NewsOrbit
Cricket న్యూస్

బంగ్లాదేశ్ సంచలన విజయం: న్యూజిలాండ్ పై తన చెత్త బౌలింగ్ కు బంగ్లాదేశ్ లో ప్రయశ్చిత్తం చేసుకున్న ఇండియా ఆటగాడు | IND vs BAN 1st ODI

India vs Bangladesh 1st ODI Match Highlights

IND vs BAN: ఇండియా vs బంగ్లాదేశ్ మొదటి వన్ డే మ్యాచ్ లో పూర్తిగా బౌలర్లు ఆధిపత్యం చూపించారు. మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 186 పరుగులు మాత్రమే సాధించిన ఇండియా జట్టు బంగ్లాదేశ్ బౌలర్ల చేతిలో చిత్తుగా చాలా చెత్తగా ఆడారు. బాంగ్లాదేశ్ కు చెందిన షకీబ్ అల్ హాసన్ 5 వికెట్లు తీసుకోగా ఎబాడాట్ హుస్సేన్ 4 వికెట్స్ తీసుకొని 186 పరుగులకే టీం ఇండియా బ్యాట్స్‌మెన్ ని కట్టడి చేసారు.187/9 స్కోర్ తో బంగ్లాదేశ్ 46 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించింది. ఇది ఇలా ఉంటె, ఇక ఓటమి తప్పదు అనుకున్న సమయం లో శార్దుల్ ఠాకూర్ ఒక పెద్ద మాయ చేసి ఇండియా ని విజయానికి చేరువ చేసాడు. శార్దుల్ ఠాకూర్ కి సహాయంగా మహమ్మద్ సిరాజ్ పది ఓవర్లలో 3 వికెట్స్ తీసుకొని కేవలం 32 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

అయితే బాంగ్లాదేశ్ పైన ఓటమి చూసిన ఇండియా జట్టు లో మాట్లాడుకోవాల్సిన ఆటగాడు శార్దుల్ ఠాకూర్. ఇండియా టూర్ అఫ్ బంగ్లాదేశ్ లో భాగంగా జరిగిన మొదటి వన్ డే మ్యాచ్ లో బాంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. అసలు గెలుపుకి అవకాశం లేదు, ఛేదించాల్సిన పరుగులు కేవలం 186, ఇలాంటి సమయం లో అద్భుతమైన ఆటతీరు చూపిస్తూ తన బౌలింగ్ తో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ కు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు శార్దుల్ ఠాకూర్. ఒక సమయం లో గెలుపు ఇండియాదే అనుకున్న అభిమానులకు మాత్రం చివరికి నిరాశే మిగిలింది

ఇండియా పై బంగ్లాదేశ్ పై సంచలన విజయం: శార్దుల్ ఠాకూర్ vs మహమ్మద్ సిరాజ్

వాస్తవానికి ఎక్కువ వికెట్స్ తీసింది మహమ్మద్ సిరాజ, పది ఓవర్లలో 3 వికెట్స్ తీసి బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ ని ఇరకాటం లో పడేసింది తనే. కానీ సిరాజ్ బౌలింగ్ కంటే శార్దుల్ ఠాకూర్ గురించే ఎక్కువ మాట్లాడుకోవాలి. ఎందుకంటే 9 ఓవర్లు లో కేవలం 21 పరుగులు ఇచ్చి 1 మైడెన్ ఓవర్ తో తన సత్తా చాటుకున్నాడు శార్దుల్ ఠాకూర్.

BAN vs IND 1st ODI Highlights: India lost the match to Bangladesh but Shardul Thakur atoned himself in Bangladesh after his New Zealand Performance
IND vs BAN 1st ODI Highlights: India lost the match to Bangladesh but Shardul Thakur atoned himself in Bangladesh after his New Zealand Performance

న్యూజిలాండ్ పై తన చెత్త బౌలింగ్ కు బంగ్లాదేశ్ లో ప్రయశ్చిత్తం

ఇటీవల జరిగిన ఇండియా టూర్ అఫ్ న్యూజిలాండ్ లో ఆడటానికి అవకాశం దక్కిన శార్దుల్ ఠాకూర్ మొదటి వన్ డే లో చాలా చెత్త బౌలింగ్ వేసి అందరిని నిరాశ పరిచాడు. ఒకే ఓవర్ లో 25 పరుగులు ఇచ్చి ఇండియా జట్టు ఓడిపోవడానికి ప్రత్యక్షంగా కారణం అయ్యాడు. న్యూజిలాండ్ పై జరిగిన ఆ మ్యాచ్ లో 9 ఓవర్లకు 63 పరుగులు ఇచ్చాడు శార్దుల్. కానీ బంగ్లాదేశ్ పై జరిగిన మొదటి వన్ డే లో దానికి ప్రయశ్చిత్తం చేసుకున్నాడు శార్దుల్ ఠాకూర్. తన 9 ఓవర్ల లో 21 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు, 2.3 ఎకానమీ తో అందరికంటే తక్కువ పరుగులు ఇచ్చాడు. అయితే బంగ్లాదేశ్ లో ఉన్నదీ బౌలింగ్ పిచ్. ఇక్కడ రాణించండం న్యూజిలాండ్ తో పోలిస్తే కొంచెమ్ సులభమే.

చెత్త బౌలింగ్ తో దీపక్ చాహర్

చాలా బాగా సాగుతున్న మ్యాచ్ లో సిల్లీ తప్పు చేసి ఇండియా ఓడిపోవడానికి కారణం అయ్యాడు దీపక్ చాహర్. 158 పరుగులకు 9 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ఇంక ఓడిపోతుంది అనుకున్న సమయం లో దేవుడిచ్చిన వరం లా వొచ్చాడు దీపక్ చాహర్. 44వ ఓవర్ లో ఒక నోబాల్ వేసి మూడు ఫోర్లు ఇచ్చి ఏకంగా 15 పరుగులు ఇచ్చేసాడు. అంతటి ఆగలేదు, చివరి ఓవర్లో కూడా ఇంకో నో బాల్ వేసి బంగ్లాదేశ్ కి విజయాన్ని బంగారు పళ్లెం లో పెట్టి మరీ ఇచ్చాడు.

డిసెంబర్ 7న బంగ్లాదేశ్ తో ఇండియా రెండో వన్ డే మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ ని సోనీ లివ్ లో మీరు ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju