NewsOrbit
Cinema Entertainment News న్యూస్ రివ్యూలు సినిమా

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

Bhimaa: చాలా కాలం నుంచి స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా భీమా మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. కన్నడ దర్శకుడు ఎ హర్ష తెర‌కెక్కించిన ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా న‌టించారు. గోపీచంద్ కెరీర్ లో 25వ సినిమా ఇది. శుక్ర‌వారం భీమా విడుద‌ల అయింది. ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షోలు చూసిన ఆడియెన్స్ ట్విట్ట‌ర్‌(ఎక్స్‌) ద్వారా రివ్యూ ఇచ్చేస్తున్నారు. సినిమాపై త‌మ అభిప్రాయం తెలుపుతున్నారు.

అయితే మెజారిటీ పీపుల్ నుంచి భీమాకు పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత గోపీచంద్ కటౌట్‌కి తగ్గ బొమ్మపడిందని అంటున్నారు. భీమాలో డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో గోపీచంద్ అద‌ర‌గొట్టేశాడ‌ని.. పోలీస్ ఆఫీస‌ర్‌గా ఆయ‌న ప‌వ‌ర్ ఫుల్ యాక్టింగ్‌, బాడీలాంగ్వేజ్, డైలాగ్స్ అదుర్స్ అని ఆడియెన్స్ అంటున్నారు. మాస్ కోణంలో ఉన్న ఆయ‌న మ‌రో పాత్ర స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంద‌ని చెబుతున్నారు.

అలాగే యాక్ష‌న్ సీక్వెన్స్‌లు భీమా సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచాయ‌ని.. ప్ర‌తి యాక్ష‌న్ ఎపిసోడ్ గూస్‌బంప్స్ తెప్పించేలా తెర‌కెక్కించార‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కేజీఎఫ్ ఫేమ్‌ ర‌వి బ‌స్రూర్ అందించిన బీజీఎమ్ ఈ సినిమాకు మ‌రో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింద‌ట‌. ప‌లు సిన్నివేశాల‌కు అత‌ని బీజీఎమ్ ప్రాణం పోశాయ‌ని అంటున్నారు. హీరోయిన్లు ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ ఇద్ద‌రికీ క‌థ‌లో చ‌క్క‌ని ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

స్క్రీన్‌ప్లే కూడా గ్రిప్పింగ్‌గా ఉంద‌ట‌. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ అదిరిపోయాయ‌ని.. మాస్ ఆడియెన్స్‌కు భీమా ఫుల్ మీల్స్‌లా ఉంటుంద‌ని కొంద‌రు చెబుతున్నారు. మొత్తానికి ట్విట్ట‌ర్ టాక్ బ‌ట్టీ థియేట‌ర్స్ లో భీమా దుమ్ములేపుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. కొన్ని కొన్ని మైన‌స్‌లు ఉన్న‌ప్ప‌టికీ.. గోపీచంద్ యాక్టింగ్‌, గూస్‌బంప్స్ తెప్పించే బీజీఎమ్‌, యాక్ష‌న్ సీక్వెన్స్‌లు మరియు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే భీమా సినిమాకు మెయిన్ హైలెట్స్ గా నిలిచాయ‌ని తెలుస్తోంది.

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N