NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Janasena First List: టీడీపీ, జనసేన అభ్యర్ధులను ఖరారు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ..ఫస్ట్ లిస్ట్ ఎప్పుడంటే..?

TDP Janasena First List:  ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్ధుల ఎంపికలో వైసీపీ ముందంజలో ఉంది. ఇప్పటికే సుమారు 70 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఖరారు చేసింది వైసీపీ. కానీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేనకు సంబంధించి అభ్యర్ధుల జాబితా ఇంత వరకూ విడుదల కాకపోవడంతో ఆ పార్టీ నేతల్లో ఓ టెన్షన్ వాతావరణం నెలకొంది.

ప్రతి నియోజకవర్గం నుండి ఇద్దరు ముగ్గురు చొప్పున ఆశావహులు ఉండటం, జనసేన పొత్తు నేపథ్యంలో సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై ఇరుపార్టీల అధినేతలు ఇటీవల దీనిపై కసరత్తు పూర్తి చేశారు. జనసేన ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలి, బీజేపీకి పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది తదితర అంశాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఒక అంచనాకు వచ్చినట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తొంది.

TDP Janasena: CM Seat offer for Pavan Kalyan.. is it True..!?
 

బీజేపీతో పొత్తులపై ఇంకా క్లారిటీ రానందున ఆ పార్టీ ఆశించే స్థానాలను పక్కన పెట్టి ఇతర నియోజకవర్గాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాలోచనలు జరిపి, సామాజిక సమీకరణాలు, సర్వే రిపోర్టుల ఆధారంగా గెలుపు అవకాశాల ఆధారంగా అభ్యర్ధుల ఎంపికపై తుది కసరత్తు పూర్తి చేశారని అంటున్నారు. తొలి జాబితాను వారం రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి తొలి జాబితా విడుదల చేయనున్నారని తెలుస్తొంది.

తొలి జాబితాలో టీడీపీకి సంబంధించి సుమారు 50 నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటిస్తారని, అదే విధంగా జనసేనకు సంబంధించి 15 నుండి 20 స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీలో ప్రస్తుతం 18 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా, ఒకటి రెండు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని, ఒక వేళ అక్కడ కూడా ఏకాభిప్రాయం కుదిరితే మొత్తంగా సిట్టింగ్ లకు సీటు దక్కవచ్చని అంటున్నారు.

ఈ నెల 20వ తేదీలోపుగా మొదటి జాబితా విడుదల చేయాలన్న ఆలోచనలో ఆ పార్టీలు ఉన్నాయని సమాచారం. తొలి జాబితాను టీడీపీ, జనసేన సంయుక్తంగా విడుదల చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారుట. అలా చేసినట్లయితే క్యాడర్ లో అనుకూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

టీడీపీ, జనసేన కూటమికి సంబంధించి అభ్యర్ధుల ప్రకటన విడుదల కాకపోవడంతో ఆ పార్టీలు జోష్ గా జనాల్లోకి వెళ్లలేకపోతున్నారు. టీడీపీ, జనసేనకు సంబంధించి తొలి జాబితా విడుదల చేసిన తర్వాత బీజేపీతో పొత్తుపై దృష్టి పెట్టి తదనుగుణంగా రెండవ జాబితాను రెడీ చేస్తారని అంటున్నారు.

Medaram Jatara: మేడారం జాతరలో బంగారం (బెల్లం)నే భక్తులు నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారంటే..?

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju