NewsOrbit
హెల్త్

Prickly Water Lily: మఖానాలో ఉండే మైక్రో న్యూట్రియంట్స్! అంతులేని ఆరోగ్య ప్రయాజనాలు!!

Prickly Water Lily: మఖానా అంటే తామర గింజలు(Lotus Seeds) అని అర్థం. మాఖనాని ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తారు. ఈ మఖానా గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కాగా ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఈ మఖానాని పచ్చిగానే తినొచ్చు. లేదంటే ఉడకబెట్టుకొని ఆరగించవచ్చు. కొందరు వీటిని స్వీట్స్ లో లేదా కూరల్లో కూడా విరివిగా ఉపయోగిస్తుంటారు.

Prickly Water Lily: బోల్డన్ని మైక్రో న్యూట్రియంట్స్

Prickly Water Lily

మఖానా వెయిట్ లాస్‌ కోసం ప్రయత్నిస్తున్న వారికి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇందులోని ఫైబర్ ఆకలి త్వరగా అవకుండా చేస్తుంది. మఖానాలోని ప్రోటీన్స్, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, తదితర సూక్ష్మ పోషకాలు అనారోగ్య సమస్యలు దరిచేరనివ్వవు. ముఖ్యంగా కాల్షియం బోన్ హెల్త్ మెరుగుపరుస్తుంది. అలానే రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం శరీరంలోని జీవక్రియ వ్యవస్థను ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా, మెగ్నీషియం నరాల పని తీరుని మెరుగుపరుస్తుంది.

అంతులేని ఆరోగ్య ప్రయాజనాలు

Prickly Water Lily

మఖానాలోని గల్లిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్, ఎపికాటెచిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ వంటి ప్రాణాంతక జబ్బుల నుంచి కాపాడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వాపును కూడా తగ్గిస్తాయి. తద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, సోరియాసిస్ వంటి రోగాలు రాకుండా, వస్తే తీవ్రతరం కాకుండా ఈ గింజలతో ఆపడం సాధ్యమవుతుంది. మఖానాలోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతాయి. స్కిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేస్తాయి.

ఇందులో ఉన్న ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మఖానా గింజలు కేవలం ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మఖానాని రోజు వారి డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా మొటిమలు, చర్మంపై ముడతలు రావు. అలర్జీ, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపుబ్బరం లాంటి సమస్యలు ఉన్నవారు మాఖానాకి దూరంగా ఉండటం శ్రేయస్కరం.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri