NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కృష్ణా జిల్లాలో చిత్తుచిత్త‌వుతోన్న జ‌గ‌న్ ఈక్వేష‌న్లు… అభ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు…!

కృష్ణా జిల్లాలో వైసీపీ అధినేత జగన్ ఈక్వేషన్లు ఎన్నికలకు ముందే చిత్తుచిత్తు అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 9 జాబితాలలో పలు నియోజకవర్గాలను అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధినేత
కొన్ని నియోజకవర్గాలలో చాలా రాంగ్ ఈక్వేషన్ లతో అభ్యర్థుల మార్పులు చెరుపులు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మార్పులు చేర్పులు ఆయా నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా వచ్చిన వారి గుండెలలో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఈ ఈక్వేషన్లు తమకు ఏమాత్రం సరిపోవటం లేదని వారు కూడా బెంబేలెత్తుతున్న పరిస్థితి. మంత్రి జోగి రమేష్ సొంత నియోజకవర్గం మైలవరం, ఆయన ప్రస్తుతం పెడన నుంచి ప్రాధనిత్యం వహిస్తున్నారు.

ఈ రెండు నియోజకవర్గాలలో ఆయనకు సొంత సామాజిక వర్గం బలం ఎక్కువ. అయితే జోగి రమేష్ కు సామాజిక సమీకరణాల పరంగా ఏమాత్రం అనుకూలంగా లేని పెనమలూరుకు ఆయనను పంపారు. పెనమలూరులో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. అలాగే బీసీలలో గౌడ సామాజిక వర్గం కంటే యాదవ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. అలాంటి చోట గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ కు సమన్వయకర్తగా సీటు ఇవ్వడంతో ఆయన అక్కడ పార్టీ నేతలను సమన్వయం చేసుకోలేక ముప్పుతిప్పలు పడుతున్నారు.

ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథి పార్టీ మారడంతో కమ్మ సామాజి వర్గానికి చెందిన పడమటి సురేష్ బాబు వైసీపీ సీటు ఆశించారు. అయితే జగన్ జోగి రమేష్ ను పెనమలూరు కు పంపారు. జోగి రమేష్ కు పెనమలూరు రావడం ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆయన మైలవరం సీటు ఆశిస్తున్నారు. ఇక మైలవరంలో కేవలం జడ్పిటిసిగా ఉన్న స‌ర్నాల తిరుపతిరావు యాదవ్ కు ఇన్చార్జి పగ్గాలు అప్పగించారు. ఆయన ఒక మండల స్థాయి నేత మాత్రమే.

ఇక విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్నా మల్లాది విష్ణుని తప్పించి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను సెంట్రల్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా పంపించారు. మల్లాది విష్ణు సీటు పక్కన పెట్టడంతో ఆ నియోజకవర్గంలో 40 వేలకు పైగా ఉన్న బ్రాహ్మ‌ణ ఓటర్లు భ‌గ్గుమంటున్నారు. వీరంతా వెల్లంపల్లికి ఎంత మాత్రం సహకరించే పరిస్థితి లేదు. సామాజిక సమీకరణాల పరంగా పెనమలూరు, మైలవరం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో జగన్ పూర్తిగా రాంగ్ ఈక్వేషన్ తో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేసినట్టు వైసిపి వర్గాలే చర్చించుకుంటున్నాయి. త‌మకు నచ్చిన సీటు దక్కక వేరేచోట పోటీ చేయటం ఇష్టం లేక కృష్ణా జిల్లాలో పలువురు వైసిపి అభ్యర్థులు తీవ్రంగా మద‌న‌ పడుతున్నారు.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?