NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: బండి సంజయ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ .. ఇక జైలుకే

Breaking:  టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్టు అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హనుమకొండ కోర్టులో న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బండి సంజయ్ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్ ను తిరస్కరించారు. దీంతో బండి సంజయ్ తో సహా ఇతర నిందితులను పోలీసులు జైలుకు తరలించే ఏర్పాట్లు చేశారు.  టెన్త్ పేపర్ లీకేజీ కేసులో ఏ ఒ గా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను పోలీస్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఏ 2 గా బూర ప్రశాంత్, ఏ 3 గా మహేష్, ఏ 4 గా బాలుడు, ఏ 5 గా మోతం శివ గణ్ష్, ఏ 6 గా పోగు సుభాష్, ఏ 7 గా పోగు శశాంక్, ఏ 8 గా దూలం శ్రీకాంత్, ఏ 9 గా పెరుమాండ్ల శార్మిక్, ఏ 10 గా పోతబోయిన వసంత్ ను పోలీస్ రిమాండ్ రిపోర్టులో చేర్చారు.

Bandi Sanjay

 

పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుట్ర చేస్తున్నారనీ, అందుకే ముందస్తు చర్యగా అరెస్టు చేసినట్లు వరంగల్లు సీపీ రంగనాధ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. విచారణలో బండి సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నారనీ, బీజేపీలో చాలా మందికి పేపర్ షేర్ చేశారని సీపీ పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం పంపిన తర్వాత ప్రశాంత్ 149 మందితో మాట్లాడారని, పేపర్ లీక్ కు ముందు రోజు బండి సంజయ్, ప్రశాంత్ చాట్ చేసుకున్నారని, పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని సీపీ తెలిపారు. కమలాపూర్ స్కూల్ నుండి పేపర్ బయటకు వచ్చిందని చెప్పారు. పేపర్ లీక్ కేసులో మరి కొందరు కీలక సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని, అనవసరంగా ఈ కేసులో ఇరికించాలనే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు.

బండి సంజయ్ అరెస్టు పై లోక్ సభ స్పీకర్ కు సమాచారం ఇచ్చామని సీపీ వెల్లడించారు. విచారణలో ఏ 2 ప్రశాంత్ కూడా నేరాన్ని అంగీకరించారని, సంజయ్ ఫోన్ దొరికి ఉంటే చాలా విషయాలు బయటకు వచ్చేవి అని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రశాంత్ పేపర్ బయటకు పంపిన వెంటనే బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టారని, బండి సంజయ్ దురుద్దేశంతోనే ఇలా చేసినట్లు గా నిర్ధారణ అయ్యిందని సీపీ స్పష్టం చేశారు. మరో పక్క బండి సంజయ్ అరెస్టుపై తెలంగాణ బీజేపీ హైకోర్టు ఇవేళ దాఖలు చేసిన పిటిషన్ పై రేపు విచారణ జరగనున్నది. పేపర్ లీకేజీ వ్యవహారం, బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాగా బండి సంజయ్ రిమాండ్ పై రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు.

Breaking: టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ కు రిమాండ్

Related posts

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju