NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema March 26 2024 Episode 581: కృష్ణ డెవిల్ ప్లాన్.. దివ్య ఆత్మహత్యా ప్రయత్నం.. విక్కీ అమెరికా వెళ్లకుండా పద్మావతి అడ్డుపడనుందా?

Nuvvu Nenu Prema Today Episode March 26 2024 Episode 581 highlights

Nuvvu Nenu Prema March 26 2024 Episode 581:  పద్మావతి, విక్కీ ఇద్దరు మందు కలిపిన మజ్జిగ తాగుతారు. పద్మావతి వికీతో బలవంతంగా మజ్జిగ తాగిస్తుంది విక్కీ పద్మావతి ఇద్దరూ మత్తులో ఉంటారు ఇక పద్మావతి విక్కిని దూరంగా తీసుకు వెళుతుంది. నేను మీకు ఒక నిజం చెప్పాలి సారు మీరు లేనిదే నేను లేను మీరు నా గుండె చప్పుడు మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నా గుండె వేగం పెరుగుతుంది నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. విక్కీ కూడా నువ్వంటే నాకు ఇష్టమే పద్మావతి నీకోసం నేను గుండెల్లో స్థానం ఇచ్చాను. నువ్వు లేకుండా నేను ఉండలేను నీ ప్రేమ నాకు కావాలి నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నా గుండె వేగం కూడా పెరుగుతుంది మన ఇద్దరి గుండె చప్పుడు ఒకటే పద్మావతి అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 26 2024 Episode 581 highlights
Nuvvu Nenu Prema Today Episode March 26 2024 Episode 581 highlights

ఇక పద్మావతి విక్కీతో నిజం చెప్తుంది నేను మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నాను. మీరు నా నుండి దూరంగా వెళుతున్నారు నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేను సారు మన చావే మనల్ని దూరం చేయాలి కానీ ఏ సమస్య మనల్ని దూరం చేయకూడదు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు మాత్రం నన్ను దూరం పెడుతున్నారు మీరు కొంతకాలం నాకు టైం ఇస్తే నేను మిమ్మల్ని అపార్ధాలు అన్ని తొలగిపోయేలా చేస్తాను మీరు ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి నేను మీకు ఎప్పుడు దగ్గర కావాలనే చూస్తున్నాను అని అంటుంది దానికి విక్కీ పద్మావతి చెయ్యి విడిపించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు నా మాట వినండి సారు మీరు నా నుంచి వెళ్ళిపోవద్దు. మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ఏంటో నిరూపించుకుంటాను అని అంటుంది. మీ మనసులో ఉన్నవన్నీ అపార్ధాలే మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని అంటుంది. విక్కీ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు పద్మావతి బాధగా అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది.

Nuvvu Nenu Prema Today Episode March 26 2024 Episode 581 highlights
Nuvvu Nenu Prema Today Episode March 26 2024 Episode 581 highlights

ఇక పద్మావతి బాధపడుతూ ఉంటే అక్కడికి కృష్ణ వస్తాడు మీ ఇద్దరి ప్రేమ సంభాషణలు అయిపోయినయా అని అడుగుతాడు. చెప్పాను కదా పద్మావతి నేను ఉండంగా మీరిద్దరూ కలవరిని అని అంటాడు వెంటనే పద్మావతి కోపంతో చంప మీద కృష్ణుని కొడుతుంది. భార్యాభర్తలిద్దరూ విడిపోవడానికి కారణం నువ్వే అని నాకు తెలుసు అయినా మా ఇద్దరిని విడదీస్తే నీకు వచ్చే సంతోషం ఏంటో నాకు అర్థం కావట్లేదు అయినా ఒక మనిషి పట్ల ఇంత కఠినంగా ఎవరూ ఉండరు నువ్వు మా ఇద్దరినీ విడదీస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అంటాడు పద్మావతి నీకు నా గురించి పూర్తిగా తెలియట్లేదు నిన్నే కొట్టావు కదా ఇప్పుడు దివ్య వీడియో నా దగ్గరే ఉంది దాని గురించి నువ్వు మర్చిపోయినట్టున్నావు ఇప్పుడు ఈ వీడియో ఒక క్లిక్ తో ప్రపంచానికి తెలుస్తుంది అని అంటాడు వెంటనే పద్మావతి కృష్ణ చేతిలో ఉన్న ఫోన్ నేలకేసి కొడుతుంది ఇప్పుడు చెప్పు ఏం విషయం చెప్తావో ప్రపంచానికి అయినా నేను ఉండంగానే ఆడపడుచు మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. అరవింద గారి మొహం చూసి నిన్ను వదిలి పెడుతున్నాను దివ్యకి ఏ పాపం తెలీదు తనని ఇబ్బంది పెట్టాలని చూస్తే నేనంటే ఏంటో చూస్తావు నిన్ను ఊరికే వదిలిపెట్టను జాగ్రత్త అని పద్మావతి వారిని ఇచ్చి వెళ్లిపోతుంది.

Nuvvu Nenu Prema Today Episode March 26 2024 Episode 581 highlights
Nuvvu Nenu Prema Today Episode March 26 2024 Episode 581 highlights

ఇక కృష్ణ కావాలని ఆ వీడియోని దివ్యకి పంపిస్తాడు నన్నే కొట్టావు కదా పద్మావతి ఇప్పుడు ఎవరికి వీడియో పంపించాలో వాళ్లకు పంపించాను ఇప్పుడు ఇంకొంత సేపట్లో ఈ ఇంట్లో ప్రళయం మొదలవుతుంది అని అనుకుంటాడు. ఇక పద్మావతి దివ్య రూమ్ ముందు నుంచి వెళ్తూ ఉంటే, దివ్య ఫ్యాన్ కి చీర వేసుకొని తనంతట తానే ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటూ ఉంటుంది అది పద్మావతి చూస్తుంది వెంటనే దివ్య దగ్గరికి వచ్చి దివ్యని మంచం మీద నుంచి కిందకి దింపి ఏం చేస్తున్నావ్ దివ్య నువ్వు అని అంటుంది నన్ను వదిలే నన్ను వదిలేయని దివ్య బతిమలాడుతూ విదిలించబోతూ ఉంటుంది నేను చనిపోవాల్సిందే అని అంటుంది వెంటనే పద్మావతి గట్టిగా దివ్య నీ కొడుతుంది. నీకెంత కష్టం ఏమొచ్చిందని ఇక్కడ మేమందరం నీకోసం ఉంటే నువ్వు చనిపోవాలనుకుంటున్నావు అయినా నీలో మామయ్య గారిని చూసుకొని బతుకుతున్నాం మేమందరం అలాంటిది నువ్వు ఇలా చనిపోతే ఆయన ఆత్మ శాంతిస్తుందా అని అంటుంది. లేదు నేను చనిపోవడమే కరెక్ట్ నేను చనిపోతేనే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది లేదంటే ఆయన బాధపడతాడు ఆయన ఉన్నప్పుడు ఆయన పరువుని ఎంతో బాగా నిలుపుకున్నాడు. ఇప్పుడు నేనుండి ఆయన పరువు తీయలేను అని అంటుంది నీకు చనిపోయే అంత కష్టం వచ్చింది అంటే కచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది అంత బాధ ఏమొచ్చిందో నాతో చెప్పు అని అంటుంది పద్మావతి దివ్య వెంటనే తన ఫోన్ తీసుకొచ్చి పద్మావతి చేతిలో పెట్టి నేను చెప్పడం కాదు నువ్వే చూడు అని వీడియో చూపిస్తుంది అది చూసి పద్మావతి షాక్ అవుతుంది ఇక దివ్య ఏడుస్తూ ఉంటుంది. చూసావుగా ఇప్పుడు నేను ఎందుకు చనిపోతున్నానో నీకు అర్థమైంది కదా ఇంక నేను చనిపోవడం కన్నా ఇంతకన్నా కారణం ఏమైనా కావాలా ఇప్పుడు ప్రపంచం మొత్తం నన్ను వేలెత్తి చూపిస్తుంది. నేను బయటికి వెళ్లి బతకలేను ఈ వీడియో ఎంతమందికి చేరిందో తెలియదు అని అంటుంది దివ్య పద్మావతి ఈ వీడియో ఎవరు పంపించారు నీకు తెలుసా అని అంటుంది నాకు తెలీదు అది వేరే నెంబర్ నుండి వచ్చింది ఫోన్ చేస్తే కలవట్లేదు అని అంటుంది ఇక వెంటనే పద్మావతి దివ్యకు ధైర్యం చెప్పి నువ్వు చనిపోవడం సమస్యకు పరిష్కారం కాదు ఇలాంటి నీచులని మనం బుద్ధి చెప్పాలి కానీ చనిపోకూడదు నీలాగా ఇంకొక అమ్మాయికి జరగకుండా చూసుకోవాలి నువ్వు ఈ వీడియో డిలీట్ చెయ్యి వాడెవడైనా సరే నేను వాడి అంతు తేలుస్తాను అని అంటుంది ధైర్యం చెప్పి పద్మావతి తన దగ్గర ఇంకొకసారి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోనని మాట ఇవ్వు అని దివ్య దగ్గర పద్మావతి మాట తీసుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode March 26 2024 Episode 581 highlights
Nuvvu Nenu Prema Today Episode March 26 2024 Episode 581 highlights

