Intinti Gruhalakshmi: లాస్య వేసిన ప్లాన్ ప్రకారం.. సామ్రాట్ వాళ్లు మాట్లాడక ముందే.. మీడియా వాళ్ళు ముందుగా మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడుగుతారు.. సరే మీ ఇష్టం అని సామ్రాట్ అంటాడు.. అప్పుడే విలేకరులు తులసి గారు లైఫ్ పార్ట్నర్స్ కాబోతున్నారా.. అందుకే ఇప్పటివరకు మీరు మీ భార్య గురించి ఏ విషయాన్ని బయటకు చెప్పలేదు అని చాలా అవమానంగా మాట్లాడుతారు.. వెంటనే తులసి ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టేనా.. ఎవరు ఏమనుకున్నా కానీ సామ్రాట్ గారి వ్యాపార భాగస్వామ్యం నేను వదులుకోవడం లేదు.. ఇక మీరు నచ్చినట్లు మీరు రాసుకోండి అని తులసి ఉంటుంది..!
ఇంకొక్క విషయం ఇందాక ఎవరో సామ్రాట్ గారి భార్య గురించి మాట్లాడారు. అదే ఆయన గారి వ్యక్తిగత విషయం ఆయన జీవితంలోకి తొంగి చూసి హక్కు ఎవరికీ లేదు.. ఆయన జీవితంలోకి తొంగి చూసి అలవాటు ఎందుకు కాస్త సిగ్గుండాలి అని తులసి కాస్త ఘాటుగా స్పందిస్తుంది.. నేను ఈ ప్రశ్న అడగడం తప్పే క్షమించండి సామ్రాట్ గారు అని విలేకరి చెబుతుంది.. ఇంకోసారి ఇలా జరగదు అని ఆమె అంటుంది.. ఇక మీడియా వాళ్లంతా లేచి అక్కడ నుంచి వెళ్ళిపోతారు.. మీకు ఎలా థాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు తులసి గారు అని సామ్రాట్ తులసితో అంటాడు.. మీకు ప్రెస్ మీట్ లో అండగా నిలబడాలని నేను అనుకున్నాను.. కానీ మీరే నాకు ప్రెస్ మీట్ లో అండగా నిలబడ్డారు అని సామ్రాట్ సంతోషంగా తులసితో అంటాడు.. మీరు రోల్ మోడల్ అండి హాట్సాఫ్ మీకు అని సామ్రాట్ అంటారు..
ప్రెస్ మీట్ లో ఆయన సమాధానం చెప్పలేనప్పుడు నిన్ను ఎందుకు ఆయన ఇరికించాలి అని అభి అడుగుతాడు. నాకు తెలిసి సామ్రాట్ గారిది అలాంటి మనస్తత్వం కాదు.. ఆయన మౌనం వెనుక ఏదో చెప్పుకోలేని కారణం ఉంటుంది అని తులసి అంటుంది. ఎవరికి చెప్పినా చెప్పకపోయినా నీతో చెప్పాలి కదా అమ్మ నువ్వు ధైర్యంగా మాట్లాడి కాబట్టి సరిపోయింది.. లేకపోతే అని అనసూయమ్మ అంటుంది.. ఇంకోసారి పేపర్ లోకి ఎక్కేది అని అభి అంటాడు.. భాగస్వామ్యం అన్నగా ఒక్కోసారి ఒక్కొక్కరు అడ్జస్ట్ అవ్వాలి.. ఇప్పుడే కదా ప్రెస్ మీట్ అయింది.. సామ్రాట్ గారు నిదానంగా ఆ విషయం గురించి చెబుతారు.. ఈలోపు ఆయన్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని తులసి అంటుంది.. సమాజాన్ని చూసి మనం ముందుకు అడుగు వేయలేం.. ధైర్యంగా అడుగు ముందుకు వెళ్లాలి అని అంటుంది తులసి..
సామ్రాట్ హనీ దగ్గరకి వచ్చి.. నిప్పు లాంటి ఈ నిజాన్ని నా గుండెల్లో దాచుకొని సమాజం ముందు మీ నాన్నగా నిలబడ్డాను.. ఒక విధంగా నిన్ను మోసం చేసినట్టే అవుతుంది.. నువ్వు బాధకపోయి ఆడకుండా ఉండడం కోసం నేను తప్పు చేస్తున్నాను అమ్మ అని సామ్రాట్ లో లోపల మదనపడతాడు.. నాన్న కాదని ఈ నాన్నను క్షమించమ్మా.. ఈ అన్న ప్రేమను వదులుకొని నా చెల్లి వేరే వారితో వెళ్ళిపోయింది.. నీలో నా చెల్లెల్ని చూసుకుంటున్నాను.. నా చెల్లెకు అందాల్సిన ప్రేమను నీకు అందిస్తున్నాను.. ఇది తప్ప ఉప్ప అనేది ఆ దేవుడే తేల్చాలి.. భారం అంతా ఆయన మీదే వేసాను అని సామ్రాట్ అంటాడు.. సామ్రాట్ గతం గురించి అవి తెలియక చాలా నీచంగా మాట్లాడుతాడు ఇక రేపటి ఎపిసోడ్లో సామ్రాట్ నిజం చెబుతాడ లేదా అనేది చూడలి..