విచారణకు హజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది.

WB Minister Moloy Ghatak

 

సీబీఐకి చెందిన అధికారులు మాట్లాడుతూ… బోగ్గు అక్రమ రవాణఆ కేసులో ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టామనీ, దర్యాప్తులో భాగంగా మోలోయ్ ఘటక్ పేరు వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ఈ స్మగ్లింగ్ లో ఘటక్ పాత్ర ఏమిటనేది దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. స్మగ్లింగ్ లో ఘటక్ పాత్ర ఉందనే కీలక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. అసన్ పోల్ కు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ కు చెందిన మైన్స్ నుండి బొగ్గు అక్రమ రవాణా జరిగిందని సీబీఐ ఆరోపిస్తొంది. బ్లాక్ మార్కెట్ లో వేల కోట్ల రూపాయల విలువైన బొగ్గును విక్రయించారని చెబుతోంది. గత కొన్నేళ్లుగా ఈ స్మగ్లింగ్ రాకెట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు..ఎందుకంటే..?

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju