NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Mudragada Padmanabham: కిర్లంపూడిలో ముద్రగడ ఇంట అభిమానుల కోలాహలం .. పొలిటికల్ రీ ఎంట్రీ ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ .. కుమారుడు ఏమన్నారంటే ..?

Mudragada Padmanabham: గత వారం రోజులుగా కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నూతన సంవత్సరం మొదటి రోజు పొలిటికల్ రీ ఎంట్రీపై ప్రకటన విడుదల చేస్తారని, వైసీపీలో చేరనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇవేళ పెద్ద సంఖ్యలో కాపు నేతలు, అభిమానులు, కార్యకర్తలు కిర్లంపూడి లోని ఆయన నివాసానికి చేరుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Mudragada Padmanabham

ముద్రగడ వైసీపీలో చేరితే ఆయన కుమారుడికి అసెంబ్లీ సీటుతో పాటు కాకినాడ ఎంపీ టికెట్ ఇవ్వడానికి వైసీపీ సుముఖంగా ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఒక వేళ పోటీకి దూరంగా ఉండి కుమారుడిని అసెంబ్లీ బరిలోకి దింపితే ఆయన రాబోయే రోజుల్లో రాజ్యసభ సీటు ఇవ్వడానికి కూడా సీఎం జగన్ సంసిగ్దత వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు ముద్రగడతో పలు మార్లు చర్చలు కూడా జరిపారు.

దాదాపు నాలుగేళ్ల తర్వాత కొత్త సంవత్సరం ప్రారంభం రోజున గోదావరి జిల్లాలోని పలువురు నేతలు, తమ అనుచరులతో ముద్రగడ సమావేశం ఏర్పాటు చేయడంతో ఆయన పొలిటికల్ రీ ఎంట్రీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తే తాను పోటీకి దిగుతానని ముద్రగడ ప్రకటించారు. అయితే పిఠాపురం వైసీపీ టికెట్ ను ఎంపీ వంగా గీతకు ఖరారు చేసింది పార్టీ అధిష్టానం. దీంతో ముద్రగడ కోరితే ఆయన కుమారుడికి పెద్దాపురం సీటు కేటాయిస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది.

అయితే ముద్రగడ కాకినాడ పార్లమెంట్ కు పోటీ చేస్తారా లేక పెద్దాపురం నుండి తను గానూ తన కుమారుడిని గానీ బరిలోకి దింపుతారా అనే దానిపై ఇంకా ప్రకటన చేయలేదు. ఇవేళ ముద్రగడను కలిసిన పలువురు నేతలు మాత్రం ముద్రగడ ఎక్కడ పోటీ చేసినా గెలుపు నల్లేరు మీద నడకేనని పేర్కొన్నారు. అయితే ఇంత వరకూ నిర్ణయం జరగలేదని చెప్పారు. సంక్రాంతి లోపు అభిమానులతో మరో సారి సమావేశం నిర్వహించి నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు.

పొలిటికల్ రీ ఎంట్రీపై ఎలాంటి ప్లాన్ చేశారు అనేది తన తండ్రి ముద్రగడ పద్మనాభమే చెబుతారని ఆయన చిన్న కుమారుడు చల్లారావు (గిరిబాబు) తెలిపారు. ప్రతి ఏడాది తాము న్యూఇయర్ వేడుకలు నిర్వహించమనీ, అయినా కూడా ప్రజల మధ్యన తండ్రి ముద్రగడ ఉన్నారనే విషయం ఈ జనవరి 1 ద్వారా నిరూపణ అయ్యిందన్నారు. తన తండ్రిపై చాలా మందికి అభిమానం, ప్రేమ ఉన్నాయన్నారు. అన్ని జిల్లాల నుండి కాపు నేతలు వచ్చి తండ్రి ముద్రగడ  పట్ల ప్రేమ చూపుతున్నారన్నారు. తండ్రి ముద్రగడ పద్మనాభం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తామంతా కట్టుబడి ఉంటామని తెలిపారు.

New Year Celebrations 2024: సీఎం జగన్ కు వేదపండితుల ఆశీర్వచనాలు, నేతలు, ఉన్నధికారుల శుభాకాంక్షలు

Related posts

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N