NewsOrbit
న్యూస్

పోలీసులు అన్యాయంగా ఆపారనే కోపంతో సొంత బైక్‌ను తగలబెట్టుకున్న వ్యక్తి?

మీరు విన్నది నిజమే. పోలీసులు తన బండిని ఆపారని ఓ వ్యక్తి ఏకంగా తన బండిని కాల్చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్​లో వున్న ట్రాఫిక్ సమస్యలు గురించి అందరికీ తెలిసినదే. ఈ ట్రాఫిక్ పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ఈమధ్యకాలంలో అక్కడ నిబంధనలు కచ్చితంగా పాటించాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే నేటి నుండి రూల్స్ మీరితే ఫైన్ తప్పదని కూడా హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఉదయం నుంచే కూడళ్లలో ఉండి రూల్స్ పాటించని వాహనదారులకు ఫైన్లు విధిస్తున్నారు.

ఇకపోతే విధుల్లో భాగంగా అమీర్​పేట మైత్రివనం కూడలి వద్ద ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ రాంగ్​ రూట్లో వచ్చిన ఎల్లారెడ్డిగూడకు చెందిన అశోక్​ను ఆపి.. బండి తాళం తీసుకున్నారు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన అశోక్​ తనను ఎందుకు ఆపారని వాగ్వాదానికి దిగాడు. తరువాత మైత్రీవనంలో తాను నిర్వహించే మొబైల్ షాప్ వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి పెట్రోల్​తో వచ్చి.. తన బండిపై పోసి నిప్పంటించాడు.

Bike firing



కట్ చేస్తే, బైక్‌ మంటల్లో కాలి బూడిద అయిపోయింది. ఈ ఘటనపై అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే పోలీసులు ఫైర్ స్టేషన్​కు కాల్​ చేశారు. వారు వచ్చి మంటలు ఆర్పారు. కాగా ఈ వ్యవహారాన్ని పోలీసులు కొంచెం సీరియస్​గానే తీసుకున్నారు. రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేయడం, తమ విధులను అడ్డుకోవటం కింద అశోక్​పై కేసు నమోదు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా ఇది చూసిన జనాలు గోటితో పోయేదానికి గొడ్డలిదాగా ఎందుకు? అని నిస్తేజులైనారు.

Related posts

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju