NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Happy Birthday Sukumar: విద్యను పంచే గురువు..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బర్త్ డే స్పెషల్ న్యూస్…!!

Happy Birthday Sukumar: నేడు టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ జన్మదినోత్సవం. దీంతో సోషల్ మీడియాలో చాలామంది ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో దర్శకుడిగా మాత్రమే కాకుండా రచయితిగా మరియు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో రాకముందు లెక్కల మాస్టారుగా రాణించారు. 2004వ సంవత్సరంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో “ఆర్య” సినిమాతో దర్శకుడిగా ఆయన ప్రయాణం స్టార్ట్ అయింది. ఆ తర్వాత రామ్ పోతినేని తో రెండవ సినిమా “జగడం” చేయడం జరిగింది. ఆర్య అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. మూడో చిత్రంగా మళ్ళీ అల్లు అర్జున్ తో “ఆర్య 2” ఓ మాదిరి హిట్ అందుకున్నారు.

Tollywood Creative Director Sukumar Birthday Special News

నాలుగో చిత్రం అక్కినేని నాగచైతన్య తో “100% లవ్” చేసి కూడా విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత 2014లో మహేష్ బాబుతో “వన్ నేనొక్కడినే” చిత్రాన్ని తీశారు. ఈ సినిమా పరాజయం పాలయ్యింది. 2016లో జూనియర్ ఎన్టీఆర్ తో “నాన్నకు ప్రేమతో” తీసి విజయాన్ని అందుకున్నారు. 2018లో రామ్ చరణ్ తో రంగస్థలం, ఆ తర్వాత 2021లో బన్నీతో పుష్ప చేసి బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ విజయాలు తన ఖాతాలో నమోదు చేసుకోవడం జరిగింది. పుష్ప సినిమాతో ఫస్ట్ టైం పాన్ ఇండియా స్థాయిలో సుకుమార్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హిందీలో కనీసం ప్రమోషన్స్ చేయకపోయినా గాని ₹100 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. “పుష్ప” అల్లు అర్జున్ కి ఎంత పేరు తీసుకొచ్చిందో దర్శకుడు సుకుమార్ కి కూడా అదే స్థాయిలో పేరు తీసుకొచ్చింది.

Tollywood Creative Director Sukumar Birthday Special News

“పుష్ప” సినిమాకి దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అవార్డు లభించింది. ఈ సినిమాకి గాను ఉత్తమ జాతీయ నటుడు అవార్డు కూడా గత ఏడాది బన్నీకి లభించింది. ప్రస్తుతం సుకుమార్ పుష్ప సెకండ్ పార్ట్ సినిమా షూటింగ్ చేస్తున్నారు. నేడు ఆయన 50వ జన్మదినోత్సవం. 11 జనవరి 1970న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలో మట్టపారు గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుండి పుస్తకాలు చదివే అలవాటున్న సుకుమారి ఎక్కువగా గ్రామంలో గ్రంథాలయంలో ఉండేవాడు. అక్కడే ఎక్కువ పుస్తక పఠనం చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత కాలేజీలలో మాథ్స్ టీచర్ గా కూడా విద్యార్థులకు విద్యను అందించడం జరిగింది. చిన్నప్పటి నుంచి కవితలు రాసే అలవాటు సుకుమార్ కి ఉంది. కళాశాలలో లెక్కల మీద మంచి పట్టు సాధించిన తర్వాత ఇంటి వద్ద ట్యూషన్స్ చెప్పేవాడు.

Tollywood Creative Director Sukumar Birthday Special News

ఆ రకంగా లెక్కల్లో పట్టు సాధించాక 1998లో కాకినాడలో ఒక పెద్ద కాలేజీలో నెలకు ఆ రోజుల్లోనే 75 వేల రూపాయల జీతంతో మాథ్స్ పాఠాలు విద్యార్థులకు చెప్పే బోధకుడిగా పనిచేయడం జరిగింది. కానీ సినిమాల మీద మకువతో 2000 సంవత్సరంలో 75 వేల రూపాయల జీతం వదులుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొదట ఎడిటర్ మోహన్ దగ్గర సహాయకుడిగా పనిచేశారు. అలా ఇండస్ట్రీలో రాణిస్తూ 2004వ సంవత్సరంలో “ఆర్య” సినిమాతో మొదటి హిట్ అందుకుని ఇప్పటివరకు తిరుగులేని దర్శకుడిగా సుకుమార్ కెరియర్ సాగింది. సుకుమార్ వ్యక్తిగత జీవితంలో ఒకటి గమనిస్తే.. ఆయనలో ఉన్న ఎలాంటి విద్య అయినా దాచుకోకుండా ఇతరులకు అందించారు. మాథ్స్ టీచర్ గా జూనియర్ విద్యార్థులకు గణితం పాఠాలు అందించారు. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ దర్శకుడిగా తన దగ్గర పని చేసిన అసిస్టెంట్ దర్శకులకు..డైరేక్షన్ లో మెలుకువలు నేర్పి  మరిన్ని సినిమాలు చేసే అవకాశం కల్పించారు.

Tollywood Creative Director Sukumar Birthday Special News

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది టాప్ మోస్ట్ దర్శకులు ఉన్నారు. కానీ ఎప్పుడూ వారి దగ్గర పని చేసిన వారికి దర్శకుడిగా మరో అవకాశం రానివ్వకుండా.. ఎక్కడికక్కడ తొక్కేసే పరిస్థితి. కానీ దర్శకుడు సుకుమార్ విషయంలో మాత్రం తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లకు.. ముందుకెళ్లే అవకాశాన్ని కల్పించారు. ఈ రకంగా సుకుమార్ అవకాశాలు ఇవ్వటం బట్టే తెలుగు చలనచిత్ర రంగానికి దర్శకుడు బుచ్చిబాబు లాంటి వారు  పరిచయమయ్యారు. ఒక్క బుచ్చిబాబు మాత్రమే కాదు “దసరా” డైరెక్టర్ శ్రీకాంత్ ఓద్దెల, “కుమారి 21ఎఫ్” దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్, ఇంకా డైరెక్టర్ జక్క హరి ప్రసాద్, మరో దర్శకుడు వేమారెడ్డి, శ్రీకాంత్ విస్సా లాంటివారికి డైరెక్టర్ సుకుమార్ గురువు. వీళ్లంతా సుకుమార్ దగ్గర పని చేసిన అసిస్టెంట్ దర్శకులు. తన దగ్గర పనిచేసే అందరి విషయంలో సుకుమార్ చాలా శ్రద్ధ తీసుకుంటారట. ఒక్కసారి.. నా వాడు అనుకుంటే అతని కోసం ఎంత దూరమైనా.. వెళ్లే మనిషి అంట.  సో నేడు ఆయన 50వ జన్మదినోత్సవం కావటంతో.. సోషల్ మీడియాలో డైరెక్టర్ సుకుమార్ అభిమానులు.. భారీ ఎత్తున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri