NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Weather Updates: ఏపిలోని 97 మండలాల్లో వడగాల్పులు

AP Weather Updates: ఏపిలో ఎండలు మండిపోతున్నాయి. ఎండ ప్రభావం రోజురోజుకు అధికంగా ఉంటోంది. భానుడి ప్రతాపం ఒక వైపు, మరో పక్క వైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. ఉదయం 10 గంటల తర్వత రోడ్డుపైకి జనాలు వెళ్లే పరిస్థితి కనబడటం లేదు. దీంతో మధ్యాహ్న సమయంలో రహదారులు నిర్మానిష్యంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రతపై ఏపీ విత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు తగు సూచనలు అందిస్తొంది. నిత్యం ఏయే ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందో ముందుగానే ప్రజలకు తెలియజేస్తొంది. వడగాల్పులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.

AP Weather Updates: hailstorm in 97 mandals

శనివారం రాష్ట్రంలోని 97 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రేపు (ఆదివారం) 47 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు మండలాల్లో, అనకాపల్లి ఒకటడి, బాపట్ల లో ఏడు, తూర్పు గోదావరిలో ఏడు, పశ్చిమ గోదావరి లో మూడు, ఏలూరు నాలుగు, గుంటూరులో అత్యధికంగా 17, కాకినాడ తొమ్మిది, కోనసీమలో పది,  కృష్ణాలో 15, ఎన్టీఆర్ జిల్లాలో ఎనిమిది. పల్నాడులో తొమ్మిది, మన్యం లో నాలుగు,  కడప జిల్లాలోని ఒక మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపుతుందని అధికారులు తెలిపారు.

 

మరో పక్క ద్రోణి ప్రభావంతో మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని చెప్పింది. నేడు మన్యం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపి విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju