NewsOrbit
Entertainment News Telugu TV Serials

Karthikadeepam serial today episode review November 11:ఆనందరావు ఎంట్రీతో మోనిత కధ అయిపోయినట్లేనా…?

Karthikadeepam serial today episode review November 11 :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1507వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 11న ప్రసారం కానున్న Karthika Deepam serial,1507వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1507 ఎపిసోడ్‌లోకి కార్తీకదీపం సీరియల్ అడుగుపెట్టింది.గత ఎపిసోడ్ లో మోనితను కార్తీక్ చెంప మీద కొట్టడంతో కార్తీక్ కు గతం గుర్తొచింది అని అనుకుంటుంది. కానీ కార్తీక్ మోనితకు అనుమానం రానివ్వకుండా ఏదోలా కవర్ చేసి మోనిత చేతనే దీపకు డబ్బులు ఇప్పిస్తాడు.ఈ క్రమంలోనే ఆనందరావు, హిమలు ఆనంద్ కోసం మోనిత ఇంటికి రావడంతో కథనం ఆసక్తిగా మారింది.

ఆనందరావు ఎంట్రీతో షాక్ అయిన మోనిత :

Monitha, anadaravu

ఇక మోనిత జరిగిన ఆ అవమానం తలుచుకుంటూ కార్తీక్ కు గతం గుర్తుకు వచ్చిందా రాలేదా అనే అయోమయంలో ఇంటికి నడిచి వస్తుంది.అసలు కార్తీక్‌కి గతం గుర్తొచ్చిందో లేదో ముందు తెలుసుకుని ఆ తర్వాత దుర్గ, దీపల సంగతి చెబుతాన అనుకుంటూ రగిలిపోతూ ఇంటికి వస్తుంది.తీరా మోనిత ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఆనందరావు ఇంటి ముందు కూర్చుని ఉంటాడు. బొటిక్‌లో పనిచేసే వర్కర్ శివలత కూడా అక్కడే నిలబడి ఉంటుంది.ఆనందరావుని చూసి మోనిత బిత్తరపోయి అంకుల్ ఇప్పుడు వచ్చారేంటీ?ఇప్పుడు కానీ అంకుల్ ను కార్తీక్,దీప చూస్తే ఇంకేమన్నా ఉందా అని మనసులో అల్లాడిపోతుంది. ‘ఎలా ఉన్నావ్ మోనితా?’ అంటాడు ఆనందరావు. ‘ఎందుకొచ్చారు అంకుల్ ఎందుకు ఇలా మాటిమాటికి వచ్చి నన్ను ఇబ్బందిపెడుతున్నారు’ అంటూ రివర్స్ అయిపోతుంది మోనిత. ‘నేను రావడం వల్ల నీకు కలిగే ఇబ్బంది ఏంటో అర్థం కావట్లేదు’ అంటాడు ఆనందరావు.మీరు నిత్యం ఇలా నా కళ్లముందు కనిపిస్తుంటే చనిపోయిన నా కార్తీక్ గుర్తొస్తూనే ఉంటాడు అనేస్తుంది మోనిత. పక్కన శివలత ఉందనే విషయం మరిచిపోతుంది మోనిత. ఇక శివలతఅదేంటి కార్తీక్ సార్ కళ్లముందు ఉంటే మేడమ్ ఇలా మాట్లాడుతుందేంటీ?’ అని ఆలోచనలో పడుతుంది శివలత.

మోనిత చరిత్ర మొత్తం తెలుసుకున్న శివలత :

Sivalatha

మోనిత నాకు నీ ముఖంలో బాధ కంటే ఎక్కువగా టెన్షన్ కనిపిస్తోంది అంటాడు ఆనందరావు.సరేలే.. హిమ లోపల బాబుతో ఆడుకుంటోంది.. లోపలికి రా మాట్లాడుకుందాం’ అంటూ ఆనందరావు లోపలికి నడుస్తాడు. మోనితలో మాత్రం కార్తీక్ వచ్చేస్తాడేమోనని భయపడుతూ వెనక్కి చూసుకుంటూ ఆనందరావు వెనుకే కంగారు కంగారు లోపలికి వెళ్తుంది మోనిత.హిమ బాబుతో ఆడుకుంటూ మోనితని చూడగానే ‘బాగున్నారా మోనితాంటీ’ అంటుంది. నవ్వుతూ బాగున్నా అంటుంది అయిష్టంగా మోనిత. ఆంటీ ఆనంద్ ను మాతో తీసుకుని వెళ్తాం ప్లీజ్ అంటూ హిమ పట్టుబడుతుంది. ఆనందరావు అదే మాట అంటాడు. వద్దు కార్తీక్ గుర్తుగా వీడ్ని నాతో ఉండనివ్వండి.. మీరు వెళ్లండి’ అని మోనిత అంటుంది. అయినా సరే హిమ వదలదు.‘వీళ్లు బాబుని ఇస్తే కానీ వెళ్లేలా లేరు. కార్తీక్ ఏ క్షణంలోనైనా వచ్చేస్తాడు బాబు గురించి కార్తీక్ అడిగితే ఏదొకటి చెప్పొచ్చు ముందు బాబు ఇచ్చేయడమే బెటర్’ అనుకుని శివలతా బాబు బట్టలు సర్దు అంటూ చెప్పి హడావుడిగా బయటకు వచ్చి దీప ఇంటికి పరుగుతీస్తుంది కార్తీక్ కోసం.

కార్తీక్ కోసం పరుగుబెట్టిన మోనిత :

Siva accident

అక్కడ లేడని తెలుసుకుని నడిచి వస్తుండగా.. కార్తీక్ తన ముందే ఇంటి వైపు నడిచి వెళ్లడం చూసి షాక్ అయిపోతుంది. కారు వెనక్కి దాక్కుని వెంటనే కార్తీక్‌కి కాల్‌ చేసి ఎక్కడున్నావ్ అంటుంది. ఇంట్లోకి వెళ్తున్న అని కార్తీక్ అనగానే వద్దు వెళ్లకు అని కంగారుగా చెప్పి మన శివకు ఆక్సిడెంట్ అయిందట అని అంటుంది. రోడ్డు దాటుతుంటే లారీ కొట్టేసిందట సీరియస్‌గా ఉంది’ అంటూ అబద్దం చెప్పేస్తుంది‘వెంటనే కారు దగ్గరకి రా కార్తీక్‌.. నేను వస్తున్నాను హాస్పటల్‌కి వెళ్దాం..’ అంటుంది మోనిత కంగారుగా.

శివకు ఆక్సిడెంట్ నిజమేనా?

ఇద్దరూ కలిసి కారు దగ్గరకు వెళ్తారు.సరిగ్గా అప్పుడే శివ ఎదురుగా బ్యాగ్‌తో వచ్చి సార్‌ ఎక్కడికో హడావుడిగా బయలుదేరుతున్నట్లు ఉన్నారు?’ అంటాడు.ఇక శివను చూసి కార్తీక్ షాక్‌ అయ్యి ‘శివా..’ అంటాడు ఆశ్చర్యంగా.మోనిత బిత్తరపోతుంది. వెంటనే మోనిత ప్రవర్తనపై అనుమానం వచ్చేసి ఎవరు ఉన్నారు లోపల అని లోపలకు పరుగుదిస్తాడు.ఆగు కార్తీక్‌..’ అని అరుస్తూ మోనిత కూడా వెనకనే వెళ్తుంది.హాల్లోకి వెళ్లి చూసి షాక్‌ అవుతాడు. ఎందుకంటే అక్కడ ఎవ్వరూ ఉండరు శివలత తప్ప. మోనిత శివలత వైపు ఓరగా చూసి కళ్లు ఎగరేస్తుంది.కార్తీక్ వచ్చే సమయానికి శివలత బాబు బట్టలు ఇచ్చి వాళ్ళను ఇంటి వెనుక నుంచి పంపించేస్తుంది. ఇంట్లో వాళ్ళు లేకపోవడంతో మోనిత ఊపిరి పీల్చుకుంటుంది. ‘లోపల ఎవరూ లేరు కదా? ఎందుకు అంత కంగారు పడ్డావ్.. అన్ని అబద్దాలు చెప్పావ్’ అంటూ కార్తీక్ నిలదీస్తాడు. మోనిత మళ్ళీ ఏదోలా కవర్ చేస్తుంది.‘మరి ఆనంద్ ఎక్కడ?’ అంటాడు కార్తీక్. ‘అబ్బా వాడిగొడవ ఇప్పుడు ఎందుకు కార్తీక్.. ఈ పూటకి నన్ను ఇలా వదిలెయ్ అంటుంది.కార్తీక్ కోపంగా.. ‘ఏదో ఉంది.. తెలుసుకుంటాను’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.ఇంతలో శివ వచ్చి.. ‘మేడమ్.. నాకు యాక్సిడెంట్ అయ్యిందని మీకు ఎవరు చెప్పారు’ అంటాడు నవ్వుతూ బ్యాగ్ చంకలో పెట్టుకుని. లాగిపెట్టి కొడుతుంది మోనిత. ‘సరిగ్గా టైమ్‌కి రాకపోతే ఏం అయ్యేది? మొత్తం చెడగొట్టావ్ అంటూ తిడుతుంది.ఎంత పెద్ద గండం తప్పింది?’ అని మోనిత కూల్ అవుతుంది.

శివలతకు నిజం తెలిసింది అని కంగారులో మోనిత :

Monitha tension

శివలతని పిలుస్తుంది. ‘వాళ్లని ఇంటి నుంచి వెళ్లమన్నావ్ కదా.. వాళ్లకేం అనుమానం రాలేదు కదా?’ అంటుంది మోనిత. ‘ఎందుకొస్తుంది మేడమ్? రాలేదు మేడమ్ గారు వస్తే మళ్లీ ఒప్పుకుంటారో లేదో మీ మనవడ్ని మీరు తీసుకుని వెళ్లండి అని చెప్పాను.. గుట్టు చప్పుడు కాకుండా తీసుకుని వెళ్లిపోయారు’ అంటుంది మనవడు ఏంటీ? నా కొడుకు ఆయనకి మనవడు అవుతాడని నీకు చెప్పలేదుగా’ అంటుంది మోనిత కోపంగా. ‘చెప్పకపోయినా తెలిసిపోయింది మేడమ్ అంటుంది శివలత.ఈ రోజు మీ పరిస్థితి చూస్తేనే నాకు అర్థమైపోయింది.‘ఈ నిజం ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను కానీ దీనికి తెలిసిపోయింది’ అని మనసులో రగిలిపోతుంది మోనిత.శివలతా ఈ నిజం అంటూ మోనిత ఏదో అనబోతుంటే శివలత ఆగి ఎవరికీ చెప్పను మేడమ్.. మీరు ఇచ్చే జీతంతో బతుకుతున్న దాన్ని.. మీ కోసం ఈ మాత్రం చేయలేనా?’ అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ‘ఈ శివలత నమ్మకం అయినదే కానీ.. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మడానికి లేదు దీన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలలి అని అనుకుంటుంది. వీళ్ళ అందరికి దూరంగా కార్తీక్, నేను ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అవుతుంది మోనిత. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం!

Related posts

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu