NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari March 27 2024 Episode 429: భవాని దేవి ని ఇంప్రెస్ చేసిన ముకుంద.. ఆదర్శ్ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. నందు నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా ఆదర్శ్..

Krishna Mukunda Murari Today Episode March 27 2024 Episode 429 highlights

Krishna Mukunda Murari March 27 2024 Episode 429:  రేవతి హాల్లో కూర్చుని ఉండగా, ఆదర్శ అప్పుడే కిందకి వస్తాడు. రేవతి టిఫిన్ పెట్టమంటావా అని అడుగుతుంది అందుకు ఆదర్శ్ మురారి తిన్నాడా అని అడుగుతాడు ఇందాకే చేశాడు అని అంటుంది వాడికి మాత్రం పిలిచి పెడతారు నాకైతే మాత్రం అడిగిన తర్వాతే పెడతారు అని నిష్టూరంగా మాట్లాడతాడు. ఏం టిఫిన్ చేశారు అని అడుగుతాడు ఓన్లీ దోస అని చెప్తుంది రేవతి వెంటనే అనుకున్నాను వాడికి ఇష్టమైనదే చేస్తారని ఇప్పుడు నేను కూడా అదే అడ్జస్ట్ అయిపోయి తినాలి అని అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన సుమలత నువ్వు ఇష్టమని చెప్పావు కదా అని అంటుంది అప్పుడు చెప్పాను పిన్ని కానీ అప్పుడు మురారి కి ఇష్టమైనది నాకు ఇష్టం అనుకున్నాను కానీ ఇప్పుడు కాదు అని అంటాడు. ఆదర్శ కావాలనే ఇంట్లో వాళ్ళందరినీ నిష్టూరంగా మాట్లాడుతున్నట్లు వాళ్ళకి అర్థమవుతుంది. మధు కావాలని ఆదర్శ గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు అని అర్థం చేసుకుంటాడు. కావాలనే గొడవ పెట్టుకుంటున్నాడు అని అంటాడు అవును నేను అన్న దాంట్లో తప్పేముంది ఒకప్పుడు నాకు ఉల్లి దోస ఇష్టం అన్నానని అది నాకు అడ్జస్ట్ అయ్యి తిన్నందుకు ముకుందని కూడా వాడు ప్రేమించి నాకు ఇచ్చి పెళ్లి చేశాడు అని అంటాడు ఇప్పుడు ఉల్లి దోశ నుంచి ముకుంద వైపుకు మళ్ళించేవా టాపిక్ అని అడుగుతుంది రేవతి. ఇప్పుడు ముకుంద కూడా లేకుండా చేశారుగా పిన్ని అని అంటాడు.

Krishna Mukunda Murari Today Episode March 27 2024 Episode 429 highlights
Krishna Mukunda Murari Today Episode March 27 2024 Episode 429 highlights

ఇక ఆదర్శ కోపంగా అమ్మ ఎక్కడికి వెళ్లింది అని అడుగుతాడు సుమలత అందుకు మురారిని కాపాడిన మీరా దగ్గరికి వెళ్ళింది అని అంటే మా అమ్మని కూడా మీరు మార్చేశారు మా అమ్మ వచ్చి రాగానే రెస్టు తీసుకోకుండా ఆ పనికిమాలిన దగ్గరికి వెళ్లిందా అని అంటాడు. ఇక వెంటనే అక్కడికి కోపంగా కృష్ణ వస్తుంది. ఎవరిని ఏం మాట్లాడుతున్నావ్ ఆదర్శ అని అంటుంది. ఆ అమ్మాయి ఏసిపి సార్ ని కాపాడిన దేవత అయినా నీకు అలాంటివి అర్థం కాదులే అని అంటుంది. అవును నాకు అర్థం కావు మీరు మాత్రం మా అమ్మ అమెరికాలో ప్రశాంతంగా ఉంటే ఆమెను టెన్షన్ పెట్టి ఇక్కడికి వచ్చేలా చేశారు ఇక్కడ ఏం జరిగిపోయిందని ఆమెను రప్పించారు అని మాట్లాడుతాడు ఇక వెంటనే ఇవే మాటలు పెద్దమ్మ ముందు చెప్పు అని అంటాడు మధు. ఎవరి దగ్గర ఏదైనా మాట్లాడితే మరి మధు కానీ నా దగ్గర మాత్రం ఇలా రెచ్చగొట్టేటట్లు మాట్లాడొద్దని చెప్పు మాట్లాడుతుంటే వింటున్నాం కదా అని ప్రతిసారి మమ్మల్ని రెచ్చగొట్టేటట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోను అని కృష్ణ వార్నింగ్ ఇస్తుంది. ఇకమీదట జాగ్రత్తగా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్తుంది. ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆదర్శ ఒక్కడే సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు.

Krishna Mukunda Murari Today Episode March 27 2024 Episode 429 highlights
Krishna Mukunda Murari Today Episode March 27 2024 Episode 429 highlights

ఇక మరోవైపు మీరా ఉండే లొకేషన్ దగ్గరికి చేరుకుంటుంది భవానీ దేవి. ఈ అమ్మాయి ముకుంద ఫ్రెండ్ అయ్యుండి ఇలాంటి ప్లేస్ లో ఉంటుంది ఏంటి అని అనుమాన పడుతూ లోపలికి వెళ్తుంది అక్కడ వాతావరణం అంతా చాలా పేద వాళ్ళు లాగా ఉంటుంది. అప్పుడే బట్టలు ఆరేస్తున్న మీరా నువ్వు వెనుక వైపు నుంచి మీరు మీరా నేనా అని అడుగుతుంది. ఆ మాట విని మీరా మీరు వస్తారని నాకు తెలుసు అత్తయ్య అని మనసులో అనుకొని వెనక్కి తిరిగి ఎవరండీ మేడం అని అడుగుతుంది. మీరు నిన్న కాపాడిన మురారి పెద్దమ్మని నేను అని భవానీ దేవి పరిచయం చేసుకుంటుంది మేడం మీరు ఇక్కడ దాకా రావడం ఎందుకు ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా అని అంటుంది మనకే సహాయం పొందిన వాళ్ళకి కృతజ్ఞతలు నేరుగా వెళ్లి చెప్పాలని ఇక్కడ దాకా వచ్చాను అని అంటుంది. ఇక మీరా ముకుందతో ఉన్న పరిచయం గురించి చెబుతుంది ముకుంద తనకి హెల్ప్ చేసిన విషయం తన చదివిచ్చిన విషయం అన్ని భవాని దేవితో చెప్తుంది మరి మీరు ఏ మినిస్టర్ కూతురి ఫ్రెండ్ అయ్యుండి ఇలాంటి ప్లేస్ లో ఉంటున్నారు ఏంటి అని భవాని దేవి మీరా అని అడుగుతుంది. వెంటనే మీరా నాకు గొప్ప వాళ్ళతో పరిచయం ఉంది కానీ నేను వాళ్ళ డబ్బుని ఆశించడం నా ఉద్దేశం కాదు మేడం వాళ్ళు నా స్థాయి వాళ్ళతో స్నేహం చేయడం అది వాళ్ళ గొప్పతనం వాళ్ళ నుంచి ఏ సహాయం కోరుకోకుండా ఉండడం నా ఆత్మ అభిమానం అని చెప్తుంది. ఆ మాటలకు భవానీ దేవి ఇంప్రెస్ అవుతుంది. నువ్వు ఇంత సింపుల్గా ఇంతచక్కగా మాట్లాడుతున్నావు అంటే, నువ్వు ఎంత మంచి దానివో ఎంత గొప్ప దానివో అర్థమవుతుంది అయినా ఇలాంటి ప్లేస్ లో నువ్వు ఉండకూడదు నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చేయ్ అని అడుగుతుంది. అందుకు మీరు నాకు కావాల్సింది కూడా అదే ఎన్నో తిప్పలు పెడితే గాని ఈ మాట మీ నోట్లో నుంచి వస్తుందని ఊహించాను. కానీ ఇంత తొందరగా మీరు వరం ఇస్తారు అని అనుకోలేదు అత్తయ్య అని మనసులో అనుకుంటుంది. కానీ పైకి మాత్రం నేను అక్కడికి రావడం నాకు ఇష్టం లేదు అని అంటుంది నన్ను ఇలా సింపుల్ గానే ఉండనివ్వండి అని అంటే భవానీ దేవి నాకు ఒకల దగ్గర నుంచి సహాయం తీసుకుని వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా ఉండడం నాకు నచ్చదు ఒకసారి ఒక ఒక ఆక్సిడెంట్ నుంచి నన్ను కాపాడారు అప్పుడు వాళ్ళకి ఆరు నెలల బాగున్నాడు వాళ్ళిద్దరూ ఆక్సిడెంట్ లో చనిపోయారు ఆ బాబుని మా ఇంటికి తెచ్చుకొని పెంచి పెద్ద చేసి ఇవాళ నా కొడుకు ఆదర్శంగా వాడిని మార్చాను. అలాంటిది నువ్వు చేసిన సహాయానికి నేనేమీ ఇవ్వకుండా ఉండలేను అందుకే నాతో పాటు మా ఇంటికి పదా అని అంటుంది. ముకుంద కోరికనట్టు ఉంటుంది అని మీరు ఆకు నచ్చ చెప్తుంది. ఇక మీరా కూడా సరే అంటుంది వస్తువులన్నీ ప్యాక్ చేసి వస్తానంటే ఇవన్నీ ఇక్కడే వదిలేసేయి. నీకు వెళ్లేటప్పుడు అన్ని నేనుకొని పెడతాను అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode March 27 2024 Episode 429 highlights
Krishna Mukunda Murari Today Episode March 27 2024 Episode 429 highlights

ఇక మరోవైపు కృష్ణ, మురారితో క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది ఎసిపి సార్ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను మీరు ఏమి అనకూడదు అని అంటుంది. ఏంటో చెప్పు కృష్ణ అని అంటాడు ఇప్పుడు మన ఇంటికి మీరా వస్తుంది కదా తను మిమ్మల్ని కాపాడింది కాబట్టి మనం ఆ అమ్మాయికి గుర్తుండిపోయేటట్టు మంచి గిఫ్ట్ ఇద్దాము అని అంటుంది. తప్పకుండా దాంట్లో అడిగేదేముంది కృష్ణ అని అంటాడు మరి నేనింకేదో అనుకున్నాను అని అంటాడు మీరే ఊహించారు అని అంటుంది నువ్వేమైనా గిఫ్ట్ అడుగుతావేమో అనుకున్నాను అని అంటాడు మురారి. సరే సిపి సార్ నేనే కనుక గిఫ్ట్ అడిగితే ఏం అడుగుతాను ఊహించండి అని అంటుంది. నేనైతే ఊహించలేను కానీ నేను నీకు ఒక మంచి గిఫ్ట్ ఇద్దామని మాత్రం అనుకున్నాను అని అంటే ఏంటి సార్ అది అని అడుగుతుంది. వెంటనే మురారి కృష్ణ పొట్ట మీద చేయి పెట్టి ఇదే నీకు ఇవ్వాల్సిన గిఫ్ట్ అంటాడు. కృష్ణకి బాబు పుట్టడమే మురారి కృష్ణకి ఇచ్చే గిఫ్ట్ గా చెప్తాడు ఆ మాటలకు కృష్ణ చాలా సంతోషంతో సిగ్గుపడుతూ ఇది నా ఒక్కదానికే గిఫ్ట్ కాదు ఏసీపి సార్ ఇంట్లో అందరికీ ఇదొక పెద్ద గిఫ్ట్ అని అంటుంది. కృష్ణకి మురారి ఐ లవ్ యు చెప్తాడు మురారి కి కూడా కృష్ణ ఐ లవ్ యు టూ ఎసిపి సార్ అని చెప్తుంది. కృష్ణ మురారి నుదుటిన ముద్దు పెడుతుంది. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు.

Krishna Mukunda Murari Today Episode March 27 2024 Episode 429 highlights
Krishna Mukunda Murari Today Episode March 27 2024 Episode 429 highlights

ఇక మరోవైపు ఆదర్శ ఒక్కడే బెడ్ మీద పడుకొని ఏక్ నిరంజన్ మూవీలో అమ్మ లేదు నాన్న లేదు ఏక్ నిరంజన్ అనే పాటని ప్లే చేసుకుంటూ పడుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నందు వస్తుంది. వెంటనే ఆదర్శ్ లేచి పాటని ఆపేసి ఏంటి ఇట్లా వచ్చావు అని అడుగుతాడు నీతో మాట్లాడడానికి వచ్చాను అని అంటుంది ఏంటో చెప్పు అని అంటాడు ఇప్పుడు నువ్వు గొడవ చేయకుండా మీరా ఇక్కడికి రాగానే తనతో గొడవ పెట్టుకోవద్దు అని అంటుంది వెంటనే ఆదర్శ కోపంగా అదేంటి పలకరించి వస్తానని థాంక్స్ చెప్పి వస్తుందని అమ్మ అనుకుంటే ఆమెను ఇక్కడికి తీసుకురావడం ఏంటి ఆ దరిద్రాన్ని ఇక్కడ దాకా తీసుకురావడం అవసరమా అని అంటాడు ఇదిగో ఇలానే గొడవ చేస్తావని ముందే నీకు ఒక మాట చెబుదామని వచ్చాను అని అంటుంది నందు. నీకు దండం పెడతాను అన్నయ్య నువ్వు మాత్రం మీరా వచ్చిన తర్వాత తనని ఏమీ అనొద్దు గొడవ అని పెద్ద చేయొద్దు అని అంటుంది. వెంటనే ఆదర్శనీకి ఇక్కడ ఏం పని అని అంటాడు నందుకి అర్థం కాదు, అర్థం కాలేదా అసలు నీకు ఇక్కడ ఏం పని అని అడుగుతున్నాను అని అంటాడు ఆదర్శ్ అంటే పుట్టింట్లో నీవు ఏం పని నీకు పెళ్లి అయింది భర్త ఉన్నాడు అత్త మామ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఎప్పుడు పుట్టింట్లోనే ఉండి ఇక్కడ సమస్యల గురించి నీతులు చెప్పడానికి వచ్చావా అని అంటాడు ఆదర్శ. అంటే ఏం మాట్లాడుతున్నావ్ అని అంటుంది నందు నువ్వు ఇక్కడ ఉండకుండా మీ అత్త ఇంటికి వెళ్ళిపోమని చెప్తున్నాను అని అంటాడు. ఎప్పుడు పుట్టింట్లోనే ఉండడం కాదు అత్తింటికి వెళ్లి పోవాలి నువ్వు ఇక నుంచి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడే అక్కడికి మురారి వచ్చి ఎందుకు వెళ్లాలి అని అడుగుతాడు. నందు ఇక్కడ ఉండకుండా అత్తింటికి ఎందుకు వెళ్లాలి అని అంటాడు ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Krishna Mukunda Murari Today Episode March 27 2024 Episode 429 highlights
Krishna Mukunda Murari Today Episode March 27 2024 Episode 429 highlights

రేపటి ఎపిసోడ్ లో ఆదర్శ్ తో పాటు ఇంట్లో అందరికీ మీరా భోజనం వడ్డిస్తూ ఉంటుంది. అందరికీ వడ్డించడం అయిపోయింది కదా ఇప్పుడు నువ్వు కూడా కూర్చో అని అంటుంది కృష్ణ. అప్పుడే ఎదురుగా ఉన్న ముకుంద ఫొటోను చూసి మీరా ఆ ఫోటో ఇక్కడ ఉండడం చూస్తుంటే తను ఆక్సిడెంట్ లో చనిపోయిన విషయం నాకు గుర్తుకు వస్తుంది అలా దండ వేసిన ఫోటోని చూసినప్పుడల్లా నాకు బాధగా ఉంటుంది అందుకే మీరు కొంచెం ఆ ఫోటోని దండని అక్కడి నుంచి తీసివేయండి అని అడుగుతుంది మీరా ఆ మాటకి ఆదర్శ్ కోపంగా మీరా వైపు చూస్తాడు. మరి ఆదర్శ్ మీరాతో గొడవ పెట్టుకున్నాడో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella