NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: పవన్ కు జగన్ సర్కార్ షాక్ .. భీమవరం పర్యటన వాయిదా

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జరగబోయే ఎన్నికలను సవాల్ గా తీసుకున్నారు. ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలోకి తన బృందంగా అడుగు పెట్టాలని, అధికారంలో భాగస్వామ్యం కావాలని కృతనిశ్చయంతో ఉన్నారు. టీడీపీతో ఇప్పటికే పొత్తు ఫిక్స్ కాగా, బీజేపీని కూడా ఈ కూటమిలో కలవాలని ఆశిస్తున్నారు.

Pawan Kalyan is stuck in the matter of collecting Janasena donations
Pawan Kalyan

ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ క్రమంలో పవన్ జిల్లాల పర్యటనలపై ప్రణాళికను రూపొందించారు. ఇందు కోసం ప్రత్యేక హెలికాఫ్టర్ సిద్దం చేసుకున్నారు. 175 నియోజకవర్గాల్లో హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు అనువైన ప్రదేశాలను గుర్తించారు. ప్రతి జిల్లాలో పవన్ కళ్యాణ్ మూడు సార్లు పర్యటించాలని నిర్ణయించారు. తొలి విడత పర్యటనలో జిల్లాల ముఖ్యనేతలతో సమావేశాలు ఉంటాయని చెబుతున్నారు.

రేపటి (14వ తేదీ) నుండి గోదావరి జిల్లాల్లో పర్యటనలకు ప్లాన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. నాలుగు రోజుల పాటు గోదావరి జిల్లాల్లో ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహించాలని భావించారు. 14వ తేదీ భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో సమీక్ష, 15న అమలాపురంలో తూర్పు గోదావరి జిల్లా నేతలతో, 16న కాకినాడలో మరో సారి సమీక్ష, 17న రాజమండ్రిలో పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించేందుకు రూట్ మ్యాప్ ఖరారు అయ్యింది.

అయితే పవన్ కు జగన్ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రయాణించే హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు భీమవరం ఆర్ అండ్ బీ అధికారులు అనుమతి  ఇవ్వలేదు. దీంతో బుధవారం భీమవరం కార్యక్రమాన్ని పవన్ వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

భీమవరంలోని విష్ణు కాలేజీ మైదానంలోని హెలిప్యాడ్ లో పవన్ ప్రయాణించే హెలికాఫ్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతి కోరితే ఆర్ అండ్ బీ అధికారులు అభ్యంతరం చెబుతూ నిరాకరించారని ఆయన తెలిపారు. దీని వెనుక అధికార పార్టీ ఒత్తిడి ఉన్నట్లు అర్ధం అవుతోందన్నారు. ఇదే హెలిప్యాడ్ ను పలువురు ప్రముఖులు భీమవరం పర్యటనకు వచ్చినప్పుడు వినియోగించారని చెప్పారు.

ఇప్పుడు పవన్ విషయంలో అభ్యంతరాలు చూపడం విచిత్రంగా ఉందన్నారు. ఇదే తరహాలో అమలాపురంలోనూ ఆర్ అండ్ బీ అధికారులు అనుమతుల విషయంలో అడ్డంకులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపునకు వాడుకోవడాన్ని ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

KCR: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్ర పోనివ్వకుండా వెంటపడతాం – కేసీఆర్

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?