NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: పద్మావతి మనసులోని మాట విక్కీని బాధపెట్టనుందా.. కృష్ణవేసిన, ప్లాన్ సక్సెస్ అయినట్టేనా…

nuvvu-nenu-prema-3-june-2023-today-327-episode-highlights

Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 325 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. నిన్నటి ఎపిసోడ్ లో, అను, ఆర్యాల మెహందీ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది.మెహందీ ఫంక్షన్ లో అందరూ వాళ్ళ మొదటి లవ్ స్టోరీ అని చెబుతూ ఉంటారు. విక్కీ,సిద్దు,ఆర్యాలు,చీరలు చుట్టుకుని, ఆ ఫంక్షన్ కి వస్తారు.

nuvvu-nenu-prema-3-june-2023-today-327-episode-highlights
nuvvu-nenu-prema-3-june-2023-today-327-episode-highlights

Nuvvu Nenu Prema: మొదటిసారి తన లవ్ స్టోరీ చెప్పిన పద్మావతి.

ఈరోజు ఎపిసోడ్ లో, పద్మావతిని అందరూ తన లవ్ స్టోరీ గురించి చెప్పమని అడుగుతారు. పద్మావతి, చెప్పను అంటుంది. దూరం నుంచి విక్కీ చూస్తూ ఎప్పుడైనా నీ మనసులో ఉన్న మాట చెప్పు పద్మావతి అని అనుకుంటాడు. అందరూ బలవంతం పెట్టడంతో పద్మావతి తన లవ్ స్టోరీ చెప్పడానికి ఒప్పుకుంటుంది. నేను ఒక అతనికి మనసు ఇచ్చాను. నాకు ప్రతి కష్టంలోనూ తోడుగా ఉంటాడు. అతను నా పక్కన ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. నా కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు తను సహాయం చేశాడు. అతను అంటే నాకు చాలా ఇష్టం తన మనసులో ఉన్న మాటని చెబుతుంది. అందరూ ఎవరు అతను ఎవరతను అని అడుగుతారు. విక్కీ కూడా దూరం నుంచి నా పేరు చెప్పు పద్మావతి ఇప్పటికైనా నీ మనసులో నేనే ఉన్నాను అని చెప్పు అని అనుకుంటాడు. కుచల ఇప్పుడు గనక నువ్వు విక్కీ పేరు చెప్తే ఈ పెళ్లి ఆపేస్తాను అని అనుకుంటున్నది. పద్మావతి చాలాసేపు తర్వాత, కృష్ణుడి ఫోటో వైపు చూపించి అతని గురించే అతని నా మనసులో ఉంది అతని నన్ను కాపాడుతుంది అని చెప్తుంది. అందరూ కృష్ణుడా అని అంటారు. దేవుడు అ దేవుడు నిన్ను కాపాడుతుంది. సరే ఇంకా మెహందీ ఫంక్షన్ మొదలుపెడదాం అని అరవింద అనగానే పద్మావతి అప్పుడేనా ఇంకా డాన్సులు, ఈరోజు మనకి మళ్ళీ రాదు అందుకని ఇప్పుడు మనం చిన్న పెద్ద మర్చిపోయాను అందరం ఆడి పాడదాం అని అంటుంది. అందరూ సరే అంటారు.

nuvvu-nenu-prema-3-june-2023-today-327-episode-highlights
nuvvu-nenu-prema-3-june-2023-today-327-episode-highlights

Krishna Mukunda Murari: నిజం తెలుసుకున్న రేవతి..బాధపడిన మురారి.. ముకుంద ఏం చేయనుంది…

