NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ ట‌చ్‌లోకి జ‌న‌సేన టాప్ లీడ‌ర్‌…!

ప్రస్తుతం గోదావరి జిల్లా రాజకీయాలలో ఈ విషయం హాట్‌ టాపిక్ గా మారింది. జనసేన కీలక నేత ఒకరు వైసీపీ టచ్ లోకి వెళ్ళారా ? జనసేనలో ఆయన కోరుకున్న సీటు దక్కకపోవడంతో వైసిపి నుంచి ఆయనకు బంపర్ ఆఫర్ వెళ్లిందా ? ఈ బంపర్ ఆఫర్ పై ఆయన డైలమాలో ఉన్నారా ? అంటే అవును అన్న ఆన్సర్లే వినిపిస్తున్నాయి. జనసేనలో కీలక నేతల్లో ఒకరిగా ఉన్నారు.. రాజమండ్రి కి చెందిన మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్. గత ఎన్నికలలో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి ఏకంగా 42 వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్న ఆయన అప్పటినుంచి పార్టీ కోసం కష్టపడుతూ వస్తున్నారు.

Jana Sena's top leader in touch with YCP...!
Jana Sena’s top leader in touch with YCP…!

రాష్ట్రస్థాయిలో తన వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. ఈ క్రమంలోని జనసేన – టిడిపి పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ సీటు ఆయన ఆశించారు. అయితే రాజమండ్రి రూరల్ నుంచి ప్రస్తుతం టిడిపి సీటింగ్ ఎమ్మెల్యేగా సీనియర్ నేత గోరంట్ల బుచ్చ‌య్య‌ చౌదరి ఉన్నారు. ఒకానొక దశలో చంద్రబాబు, లోకేష్ రూరల్ సీటును దుర్గేష్ కోసం జనసేనకు ఇవ్వాలని అనుకున్నారు. అయితే బుచ్చ‌య్య‌ చౌదరి నానా రచ్చరచ్చ చేశారు. తనకు సీటు ఇవ్వకపోతే బుచ్చయ్య ఎక్కడ గందరగోళం చేస్తారో అని చంద్రబాబు చివరకు వెనక్కు తగ్గారు. ఇటు బుచ్చయ్య చౌదరితోను.. అటు దుర్గేష్ తోను ఆయన స్వయంగా మాట్లాడారు.

బుచ్చయ్య చౌదరిని రాజ‌మండ్రి రూరల్ నుంచి బరిలోకి దింపి అందుకు బదులుగా దుర్గేష్ కు రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న నిడదవోలు సీటు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అయితే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న దుర్గేష్ నిడదవోలు వెళ్లి పోటీ చేసేందుకు ఆసక్తి చూపటం లేదు. దీంతో వెంటనే వైసిపి రంగంలోకి దిగింది. రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ దుర్గేష్ లాంటి వ్యక్తి మా పార్టీలోకి వస్తే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యేవారని.. ఆయన మా పార్టీలోకి వస్తే స్వాగతిస్తాం అంటూ ఓపెన్ గా ప్రకటన చేశారు.

వెంటనే ఐ ప్యాక్ టీం రంగంలోకి దిగి దుర్గేష్ తో చర్చలు జరపడంతో పాటు వైసీపీలోకి వస్తే ఎమ్మెల్యే సీటుతో పాటు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు దుర్గేష్ కూడా జనసేన నుంచి సరైన రెస్పాన్స్ లేకపోతే ఆలోచిస్తానని వైసిపి పెద్దలకు చెప్పినట్టు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గంలోనూ ఇటు రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోనూ మంచి అనుచర‌గణంతో పాటు మంచి పేరు ఉన్న దుర్గేష్ లాంటి నేతలు జనసేన నుంచి వైసీపీలో చేరితే అది వైసీపీకి చాలా ప్లస్ అవుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే టైంలో దుర్గేష్ జనసేనని విడిచి పెడితే జనసేనకు చాలా పెద్ద డ్యామేజ్ అని చెప్పాలి. మరి దుర్గేష్ కు చంద్రబాబు – పవన్ కలిసి ఎలాంటి న్యాయం చేస్తారో చూడాలి.

Related posts

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar