NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Delhi Liquor Scam: ముగిసిన ఈడీ విచారణ .. మరో సారీ తప్పదా..?

Delhi Liquor Scam:  దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ వరుసగా రెండో రోజు సుదీర్ఘంగా విచారించింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు విచారణకు ఈడీ కార్యాలయానికి వెళ్లిన కవిత రాత్రి 9,40 గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు. కవిత ఇవేళ మొత్తం పది గంటల పాటు ఈడీ కార్యాలయంలో ఉండగా, ఆమెను సుమారు ఎనిమిదిన్నర గంటల పాటు ప్రశ్నించారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూపు అంటూ కొందరు నేతల పేర్లను ఈడీ పేర్కొంది. అందులో కవిత కూడా ఉన్నారు.

kalvakuntla kavitha

 

ఈ గ్రూప్ ను శరత్ చంద్రారెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ లు నియంత్రించారని ఈడీ ఆరోపిస్తొంది. కాగా కవిత వాడిన పది ఫోన్లను ఆధారాలు దొరక్కుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే తన ఫోన్లు అన్నింటినీ ఇవేళ కవిత ఈడీ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ అధికారులకు అందజేయడం ఆసక్తి కల్గించింది. వరుసగా రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన ఈడీ అధికారులు కవితను మరో సారి విచారణకు రమ్మని ఆదేశించారా లేదా అన్నది తెలియ రాలేదు. అయితే వచ్చే వారం మరో సారి కవితను విచారణకు పిలిచే అవకాశం ఉందని అంటున్నారు. కవిత నుండి స్వాధీనం చేసుకున్న ఫోన్లను విశ్లేషణ చేసిన తర్వాత తిరిగి మరో సారి విచారణకు రమ్మని పిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరో వైపు ఎమ్మెల్సీ కవితను ఇవేళ ఫోన్ల పైనే ప్రధానంగా విచారణ జరిపినట్లు తెలిసింది. ఈడీ అధికారులు కోరిన డాక్యుమెంట్లను కూడా కవిత న్యాయవాది సోమా భరత్ తీసుకువచ్చి అందజేశారు. కవితను ఇప్పటికే మూడు సార్లు ఈడీ అధికారులు ప్రశ్నించారు. మరో పక్క కవిత దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 24వ తేదీ సుప్రీం కోర్టులో విచారణకు రానున్నది. అయితే ఈ విచారణలో కవితకు సానుకూలంగా తీర్పు వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు ప్రముఖులు అరెస్టు కావడంతో కవిత అరెస్టుపైనా పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే తాను ఏ తప్పు చేయలేదనీ,  ఈ కేసుతో ఏ ప్రమేయం లేదని, రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగంగానే తనపై అభియోగాలు మోపుతున్నారని కవిత పేర్కొంటున్నారు. ఈ కేసు అంశంపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై అమ్ అద్మీ పార్టీ, బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తొంది.

మార్గదర్శి కేసులో రామోజీకి బిగ్ రిలీఫ్ .. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N