NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

శీతాకాలంలో వెకేషన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఇండియాలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశాలు.. వాటి వివరాలు!

Ooty_Estate

శీతాకాలం రానే వచ్చింది. ఈ సమయంలో చాలా మంది వెకేషన్ వెళ్లేందుకు ఆలోచిస్తుంటారు. అలాంటప్పుడు ఎక్కడికి వెళ్లాలనే ప్రశ్న రావడం సమాజం. అలాంటి వారి కోసం ఈ రోజు మనం అత్యుత్తమమైన పర్యాటక ప్రదేశాల గురించి చర్చించబోతున్నాము. దక్షిణ భారతదేశంలో అనేక అందమైన హిల్ స్టేషన్లు ఉన్నాయి. ఈ శీతాకాలంలో రిఫ్రెష్ అవ్వడానికి ఈ ప్రాంతాలు ఎంతో అణువైనవి. బీచ్‌లు, అడవులు, బోటు ప్రయాణం, ట్రెక్కింగ్ వంటివి కలిగిన ప్రదేశాలు, వాటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Best-Places-to-Visit-in-Winters-in-South-India
Best-Places-to-Visit-in-Winters-in-South-India

కొడైకెనాల్ (తమిళనాడు)

దక్షిణ భారతదేశంలో కొడైకెనాల్ హిల్ స్టేషల్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సరస్సులు, జలపాతాలు, లోయలు, కొండలు… సందర్శకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి. కొడైకెనాల్ సరస్సు, డాల్ఫిన్ నోస్, వట్టకనల్ జలపాతం, కోకర్స్ వాక్, కురింజి అందవల్ దేవాలయం వంటి పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఉదయం పూట ఇక్కడి వాతావరణం పొగమంచుతో కప్పబడి ఉంటుంది.

Kodaikanal-Lake
Kodaikanal-Lake

ఊటీ (తమిళనాడు)

ఊటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శీతాకాలంలో ఊటీ అందాలు చూడటానికి పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఊటీ అనేది పశ్చిమ కనుమ పర్వతాల ఒడిలో ఉన్న చిన్న పట్టణం. దీన్ని ఉదగమండలం అని కూడా పిలుస్తుంటారు. బ్రిటీష్ కాలంలో మద్రాస్ రెసిడెన్సీ వేసవి రాజధానిగా పిలవబడింది. ఇక్కడ సరస్సులు, ఆనకట్టలు, ఉద్యానవనాలు, టీ ఫ్యాక్టరీలు, గిరిజనుల మ్యూజియం, నీలగిరి మౌంటైన్ రైల్వే, వారసత్వ కట్టడాలు ప్రసిద్ధి. ప్రకృతి ప్రేమికులకు ఇదోక అద్భుతమైన ప్రదేశం.

Ooty-Pykara-Lake
Ooty-Pykara-Lake

కొచ్చి (కేరళ)

దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పర్యాట ప్రదేశం ‘కొచ్చి’. ప్రతీ సీజన్‌లో పర్యాటకులను ఆకర్షించే ఏకైక ప్రాంతం. ఇక్కడి వాతావరణం ఎప్పుడూ అనుకూలంగా ఉంటుంది. ఫోర్ట్ కొచ్చి, మట్టంచెరి, కోదానంద్ ఎలిఫెంట్ ట్రైనింగ్ సెంటర్, మెరైన్ డ్రైవ్, హిల్ ప్యాలెస్ మ్యూజియం, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి, జ్యూ సినాగోగ్ అండ్ జ్యూ టౌన్ ఇక్కడి ప్రసిద్ధ ప్రాంతాలు.

Kochi-Beach-Kerala
Kochi-Beach-Kerala

అలెప్పీ (కేరళ)

ఇటలీలోని వెనిస్ నగరం మాదిరిగానే అలెప్పీ సహజ సౌందర్యాన్ని కనుగొన్న లార్డ్ కర్జన్ ఈ నగరాన్ని ‘వెనిస్ ఆఫ్ ది ఈస్ట్’ గా పేర్కొన్నాడు. అలెప్పీని కేరళ హౌజ్‌బోట్ రాజధానిగా పిలుస్తారు. బ్యాక్ వాటర్ టూరిజంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక్కడి జలమార్గాలు, బీచ్‌లు, హౌజ్‌బోట్‌లు సందర్శకులకు కట్టిపడేస్తాయి. అలప్పుజా బీచ్, మరారి బీచ్, పున్నప్రా బీచ్, అలెప్పీ లైట్ హౌజ్, వెంబనాడ్ సరస్సు, కారుమడి, ముల్లక్కల్ రాజేశ్వరి ఆలయం వంటి ప్రసిద్ధ ప్రాంతాలు ఉన్నాయి. శీతాకాలంలో విడిదికి మంచి ప్రాంతంమని చెప్పవచ్చు.

Alleppey-Houseboats
Alleppey-Houseboats

కూర్గ్ (కర్ణాటక)

దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పర్యాట ప్రదేశాల్లో కూర్గ్ ఒకటి. దీన్ని ‘ది స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. పశ్చిమ కనుమల పర్వాతాలలో చుట్టుముట్టబడిన ఈ కొండ పట్టణంలో హిల్ స్టేషన్, సుగంధ టీ, కాఫీ, మసాలా తోటలు కనిపిస్తాయి. ఆహ్లాదకర వాతావరణం ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తుంది. తడియాండమోల్ శిఖరం, రాజాస్ సీట్, ఇరుప్పు జలపాతం, అబ్బే జలపాతం, టిబెటన్ మొనాస్టరీ అండ్ గోల్డెన్ టెంపుల్, దుబరే ఏనుగుల శిబిరం. వంటి పర్యాటక ప్రదేశాలు కలవు.

Coorg-Hill-Station
Coorg-Hill-Station

పాండిచ్చేరి (తమిళనాడు)

తమిళనాడు రాజధాని చెన్నై నుంచి 165 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాండిచ్చేరి భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం. భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో పాండిచ్చేరి ఒకటి. ఇక్కడ తెల్లటి భవనాలు, చెట్లతో నిండిన వీధులు కనిపిస్తుంటాయి. శ్రీ అరబిందో ఆశ్రయం, పారడైజ్ బీచ్, రాక్ బీచ్, సెరీనిటీ బీచ్, సీ సైడ్ ప్రొమెనేడ్, ది బసిలికా ఆఫ్ ది సెక్రేడ్ హార్ట్ ఆఫ్ జీసన్ వంటి ప్రసిద్ధ ప్రాంతాలు ఉన్నాయి.

Pondicherry-Beach
Pondicherry-Beach

అరకులోయ (ఆంధ్రప్రదేశ్)

తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమిది. అరకు లోయ అందాలు, దట్టమైన అడవులు, కాఫీ తోటలు, జలపాతాలు, విస్తరించిన పంట పొలాలు పర్యాటకులకు మంత్రముగ్ధులను చేస్తుంది. విశాఖపట్నం నుంచి 111 కిలో మీటర్ల దూరంలో అరకులోయ ఉంది. శీతాకాలపు మధ్యాహ్న సమయంలో పసుపు సూర్యకాంతి కొండల మధ్య నుంచి విశాలమైన వరి పొలాల మీద పడినప్పుడు ఆ వీవ్ అద్భుతంగా ఉంటుంది.

Araku-Valley
Araku-Valley

లంబసింగి (ఆంధ్రప్రదేశ్)

లంబసింగి ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం. ఇది విశాఖపట్నం నుంచి 100 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తులో ఉంది. దట్టమైన అడువులల్లో వన్యప్రాణులు నివసిస్తూ ఉంటాయి. శీతాకాలంలో ఇక్కడ మంచు కురుస్తుంది. కొండకర్ల పక్షుల అభయారణ్యం, తుంజంగి రిజర్వాయర్, సుసాన్ గార్డెన్, బొజ్జన్న కొండ, ఘాట్ రోడ్, కొత్తపల్లి జలపాతాలు ఇక్కడ ప్రసిద్ధి.

Related posts

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?