NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Ram Charan Pawan Kalyan: రామ్ చరణ్ కి బెస్ట్ బర్త్ డే విషెస్ తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!

Ram Charan Pawan Kalyan: నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున సెలబ్రిటీలు చరణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా “మగధీర” సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇదే సమయంలో చరణ్ నటిస్తున్న “గేమ్ చేంజర్” సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. పుట్టినరోజు నాడు ఉదయమే తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలో జనసేన అధినేత బాబాయి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. “ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Pawan Kalyan wishes best birthday to Ram Charan

సంపూర్ణ ఆనందాన్ని… సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడు. పెద్దలు, అనుభవజ్ఞులపట్ల గౌరవమర్యాదలతో ఉంటాడు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్ధిలా నడుచుకుంటాడు. అవే శ్రీరామ రక్షగా నిలుస్తాయి… మరింత ఉన్నత స్థాయికి ఎదగటానికి దోహదపడతాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్- రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను”..అని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Pawan Kalyan wishes best birthday to Ram Charan

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో పవన్ రాజకీయంగా ఫుల్ బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమాలను అభ్యర్థులను ఎంపిక పనులను దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. ఈసారి పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికలలో భీమవరం, గాజువాక నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈసారి ఎలాగైనా ఎన్నికలలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో కలిసి పవన్ పోటీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో మరోసారి వైసీపీ విజయం సాధించకూడదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. సీరియస్ గా రాజకీయాలు చేస్తూ ఉన్న పవన్ .. రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N