NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీలో చేరిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే నలగట్ల స్వామి దాసు

YSRCP: తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు వైసీపీలో చేరారు. ఈ రోజు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా స్వామిదాసు, ఆయన సతీమణి సుధారాణి పార్టీ కండువా కప్పుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని నిన్న సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయిన సందర్భంలో తిరువూరు టికెట్ నల్లగట్ల స్వామిదాసుకు ఇవ్వాలని కోరినట్లుగా తెలిసింది. అలానే మరో ఒకటి రెండు నియోజకవర్గాలు తాను సూచించిన నేతలకు ఇవ్వాలని కోరారు.

నాని వినతిపై సీఎం జగన్ కొంత మేర సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నల్లగట్ల స్వామిదాసు దంపతులు గురువారం  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుని సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.

కాగా, స్వామిదాసు 1994, 1999 లో రెండు సార్లు తిరువురు ఎమ్మెల్యేగా టీడీపీ తరపున గెలుపొందారు. వైసీపీ లో చేరిన అనంతరం స్వామిదాసు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తన నివాసానికి వెళితే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని అన్నారు.

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

Related posts

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?