NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu December 23 2023 Episode 2060: అమృతవాళ్లు అనుకున్నట్లుగా అంజలి శరీరంలో నుంచి లక్ష్మీ ఆత్మను బంధిస్తారా లేదా.

Kumkuma Puvvu Today Episode December 23 2023 Episode 2060  Highlights

Kumkuma Puvvu December 23 2023 Episode 2060:  అమృత మీరు చెప్పినట్లుగానే మనము ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాము ఆశ అలా రెచ్చగొట్టినట్లు మాట్లాడుతుంటే మీరు ఎక్కడ కోపం తెచ్చుకొని కావేరి వదిన వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళమంటారేమో అని చాలా భయం వేసింది కానీ మీరే మీ ఇంట్లో నుంచి వెళతాము అని చెప్పగానే కొంచెం టెన్షన్ తగ్గింది ఎలా అయితేనేo ఇంట్లో నుంచి బయటికి వచ్చాము అబ్బా ఇంకా ఎంతసేపు అండి నడిచి నడిచి కాళ్ళు నొప్పి వస్తున్నాయి ఇంకా ఎంతసేపు నడవాలి అంటుంది అమృత. అరుణ్ కుమార్ ఇదిగో అమృత కాసేపు ఓపిక పట్టుకో అంజలి శ్వేతను స్కూల్ డ్రాప్ చేసి ఇక్కడి నుంచి ఇంటికి వెళుతుంది అప్పుడు మనం అనుకున్న డ్రామా మొదలు పెట్టాలి అంటాడు. అమృత అది సరేనండీ కానీ మీరు ఇలా రోడ్డుమీద ఉండడమేంటి మీరు ఎంతో గొప్పగా బతికిన వాళ్లు కదా మీరు ఇలా రోడ్డుమీదికి రావడానికి మీకు ఏమి ఇబ్బంది అనిపించడం లేదా అంటుంది. అరుణ్ కుమార్ అలా ఏమీ లేదు అమృత నేను ఒకప్పుడు అంజలిని ఎన్నోసార్లు చీకొట్టాను కానీ దేవుడు నాకు తన రుణం తీర్చుకునే అవకాశాన్ని ఈ విధంగా ఇచ్చాడు నేను ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు కష్టకాల జీవితం అనుభవిస్తే తప్పేమీ లేదు మనం అనుకున్న ప్లాన్ ప్రకారం అంతా జరిగితే తరువాత జీవితాంతం సుఖంగా ఉండొచ్చు సరే అమృత అదిగో అంజలి వస్తుంది డ్రామా మొదలు పెట్టు అంటాడు.

Kumkuma Puvvu Today Episode December 23 2023 Episode 2060  Highlights
Kumkuma Puvvu Today Episode December 23 2023 Episode 2060  Highlights

అమృత అయ్యో మనకేంటండీ ఈ గతి అందరూ ఉన్నా ఇలా నడిరోడ్డు మీద ఉండాల్సి వచ్చింది అంటూ ఏడుస్తూ ఉంటుంది అమృత. అంజలి శరీరంలో ఉన్న లక్ష్మీ ఆత్మ అయ్యో అమృత ఆంటీ అరుణ్ అంకుల్ మీరేంటి ఇలా రోడ్డుమీద కూర్చుని ఏడుస్తున్నారు ఏమయింది ఎందుకలా బాధపడుతున్నారు అంటుంది. అమృత అయ్యో లక్ష్మి మా బాధలేవో మేము పడతాము నువ్వు ఎందుకమ్మా ఇందులో కలగ చేసుకుంటావు నువ్వు ఇంటికి వెళ్ళు లేదంటే మీ అత్తయ్య మీ ఆయన చూశారంటే మళ్ళీ వాళ్ళు మాతో మాట్లాడుతున్నావ్ అని నిన్ను తిడతారు అంటుంది. లక్ష్మి అదేం లేదండి మా ఇంట్లో నేను ఏది చెప్పితే దానికి వాళ్ళు ఓకే అంటారు. అది పక్కన పెట్టండి మీరు ఇలా నడిరోడ్డు మీద కూర్చొని ఏడుస్తున్నారు ఎందుకు చెప్పండి అని అడుగుతుంది. అమృత మా ఇంట్లో ఆశ ఉంది కదమ్మాఆ ఆశ నా కూతురు లక్ష్మీ ఫోటోలు ఈ ఒక్కటి కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని మా అంజలి జ్ఞాపకాలు అన్నింటిని పగలకొడుతూ ఉంటే మేము ఇదేంటి అని అడిగాము అందులోనే గొడవ పెద్దగా అయింది దాంతో కావేరి వదిన చంద్రం అన్నయ్య ఆశ అందరూ ఒకటే పోయి ఈ ఇంట్లో ఉంటే మీరైనా ఉండాలి లేదంటే మేమైనా ఉండాలి అనే కాడికి వచ్చింది ఎంతైనా కావేరి నా ఆడపడుచు కదా వాళ్ళని ఎలా వెళ్ళమని చెబుతాను చెప్పు అందుకే మేమే ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాము అంటుంది.లక్ష్మి అయ్యో అవునా అంత దాకా జరిగిందా అయితే మీరు ఒక పని చేయండి ఇప్పుడు నాతో మా ఇంటికి రండి ఒక రెండు రోజులు ఉండి తర్వాత ఎక్కడైనా ఇల్లు చూసుకొని వెళ్లిపోండి అప్పటివరకు మా ఇంట్లో ఉండండి మీరు ఏమి మాట్లాడకుండా ఇప్పుడు నాతో రండి అని లక్ష్మి అరుణ్ అమృతలను తీసుకొని వెళుతుంది.

Kumkuma Puvvu Today Episode December 23 2023 Episode 2060  Highlights
Kumkuma Puvvu Today Episode December 23 2023 Episode 2060  Highlights

కట్ చేస్తే ఆశ మేన బావ యుగేందర్ కు ఐపీఎస్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి హైదరాబాదులో జాబ్ వస్తుంది. యుగంధర్ ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ నాన్నకి జాబ్ వచ్చిన విషయం చెబుతాడు యుగేందర్ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంది నాన్న నువ్వు అనుకున్నది సాధించావు అలాగే మేము చూసినా సంబంధాల్లో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని నువ్వు ఒక ఇంటివాడి అయ్యావంటే మా బాధ్యత తీరుతుంది ఇక సంతోషంగా నువ్వు పిల్లాపాపలతో కలగాలని ఉండొచ్చు అని మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకు వస్తారు యుగేందర్ తల్లిదండ్రులు. యుగేందర్ షట్ అప్ మీరింకోసారి నా పెళ్లి ప్రస్తావనను మీ చేతిలోకి తీసుకున్నారనుకో నేను ఊరుకునేది లేదు నేను ఈ జాబ్ కొట్టింది ఆశా కోసం ఆశ నాకు సవాల్ విసరకపోతే నేను ఇంత చదివి ఈ జాబ్ కొట్టే వాడిని కాదు కాబట్టి నేను ఆశని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. యుగేందర్ తల్లి అదేంటి నాన్న ఆశకి పెళ్లయిపోయి పిల్లలు కూడా అయి ఉంటే ఏం చేస్తావు అని అంటుంది యుగేందర్ ఆశకి పిల్లలు అయినా సరే పిల్లల తల్లి అని నాకేం అభ్యంతరం లేదు ఎలాగైనా ఆశని నా సొంతం చేసుకోవడమే నా ధ్యేయo ఎందుకంటే నేను ఎన్ని జన్మలెత్తినా తనను కోరుకునే స్థాయి నాకు లేదంట ఇప్పుడు ఆ స్థాయి వచ్చింది కదా కాబట్టి ఆశను ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు యుగేందర్ మీరు ఇంకోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు రేపే నా హైదరాబాద్ ప్రయాణం అంటాడు.

Kumkuma Puvvu Today Episode December 23 2023 Episode 2060  Highlights
Kumkuma Puvvu Today Episode December 23 2023 Episode 2060  Highlights

కట్ చేస్తే పద్మావతి ఒరేయ్ సాగర మనం త్వరగా లక్ష్మీ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి లేదంటే ఇలా ఎన్ని రోజులు రా అని అంటుంది.అప్పుడే లక్ష్మి అమృత అరుణ్ కుమార్ ను ఇంటికి తీసుకొని రావడం చూస్తారు సాగర్ కొండమ్మ పద్మావతి షాక్ అవుతారు. సాగర్ అదేంటి లక్ష్మి వీళ్ళు నీకు ఎక్కడ తగిలారు వీళ్ళని ఎందుకు నీ వెంట పెట్టుకుని వస్తున్నావు అని అడుగుతాడు. లక్ష్మి అక్కడ వాళ్ళ ఇంట్లో గొడవ జరిగిందంట అందులో నువ్వా నేనా అనే దగ్గరికి వచ్చిందంట కాబట్టి అంకుల్ వాళ్లే బయటికి వచ్చారంట వీళ్లు నడిరోడ్డు మీద ఎటు వెళ్లాలో తెలియక కూర్చుని ఉంటే నేనే మన ఇంటికి తీసుకువచ్చాను అంటుంది. సాగర్ ఉంటే ఉండని నడిరోడ్డు మీద నీకేం అవసరం లక్ష్మి వీళ్లను తీసుకురావడానికి అంటాడు.

Kumkuma Puvvu Today Episode December 23 2023 Episode 2060  Highlights
Kumkuma Puvvu Today Episode December 23 2023 Episode 2060  Highlights

లక్ష్మి ఆపండికష్టాల్లో ఉన్న వాళ్లను ఎదురుగా పెట్టుకొని ఇలాగే నా మాట్లాడేది ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి గొప్పగా బతికి రోడ్డు మీద పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్లందరినీ నేనేమీ తీసుకురాలేదే నాకు తెలిసిన వాళ్ళు అయ్యో అని తీసుకువచ్చాను అందులో తప్పేముంది నేను రమ్మని పిలుస్తున్న వాళ్లే రమ్మని చెప్పారు కానీ ఒక రెండు రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి అని నేనే బలవంతంగా తీసుకువచ్చాను వాళ్లు ఎక్కడైనా ఆధారం చూసుకునేంతవరకు ఇక్కడే ఉంటారు అని అంటుంది. పద్మావతి ఉంటే ఉండనివ్వు లక్ష్మి కానీ నీ విషయంలో ఇంకోసారి ఏదైనా ప్రయత్నం చేయాలని చూస్తే నేను ఊరుకోను అంటుంది.అరుణ్ కుమార్ అయ్యో మేము అలా ఎందుకు చేస్తామండి రెండు రోజుల్లో మా దారి మేము చూసుకుని వెళ్ళిపోతాము అంటాడు.

Kumkuma Puvvu Today Episode December 23 2023 Episode 2060  Highlights
Kumkuma Puvvu Today Episode December 23 2023 Episode 2060  Highlights

లక్ష్మి వీళ్ళని ఇంకెవరు ఏమీ అనొద్దు మీరు రండి మీకు రూమ్ చూపిస్తాను అని తీసుకువెళ్లి రూమ్ చూపిస్తుంది మీకు ఇలాంటి అవసరం ఉన్న నన్ను పిలవండి నేను తీసుకు వస్తాను మీరు ఎవరికి భయపడొద్దు మీకు కావాల్సినన్ని రోజులు ఇక్కడే ఉండండి అని చెప్పి వెళుతుంది లక్ష్మి. అమృత లక్ష్మీ వెళ్ళిపోయాక చాలా సంతోషంగా ఉందండి మనం అనుకున్నట్టుగానే ఈ సాగర్ ఇంట్లోకి వచ్చేసాము అంటుంది అరుణ్ కుమార్ అవునా ఇప్పుడు ఇంట్లోకి వచ్చాము తరువాత ఇక మనం చేయవలసిన పని ఒక్కటే ఎలాగైన ఆ పకీర్ బాబా సహాయంతో అంజలి శరీరంలో నుంచి లక్ష్మీ ఆత్మను తరిమి వేయడం ఇక మనం ఆ ప్రయత్నంలో ఉందాం అంటాడు అరుణ్

Related posts

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N