విక్కీ, ఆర్యా ల లేడీ గెటప్

విక్కీ ఆర్య ఇద్దరు, దూరం నుండి మెహందీ ఫంక్షన్ చూస్తూ ఉంటారు. పద్మావతి ఎప్పుడైతే ఆటలు పాటలు అని అన్నది ఇక వీళ్ళు కూడా లోపలికి వెళ్తారు. పద్మావతి వాళ్లు నిన్నే పెళ్లాడుతా సినిమాలో పాటకి డాన్స్ వేస్తూ ఉంటారు. ఆ సినిమాలో పాటలు ఇక్కడ కూడా వీళ్లు, లేడీ గెటప్స్ వేసుకొని, ఫంక్షన్ లోకి వెళ్లి డాన్స్ వేస్తూ ఉంటారు. అలా డాన్స్ వేస్తున్న టైం లో సిద్దు, చీర ఊడిపోతుంది. ఒక ఆర్య కూడా డాన్స్ వేసే సమయంలో చేయడం తీసి తన పేస్ ని చూపిస్తూ వేస్తూ ఉంటాడు, ఇక వీళ్ళని చూసిన అందరూ షాక్ అవుతారు. ఇక అందరికీ దొరికిపోయావని అర్థం అవుతుంది, విక్కీ వాళ్ళకి. అరవింద ఆర్యా నీ చెవ్వు పట్టుకుని ఇక్కడికి రావద్దు అని చెప్పాను కదా అయినా ఎందుకు వచ్చావురా అని అంటుంది. అరవింద విక్కీతో ఏంటి విక్కీ నువ్వు కూడా వీళ్ళలాగా వీళ్ళకి నువ్వు చెప్తావనే కదా నిన్ను తోడుంచి వచ్చింది. వీలుతో నేను చేరిపోయి ఇలా చేస్తావా అని అంటుంది. సిద్దు వెంటనే అక్క ఆర్య లవ్ కి హెల్ప్ చేద్దామని వచ్చాము అని అంటాడు. కుశల వెంటనే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటుంది. ఆర్య అరవింద దగ్గరికి వెళ్లి అక్క ప్లీజ్ ఇప్పుడు ఒప్పుకో నేను ఇక్కడే ఉంటాను మీరు కూడా ఫంక్షన్ అయిపోయిన తర్వాత రండి అందరం కలిసి వెళ్లిపోదాం అని అంటాడు. అరవింద వద్దు మీరు వెళ్లిపోండి అని అంటుంది. సిద్దు వారిద్దరూ అరవింద కాళ్లు పట్టుకొని బతిమిలాడుతూ వుంటారు. ఇక చేసేదేలే అరవింద్ సరే, లోపల మాత్రం కూర్చోవద్దు దూరం నుంచి కూర్చొని చూడండి ఇక్కడ వద్దు అని, అంటుంది. ఇక విక్కీ సిద్దు ఆర్య ముగ్గురు దూరంగా ఒక సోఫాలో కూర్చొని వీళ్ళ ఫంక్షన్ చూస్తూ ఉంటారు.

nuvvu-nenu-prema-3-june-2023-today-327-episode-highlights
nuvvu-nenu-prema-3-june-2023-today-327-episode-highlights

Brahmamudi june 2nd Episode : రాహుల్ – స్వప్న పెళ్ళికి ముహూర్తం సిద్ధం చేసిన కుటుంబ సభ్యులు

కృష్ణ వేసిన ప్లాన్ కి అను బాధపడటం

అరవింద సరే మనం గోరింటాకు పెట్టుకుందాం పదండి అని అంటుంది. అరవింద అణు చేయి తీసుకొని గోరింటాకు పెడుతూ ఉంటుంది. నా గోరింటాకులో కృష్ణ ఇంటి దగ్గరే మార్చేస్తాడు. అవి కెమికల్స్ కలిపిన గోరింటాకు. అది కొంచెం పెట్టగానే వెంటనే అని చెయ్యి తీసుకొని అబ్బా మంట పడుతుంది చాలా నొప్పిగా ఉంది అని అరుస్తూ ఉంటుంది. అరవింద ఇంకా అందరూ కంగారు పడిపోతూ ఏమైంది ఏమైంది అని అడుగుతారు అని నా చెయ్యి మంటగా ఉంది నొప్పిగా ఉంది భరించలేకపోతున్నాను అని చెప్తుంది.అందరూ ఏమైతది అని కంగారుపడుతూ ఉంటారు. అను బాగా ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ఆర్య వచ్చి ఏమైంది అని అడుగుతాడు. అను ఏమైందో తెలియదు అండి చాలా మంటగా నొప్పిగా ఉంది అని అంటుంది. వెంటనే పద్మావతి నీళ్లు తీసుకువచ్చి కడిగేస్తుంది. గోరింటాకు ఫంక్షన్ లో ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటుంది. చెయ్యి కడిగేసుకున్నాక అను కొంచెం బానే ఉంది తగ్గింది అని చెప్తుంది. విక్కీ ఈ కోన్ ఎక్స్ప్రెస్ అయి ఉంటాయి చూసుకోకుండా తెచ్చుకుంటాము. అందుకే ఇలా జరిగింది అని అంటాడు. అరవింద నా వల్లే ఇలా జరిగింది అని బాధపడుతూ ఉంటుంది. మీ వల్ల ఏం కాదులే నీ షాపు వాళ్ళు చేసిన దానికి మీరేం చేస్తారు అని ఆండాలు అంటుంది. పద్మావతి వాళ్ళ ఇంట్లో తయారుచేసిన కోన్ తీసుకొచ్చి అరవింద్ కిచ్చి ఇప్పుడు అక్కకి పెట్టండి అని అంటుంది. అను అ కొను పెట్టించుకుంటుంది.

nuvvu-nenu-prema-3-june-2023-today-327-episode-highlights
nuvvu-nenu-prema-3-june-2023-today-327-episode-highlights

కుచల హడావిడి

కుచల పార్వతి ని పిలిచి, ఏం చేస్తుంది మీ కూతురు అని అడుగుతుంది. అరవింద్ గారి దగ్గర ఉందనుకుంటానండి పిలుస్తాను అంటుంది పార్వతి. ఏం అవసరం లేదు కానీ ఇందాక ఎప్పుడూ టిఫిన్ పెడతా అన్నారు ఇంత వరకు పెట్టలేదు. మీరు ఏదైనా అడుక్కుంటేనే చేస్తారా లేకపోతే పెట్టరా అని అంటుంది. అయ్యో క్షమించండి వదినగారు ఇప్పుడే తీసుకొస్తాను అని అంటుంది పార్వతి. పార్వతి వెళ్ళిన తర్వాత కుచల ఈ మాత్రం భయం ఉండాలి అని అనుకుంటునంది. ఆండాలు దూరం నుంచికుచల ను చూస్తుంది. ఇక కుచ్చుల దగ్గరికి వెళుతుంది. కుచల కి పార్వతి దోశ తీసుకొని వస్తుంది. ఏంటి దోస మాడిపోయింది ఇలా నల్లగా ఉన్నదో నేను తినను అంటుంది కుచల. అరే లేదు వదిన గారు బానే ఉంది అంటుంది పార్వతి. అంటే నేను అబద్ధం చెప్తున్నాను ఈదోస నల్లగా ఉంది నేను తినను అని అంటాను.

nuvvu-nenu-prema-3-june-2023-today-327-episode-highlights
nuvvu-nenu-prema-3-june-2023-today-327-episode-highlights

వెంటనే ఆండాలు దోశ తీసుకొని నేను తిని చెప్తాను ఎలా ఉందో అని, దోస మొత్తం శుభ్రంగా తిని చాలా బాగుంది టేస్ట్. పార్వతీ నీ చేత చేసావంటే ఏదైనా చాలా బాగుంటుంది, అని దోశ మొత్తం ఆండాలు తినేస్తుంది. పార్వతి వదిన గారు మీకు ఇంకా దోశ తీసుకొస్తాను అని వెళ్లబోతుండగా, దోస వద్దు నాకు ఇడ్లీ తీసుకురా అని అంటుంది. పార్వతి సరే అని లోపలికి వెళ్తుంది….
రేపటి ఎపిసోడ్ లో,పద్మావతి గోరింటాకు రుబ్బుతూ ఉంటుంది. అదే టైం కి విక్కీ ఫోన్ మాట్లాడుతూ అటువైపుకి వస్తాడు. పద్మావతి గోరింటాకు పెట్టుకోబోతుండగా, విక్కీ నేను పెడతాను గోరింటాకు అని పద్మావతి చేయి తీసుకొని గోరింటాకు పెడతాడు.పద్మావతి వీక్లీ ఒకరికి ఒకరు అలానే చూసుకుంటూ ఉంటారు… చూడాలి రేపు ఏం జరుగుతుందో…

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N