ఇక మరోవైపు దివ్య వీడియోని కృష్ణ చూస్తూ ఇంత అందం వేస్ట్ అయిపోవడానికి నా మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు ఎప్పటికైనా బావగా నేనే నీకు కరెక్ట్ అని అంటాడు అప్పుడే అక్కడికి పద్మావతి వచ్చి, నీచుడా ఎంత పని చేసావు అని అంటుంది రా పద్మావతి నీకోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు వస్తావని నాకు తెలుసు చెప్పాను కదా నన్ను ఒకసారి కొట్టిన అందుకే దివ్య కి వీడియో పంపించాను ఎవరికి పంపించకుండా దివ్యకి మాత్రమే పంపించాను ఎందుకంటే నువ్వు నేను చెప్పిన పని చేస్తావని నాకు తెలుసు, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు పద్మావతి అని అంటూ ఉండగా పద్మావతి కృష్ణుని కొట్టబోతుంది కృష్ణ చెయ్యి పట్టుకొని ఎందుకు పద్మావతి ఒకసారి కొడితేనే ఇంత జరిగింది ఇప్పుడు మళ్లీ కొడితే ఈ వీడియో సోషల్ మీడియాలో నువ్వే స్ప్రెడ్ చేసిన దానివి అవుతావు నా ప్రమేయం ఏమీ ఉండదు ఒక క్లిక్ తో అందరికీ తెలిసిపోతుంది అని అంటాడు ఇక పద్మావతి ఏమీ చేయలేక చూస్తూ ఉంటుంది కృష్ణ మాత్రం నేను నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను నేను నీకు ఇచ్చిన పేపర్స్ మీద సంతకం పెట్టించు అంతే ఈ వీడియో డిలీట్ చేసేస్తాను అని అంటాడు. ఇక పద్మావతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లోపలికి వచ్చిన పద్మావతి కృష్ణ చెప్పిన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ ఫైల్ తీసుకొచ్చి కృష్ణ అసలు ఏ పేపర్స్ మీద సంతకం పెట్టించమన్నాడు చూస్తే తెలిసిపోతుంది కదా తన మనసులో ఏ కుట్ర దాగి ఉందో అర్థం అవుతుంది అని పద్మావతి ఆ పేపర్స్ తీసుకొచ్చి చూస్తూ ఉంటుంది ఇదంతా కృష్ణ గమనిస్తూ ఉంటాడు పద్మావతి అని చెప్పినట్టు సంతకం పెట్టిస్తుందని కృష్ణ అనుకుంటూ ఉంటాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode March 26 2024 Episode 581 highlights
Nuvvu Nenu Prema Today Episode March 26 2024 Episode 581 highlights

రేపటి ఎపిసోడ్ లో, పద్మావతి తులసి చెట్టుకి పూజ చేసి ధ్యానం పెట్టుకుంటూ నా నుంచి విక్కి ఎప్పటికి విడిపోకూడదు తను నన్ను అర్థం చేసుకోవాలి నేను ఇంట్లో ఉండాలి అని అనుకుంటూ నువ్వే తన మనసు మార్చి మమ్మల్ని దగ్గర చేయాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే అటుగా ఒక సోది చెప్పే ఆవిడ వస్తుంది.నీ భర్త ఒక్కసారి గడప దాటి బయటికి వెళ్తే ఇక మళ్ళీ నిన్ను చేరలేడు నీ భర్త గడప దాటకుండా చూసుకునే బాధ్యత నీదే, ఎక్కడికి వెళ్ళకుండా ఉంచే అస్త్రం నీ ప్రేమ మాత్రమే అని సోది ఆవిడ చెప్తుంది వెంటనే పద్మావతి వికీ దగ్గరికి వెళ్లి మీరు నా నుండి దూరంగా వెళ్లాలనుకుంటున్నారు నేను ఇంట్లో ఉండడం వల్లే కదా మీరు ఇక్కడ ఉండలేక వెళ్లిపోతున్నారు అలాంటప్పుడు నేను ఇక నుంచి వెళ్ళిపోతాను సారు మీరు ఇక్కడే ఉండండి అని అంటుంది. విక్కీ అమెరికా వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా పద్మావతి వచ్చి నేనే వెళ్ళిపోతాను మీరు ఇంట్లో ఉండండి అని అంటుంది.

Related posts

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N