NewsOrbit
Andhra Pradesh Political News Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయాలు

TDP-YSRCP: టీడీపీ – వైసీపీ ఒకేసారి రెండు లైవ్‌లు… చెవులు ద‌ద్ద‌రిల్లాయ్‌..!

Live shows between TDP and YRCP at same time 

TDP-YSRCP: ఏపీలో శ‌నివారం ఒక్క రోజు ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. చెవులు ద‌ద్ద‌రిల్లిపోయిన ప‌రిస్థితి క‌నిపించింది. ఒక‌వైపు అధికార పార్టీ వైసీపీ, మ‌రోవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, ఇంకో వైపు.. కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌లు భారీ ఎత్తున స‌భ‌లు నిర్వ‌హించాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్‌, అటు టీడీపీ అదినేత చంద్ర‌బాబు కూడా.. పెద్ద ఎత్తున ఈ స‌భ‌ల్లో విమర్శ‌లు.. ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఇక‌, పార్టీ నేత‌ల‌తో నిర్వ‌హించిన కార్క్ర‌మాల్లో ష‌ర్మిల రెచ్చిపోయారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇది నాంది అన్న‌ట్టుగా మూడు ప‌క్షాలు కూడా.. మైకులు ద‌ద్ద‌రిల్లే మాదిరిగా విమ‌ర్శ‌లు సంధించుకున్నారు.

TDP YRCP two live shows at same time
TDP YRCP two live shows at same time

ఒకరు రాష్ట్రానికి ప‌ట్టిన శ‌ని వ‌దులుతుంద‌ని అంటే.. మ‌రొక‌రు.. రాష్ట్రానికి ఉన్న శ‌కుని వ‌దిలిపోతాడ‌ని అన్నారు. అటు.. వైపు మాట‌ల తూటాలు పేలితే.. ఇటు వైపు అంత‌కుమించిన బాంబులే పేలాయి. వ‌య‌సు ఫ్యాక్ట‌ర్ కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసింది. సీఎం జ‌గ‌న్.. చంద్ర‌బాబును 75 ఏళ్ల వృద్ధుడు అని పిలిస్తే.. అదే చంద్ర‌బాబు త‌న‌కు వ‌య‌సుతో సంబంధం లేద‌ని.. ఆలోచ‌న‌ల్లో తాను యువ‌కుడినేన‌ని చెప్పుకొచ్చారు. ఇలా.. ఇరు ప‌క్షాల మ‌ధ్య పోటా పోటీ వ్యాఖ్య‌లు చోటు చేసుకున్నాయి. ష‌ర్మిల ఏకంగా.. అన్న‌పైనా, పార్టీపైనా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

TDP-YRCP two live shows at same time
TDP YRCP two live shows at same time

దీంతో ప్ర‌ధాన చానెళ్లో ఎవ‌రి ప్ర‌సంగాల‌ను ప్లే చేయాలో తెలియ‌క‌.. స్క్రీన్ల‌ను రెండు భాగాలుగా విడ‌దీసి ప్ర‌సారం చేశారు. ఇక‌, ఆయా వ‌ర్గాల చానెళ్లు ఎవ‌రికి వారే ఇచ్చుకున్నారు. మ‌రోవైపు..ఎటు చూసినా.. జ‌నాల‌కు నాయ‌కుల ప్ర‌సంగాలే వినిపించాయి. బ‌య‌ట‌కు వెళ్లిన‌.. ఫోన్లు ఆన్ చేసినా.. అంతా ప్ర‌సంగాల ప‌రంప‌ర‌, పార్టీల పాట‌లు.. ఇలా అబ్బో అనిపించేలా శ‌నివారం హోరెత్తిపోయింది. అయితే.. క‌థ ఇక్క‌డితో అయి పోలేదు. అస‌లు సిస‌లు ప్ర‌చారం ముందుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

TDP YRCP two live shows at same time
TDP YRCP two live shows at same time

స్థార్ కాదు.. ఫైవ్ స్టార్ క్యాంపెయిన‌ర్లు.. రాష్ట్రంలోకి అడుగు పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి వంటివారు బీజేపీ త‌ర‌ఫున‌, తెలంగాణ నుంచి కేసీఆర్ కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈయ‌న వైసీపీ త‌ర‌ఫున నేరుగా బ‌రిలోకి దిగుతార‌ని చెబుతున్నారు. అదేస‌మ‌యంలో జ‌న‌సేన అదినేత ప‌వ‌న్‌, ఆయ‌న మెగా కుటుంబం ఈ సారి ప్ర‌చారానికి రానుంది. అదేవిధంగా అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్న విజ‌య‌మ్మ కుమారుడి పక్షాన మైకు ప‌ట్టుకోనున్నారు. టీడీపీ నుంచి నారా ప్యామిలీ, నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి, బాల‌య్య‌.. వంటివారు దిగిపోనున్నారు. ఇక‌, అప్పుడు చూడాలి సామీ.. ప్ర‌జ‌ల చెవుల్లోకి ర‌క్తం కార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!