NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema March 27 2024 Episode 582: కృష్ణ చేసిన మోసం పద్మావతి తెలుసుకొనుందా? అరవింద ముందు నోరు జారిన కృష్ణ.. పద్మావతి అమెరికా టూర్ ?

Nuvvu Nenu Prema Today Episode March 27 2024 Episode 582 highlights

Nuvvu Nenu Prema March 27 2024 Episode 582:  పద్మావతి కృష్ణ ఇచ్చిన ఫైల్ తీసుకొని దాని మీద సంతకం చేయించాలి అని అనుకుంటుంది. కృష్ణా పద్మావతి తో నువ్వు సంతకం చేయించకపోతే దివ్య వీడియోలు నేను బయట పెడతాను. నువ్వు కనుక సంతకం చేయిస్తే నేను దివ్య వీడియోలు డిలీట్ చేసి మీ ఆయనతో నిజం చెప్తాను. మీ అందరూ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తాడు ఆ మాటలన్నీ గుర్తు చేసుకుని పద్మావతి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఫైల్ లో ఏం పేపర్స్ ఉన్నాయో కృష్ణ ఏమన్నా మోసం చేస్తున్నాడేమోనని అనుమానంతో పద్మావతి ఫైల్ ఓపెన్ చేసి చూస్తుంది. ఫైల్ లో అంతా కృష్ణ చెప్పినట్లుగా షూరిటీ సంతకం కోసమే పేపర్స్ ఉంటాయి. వాటిని చూసి ఈ దుర్మార్గుడు నిజం చెప్తున్నాడు అని అనుకుంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema Today Episode March 27 2024 Episode 582 highlights
Nuvvu Nenu Prema Today Episode March 27 2024 Episode 582 highlights

ఇక పద్మావతి ఫైల్ ఓపెన్ చేసి చూసి ఎట్లాగైనా వికీ చేత వీటి మీద సంతకం చేయించాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది ఇక అప్పుడే అరవింద వచ్చి పద్మావతిని పక్కకు రమ్మని పిలుస్తుంది పద్మావతి తన చేతిలో ఉన్న ఫైల్ ని టేబుల్ మీద పెట్టి అరవింద దగ్గరికి వెళ్తుంది. ఇదంతా గమనించిన కృష్ణా పద్మావతి వెళ్లగానే ఆ ఫైల్ దగ్గరికి వచ్చి పద్మావతి నూనెను తక్కువ అంచనా వేశావు నన్నే కొట్టావు కదా ఇప్పుడు నేను నీ బతుకు మీద కొడుతున్నాను జీవితాంతం కోలుకోలేని దెబ్బ ఇప్పుడు నీకు తగులుతుంది విక్కీ నువ్వు ఎప్పటికీ కలవకుండా చేసేటటువంటి అస్త్రం ఇప్పుడు నేను ఉపయోగిస్తున్నాను అని పద్మావతి చూసి పెట్టిన ఫైల్ లో ఉన్న పేపర్స్ ని తన చేతిలో ఉన్న ఫైల్ పేపర్స్ తో మార్చేస్తాడు కృష్ణ అనుకున్న విధంగా ఆస్తి మొత్తం తన పేరు మీద రాసే విధంగా ఆ పేపర్స్ ని రెడీ చేయించి వాటిని పద్మావతి చూసిన ఫైల్లో పెట్టేసి ఏమీ తెలియనట్టు అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మనసులో మాత్రం ఇప్పుడు కచ్చితంగా పద్మావతి వీటిని మళ్లీ చూడదు వికే చేత సంతకం చేయిస్తుంది నేను అనుకున్నది జరుగుతుంది అని అనుకుంటాడు. ఇక పద్మావతి జీవితాంతం ఏడుస్తూ కూర్చోవాల్సిందే అని సంతోషపడతాడు.

Nuvvu Nenu Prema Today Episode March 27 2024 Episode 582 highlights
Nuvvu Nenu Prema Today Episode March 27 2024 Episode 582 highlights

ఇక పద్మావతిని పిలిచినా అరవింద దివ్య ఎందుకో డల్ గా ఉంటుందని తాను హోలీ పండుగ రోజు నుండి సరిగా ఉండడం లేదని, తన బాధని చూస్తే నాకెందుకు అనుమానంగా ఉందని తను చెప్పలేని ఈ విధంగా బాధపడుతుందని నువ్వుదివ్యతో బాగా మాట్లాడతావు కాబట్టి నువ్వు ఒకసారి తన బాధనితెలుసుకోమని అరవిందా అంటుంది దానికి పద్మావతి అదేం లేదు వదిన అని అంటుంది. లేదు పద్మావతి దివ్య డల్ గా ఉండడం నేను గమనించాను సరిగా అన్నం కూడా తినట్లేదు. ఆమెకి ఇక్కడ ఏ లోటు లేకుండా చూసుకుంటామని నాన్నకి మాట ఇచ్చాము. ఇప్పుడు ఆమె అలా ఉంటే మనం ఎంత చేసినా కానీ నాన్న ఆత్మ శాంతించదు అని అంటుంది అరవింద్ అదేం లేదు వదిన నేను చూసుకుంటాను కదా అని అంటుంది పద్మావతి సరే పద్మావతి అని అరవింద వెళ్ళిపోతుంది. పద్మావతి మాత్రం మనసులో కృష్ణ తన వీడియోలు దివ్యకి పంపించడం వల్లే దివ్య బాధపడుతుందని, అనుకోని ఎలాగైనా దివ్యకి సర్ది చెప్పాలి అనుకుంటుంది.పద్మావతి తిరిగి మళ్లీ తను ఫైల్ పెట్టించే చోటికి వెళుతుంది ఆ ఫైల్ అక్కడే ఉంటుంది కానీ ఓపెన్ చేసి అందులో ఏం ఫైల్స్ ఉన్నాయో మళ్ళీ చూడదు.ఆ ఫైల్ నీ చేతిలో తీసుకొని ఇప్పుడు దివ్య జీవితం కాపాడడం మాత్రమే నాకు ముఖ్యం కాబట్టి వీటి మీద విక్కీ జత సంతకం పెట్టించాల్సిందే అని అనుకుంటుంది. ఇక అప్పుడే ఆర్య అటుగా వెళుతూ ఫోన్ మాట్లాడుకుంటూ పద్మావతి దగ్గరికి వచ్చి ఈ ఫైల్ మీద విక్కీ చేత సంతకం పెట్టించు ఇది చాలా ఇంపార్టెంట్ ఫైలు నాకు అర్జెంటు పని ఉండి బయటికి వెళుతున్నాను నువ్వేం అనుకోకుండా వీడిచేది సంతకం పెట్టించు విక్కీతో అని ఒక ఫైల్ నీ తనకి ఇస్తాడు అప్పుడే పద్మావతి ఎలాగైనా విక్కీతో కృష్ణ ఇచ్చిన ఫైల్ మీద సంతకం పెట్టించాలి అనుకుంటూ ఉండగా ఎలా వికీతో సంతకం పెట్టించాలని ఆలోచిస్తూ ఉంటే ఆర్య వచ్చి తను ఆఫీస్ ఫైల్ ఇవ్వడంతో పద్మావతి పని సులభం అవుతుంది రెండు ఫైల్స్ తీసుకొని విక్కీ దగ్గరికి వెళ్తుంది. ఇదంతా కృష్ణ గమనిస్తూనే ఉంటాడు పద్మావతి వికీ దగ్గరికి వెళ్లడం కూడా కృష్ణ చూస్తాడు.

Nuvvu Nenu Prema Today Episode March 27 2024 Episode 582 highlights
Nuvvu Nenu Prema Today Episode March 27 2024 Episode 582 highlights

ఇక విక్కీ దగ్గరికి వెళ్ళిన పద్మావతి తన చేతిలో ఉన్న ఫైల్ ని విక్కీకి ఇవ్వడానికి ట్రై చేస్తుంది. విక్కీ అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోతూ ఉండగా సారు నేను వచ్చింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు అని అంటుంది మరి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు విక్కీ ఈ ఫైల్ మీద సంతకం పెట్టించమని ఆర్య బావ గారు ఇచ్చారు అని చెప్తుంది వాడు ఎందుకు నీకు నీ చేత పంపించాడు అని అంటే తనకు ఏదో పని ఉందట అతని వెళ్తూ వెళ్తూ నాకు ఇచ్చి వెళ్ళాడు. మీరు వీటి మీద సంతకం పెట్టడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు అని అంటుంది. ఇక వెంటనే వికీ కూర్చొని పద్మావతి దగ్గర ఉన్న ఫైల్స్ ని అందుకుంటాడు. పద్మావతి తెలివిగా ఆర్య ఫైల్ తో పాటు కృష్ణ ఇచ్చిన ఫైల్ ని కూడా కలిపేసి ఇస్తుంది రెండు ఫైల్స్ విక్కీ చేతిలో పడతాయి. కృష్ణ దూరం నుంచి అదంతా చూసి ఇప్పుడు విక్కీ చూసుకోకుండా సంతకం పెట్టేస్తాడు నేను అనుకున్న పని సులభం అవుతుంది అని అనుకుంటాడు. విక్కీ మొదటి ఫైల్ మీద సంతకం పెట్టేస్తాడు ఇక రెండో ఫైల్ మీద సంతకం పెట్టే టయానికి ఎక్కడ చూసి సంతకం పెడతాడు అని పద్మావతి సారు మీరు నిన్న రాత్రి తాగిన మత్తులో నాకు తో ఏదో మాట్లాడారు మీకేమన్నా గుర్తుందా అని అడుగుతుంది నాకేం గుర్తులేదు అని అంటాడు నాకు మాత్రం గుర్తుంది సారు మీరు ప్రేమని నాతో చెప్పాలనుకున్నారు మన రెండు గుండెచప్పుడు ఒకటేనని చెప్పారు మీకు గుర్తుంటే నాతో చెప్పండి అని అంటుంది. ఇప్పుడు వాటి గురించి అడగడానికే ఈ ఫైల్స్ తీసుకొని వచ్చావు కదా అని అంటాడు అదేం లేదు సారు అని అంటుంది. ఇక చూసి సంతకం పెట్టండి అని అంటుంది. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు ఎలా సంతకం పెట్టాలో నాకు తెలుసు అని విక్కీ చూడకుండా అనే సంతకం పెట్టేస్తాడు అందులో కృష్ణ ఆస్తి మొత్తం తన పేరు మీద రాసి ఇచ్చినట్టు పట్టా ఉంటుంది దాని మీద కూడా విక్కి చూసుకోకుండా సంతకం పెట్టేస్తాడు. ఇక ఫైల్స్ పక్కన పడేసి విక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పద్మావతి ఆ ఫైల్ తీసుకొని ఇప్పుడు ఈ ఫైల్ ని ఎలాగైనా నేను దాచి పెట్టాలి కృష్ణ తన బుద్ధి ఎలాంటిదో బయటపడిన తర్వాత దివ్య జీవితం బాగుపడిన తర్వాత విక్కీ తో నిజం చెప్పిన తర్వాతే ఈ ఫైల్ ని కృష్ణ కి ఇవ్వాలి అని అప్పటివరకు ఇది నా దగ్గరే ఉండడం మంచిది అని, అగ్నికి రూంలోనే ఒక బాక్స్ లో దాన్ని దాచిపెడుతుంది. అదంతా గమనించిన కృష్ణ ఎలాగైనా సరే పద్మావతి నుండి ఆ ఫైల్ ని తీసుకోవచ్చు ఇప్పుడు ఇక ఆట నేను మొదలు పెడతాను పద్మావతి నీ జీవితం మీకు ఇక్కడితో ముగిస్తుంది అని అనుకుంటాడు. ఇక లోపలికి వచ్చిన కృష్ణ ఆనందంతో డాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అనుకోకుండా రూమ్ లోకి అరవింద్ వస్తుంది కృష్ణుని చూసి ఏంటండీ మీరు వింతగా ప్రవర్తిస్తున్నారు అని అంటే మనం దక్కాల్సింది తొందరలో మనకి దక్కుతుంది అని తెలిసినప్పుడు మనకు తెలియకుండానే ఆనందంతో అన్నికి వస్తుంది అని అంటాడు అవునా అయితే ఏంటండి అది అని అడుగుతుంది అరవింద వెంటనే కృష్ణ మర్చిపోయి అరవిందతో ఈ ఆస్తి మొత్తం నా సొంతం కాబోతుంది అని అంటాడు వెంటనే అరవింద షాక్ అవుతుంది ఇప్పుడు నేను ఎలాగైనా అరవింద్ కు అనుమానం రాకుండా సమాధానం చెప్పాలి అని అనుకొని వెంటనే అదే రాణమ్మ నా క్లైంట్ తన ఆస్తి కోసం పోరాటం చేస్తున్నాడు ఈ రోజు నేను నా కేసు గెలిచాను అందుకే ఆస్తి మొత్తం నాకు ఇంటికి వచ్చేసింది ఆనందంలో ఇలా డాన్స్ చేస్తున్నాను అని అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒక్కొక్కసారి మనం అనుకున్నది మన చేయి దాకా రాకపోవచ్చు అది రివర్స్ అయ్యి కూడా అవ్వచ్చు అని అంటుంది అలా ఏం జరగదు రానమ్మ ఈసారి అని అంటాడు కృష్ణ. మీరు సంతోషంలో ఉన్నారు కదా నేను వెళ్లి స్వీట్స్ తీసుకు వస్తాను అని అరవింద వెళ్తుంది. అరవింద వెళ్లగానే కృష్ణ మనసులో పిచ్చి రానమ్మ నీకు నమ్మకం కుదరడానికే నేను ఇన్ని రోజులు ఈ విధంగా నటిస్తూ వస్తున్నాను. ఇప్పుడు ఆస్తి మొత్తం నా చేతిలోకి రాగానే మీ అందరి ఆట కట్టిస్తాను అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 27 2024 Episode 582 highlights
Nuvvu Nenu Prema Today Episode March 27 2024 Episode 582 highlights

ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటారు నారాయణ మూతికి మాస్క్ పెట్టుకొని వస్తాడు అందరూ ఏమైందని అడుగుతారు కుచల నిన్న రాత్రి జరిగిన విషయాన్ని చెప్తుంది తాగిన మత్తులో సిగరెట్ అనుకోని ఆటంబాంబు నోట్లో పెట్టుకుని కాల్చమన్నారు భర్త మాటకి భార్య ఎదురు చెప్పకూడదని నేను వెలిగించాను అది కాస్త అలా పేలింది. మా ఆయన మూత అంతా కాలింది అని చెప్తుంది ఇంకా చెప్పవే ఇంకా ఏమన్నా ఉంటే చెప్పు అని నారాయణ కోప్పడతాడు. జరిగిన నారు చెప్పింది అని అంటుంది. ఇక అందరూ నవ్వుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన విక్కీని చూసి పద్మావతి కూర్చోండి సార్ భోజనం వడ్డిస్తాను అని అంటుంది. విక్కీ అ ఇష్టంగానే భోజనానికి కూర్చుంటాడు పద్మావతికి విక్కీ అంటే ఎంత ప్రేమ అని శాంతాదేవి అంటుంది ఇక శాంతాదేవి పద్మావతి లాంటి అమ్మాయి విక్కీకి భార్యగా దొరకడం విక్కీ అదృష్టమని అందుకే అర్థం చేసుకొని విక్కీ మనసు గెలుచుకుంటుందని పద్మావతిని పొగుడుతూ ఉంటారు ఇక కృష్ణ మాత్రం మనసులో ఇది ఎంత కాలము నేను చూస్తాను కదా అని అనుకుంటూ ఉంటాడు ఇక విక్కీ భోజనం చేస్తూ మధ్యలో అరవింద తో నీకు ఒక విషయం చెప్పాలి అక్క అని అంటాడు. ఏంటో చెప్పు అని అంటుంది అరవింద్ నేను కొన్ని రోజులు అమెరికా వెళ్లాలనుకుంటున్నాను. ఆఫీస్ పని మీద ఒక క్లైన్ తో మాట్లాడాలి ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ నాకు ఒక 20 రోజులు పడుతుంది అని అంటాడు ఆ మాటలకు పద్మావతి బాధపడుతుంది నా నుంచి దూరంగా వెళ్లడానికే ఇలా చెప్తున్నారు అని అనుకొని సారు మీరు అమెరికా వెళ్లడం నాకు ఇష్టం లేదు మీరు ఇక్కడే ఉండండి మీ ఆరోగ్యం ఏమవుతుంది అక్కడికి వెళ్తే అని అంటుంది. మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేను సారు మీరు అక్కడ ఎలా ఉన్నారో ఏంటో అని నాకు ఇక్కడ దిగులుగా ఉంటుంది అని అంటే వెంటనే అరవింద తను నిన్ను వదిలి ఉండలేదు రా అని అంటుంది. శాంతాదేవి అయితే మనం ఒక ప్లాన్ వెయ్యొచ్చు పద్మావతిని కూడా నువ్వు అమెరికా తీసుకొని వెళ్ళు అప్పుడు తనకి బాధ ఉండదు తను నీ దగ్గర ఉంటుంది ఇద్దరూ ట్రిప్పు వేసినట్టు ఉంటుంది అని అంటుంది దానికి అందరూ సరే ఐడియా చాలా బాగుంది అని అంటారు ఇక కృష్ణ మాత్రం అదేంట అత్తయ్య మీరు అలా మాట్లాడుతున్నారు పద్మావతిని తీసుకెళ్లి విక్కీ ఆఫీస్ పని ఎలా చేస్తాడు అయినా విక్కీ గురించి మనకు తెలిసిందే కదా ఆఫీస్ పనిలో పడితే పద్మావతిని పట్టించుకోడు ఇక అక్కడ తను ఒక్కతే ఊరు కాని ఊరులో దేశం కానీ దేశంలో ఎలా ఉంటుంది దాని వెళ్ళకపోవడమే మంచిది అని అంటాడు. వెంటనే ఆర్య బావగారు మంచిదే కదా ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు చూసుకుంటారులెండి అని అంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా విక్కీ తో బలవంతంగా పద్మావతిని తీసుకు వెళ్ళమని పోస్ట్ చేస్తూ ఉంటారు కానీ విక్కీ మాత్రం అందుకు ఒప్పుకోడు. నాకు అర్జెంట్ పని ఉంది నేను వెళ్లి తీరాలి నేను ఒక్కడినే వెళ్తాను అక్కడ తన ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని పద్మావతిని తీసుకెళ్లట్లేదు అని చెప్తాడు. పద్మావతి దిగులుగా ఉంటుంది. తను కూడా అమెరికా వెళ్లచ్చని ఆశపడుతుంది. కానీ విక్కీ ని మాత్రం పంపించడానికి ఇష్టపడదు ఎలాగైనా మీరు అమెరికా వెళ్లే లోపు మీకు నిజం చెప్పి మీరు అనుకునే ఆనందం ఇక్కడే ఉందని చూపిస్తాను. అని అనుకుంటుంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode March 27 2024 Episode 582 highlights
Nuvvu Nenu Prema Today Episode March 27 2024 Episode 582 highlights

రేపటి ఎపిసోడ్లో పద్మావతి తులసి కోటకు పూజ చేసి ఎలాగైనా విక్కీ అమెరికా వెళ్ళకుండా ఇక్కడే ఉండేలా చూడమని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా అటుగా వచ్చినా ఒక కోయదొర పెద్ద ఆవిడ పద్మావతిని చూసి ఇప్పుడు నీ చేతిలో ఉండాల్సింది చేయి జారిపోయే టైం వచ్చింది అని అంటుంది దానికి పద్మావతి ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటుంది ఇప్పుడు గడప దాటి బయటికి వెళ్తే మళ్ళీ లోపలికి వచ్చేది లేదు ఇక నిన్ను శాశ్వతంగా దూరం చేసుకుంటాడు విక్కీ అమెరికా వెళ్లకుండా చేయాలి ఆ అలా చేయడం నీ ప్రేమకు మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్తుంది. ఆమె చెప్పిన మాటలు పద్మావతి వింటుంది ఇక విక్కీ దగ్గరికి వెళ్లి మీరు అమెరికా వెళ్లడం ఎందుకో నాకు తెలుసు సారు మీరు నా నుంచి దూరంగా తప్పుకోవాలి అనుకుంటున్నారు అలాంటప్పుడు నేనే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని అంటుంది. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని ఉండదు. నేనే వెళ్తాను అని అనగానే విక్కీ పద్మావతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N