NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari March 28 2024 Episode 430: మీరా మీద కృష్ణ కి డౌట్..కృష్ణ ని లిమిట్స్ లో ఉండమన్న మురారి.. ఆదర్శ మనసు మార్చాలీ అనుకున్న మీరా..

Krishna Mukunda Murari Today Episode March 28 2024 Episode 430 highlights

Krishna Mukunda Murari March 28 2024 Episode 430: భవానీ దేవి మీరా సహాయం చేసినందుకు తన దగ్గరికి వెళ్లి థాంక్స్ చెప్తుంది తను ఉండే పరిస్థితి చూసి జాలిపడి తనని ఇంటికి రమ్మని అడుగుతుంది పర్మినెంట్ గా మా ఇంట్లోనే ఉండమని చెప్తుంది దానికి మీరా ఈమాట కోసం ఎదురుచూస్తున్నాను అత్తయ్య అని మనసులో అనుకొని మొదట రానని చెప్తుంది కానీ భవానీ దేవి బలవంతం పెట్టడంతో మీరా ఇంటికి రావడానికి ఒప్పుకుంటుంది. ఈ మాట కోసం నేను ఎంతో కాలం పడుతుంది అనుకున్నాను కానీ ఇంత తొందరగా మీరే వచ్చి నన్ను ఇంటికి రమ్మంటారని అనుకోలేదు అని మనసులో అనుకుంటుంది ముకుందా, భవానీ దేవి వెళ్లే దారిలోనే అన్ని కొనుక్కుందాము. ఇక వెళ్దాం పద అని మీరాని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది.

Krishna Mukunda Murari Today Episode March 28 2024 Episode 430 highlights
Krishna Mukunda Murari Today Episode March 28 2024 Episode 430 highlights

ఈరోజు ఎపిసోడ్ లో ఆదర్శ నందూని ఇంట్లో నుంచి వెళ్లిపోమంటాడు. నందు కి ఏమీ అర్థం కాదు ఆదర్శ ఎందుకు అలా అంటున్నాడు అత్తగారింట్లో ఉండాల్సినప్పుడు అత్తగారింట్లోనే ఉండాలి కానీ ఇలా పుట్టింటి వ్యవహారాల మీద జోక్యం చేసుకోకూడదు అని అంటాడు. నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకుండా ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్తే మంచిది అని అంటూ ఉంటే అక్కడికి వచ్చిన మురారి ఎందుకు వెళ్లాలి అని అంటాడు. నీకు ఎంత హక్కు ఉందో నాకు ఎంత హక్కు ఉందో అలాగే నందు కూడా ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంది అని అంటాడు. పోలీసుల దెబ్బలు తగ్గిపోయాయి ఏంటి అప్పుడే నీతులు చెప్పడానికి వచ్చావు అని అంటాడు ఆదర్శ్. నీలాగే నందు కూడా నీతులు చెప్తుంటే అత్తారింటికి పొమ్మని చెప్తున్నాను. అదే నువ్వైతే పర్మినెంట్ గా వెళ్ళిపోమని చెప్పే వాడిని అని ఆదర్శం మురారితో అంటాడు. వెంటనే నందు కోప్పడుతుంది ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నావ్ అని అంటే మీరు నా కళ్ళ ముందు ఉంటే నాకు పిచ్చే పడుతుంది అని అంటాడు ఆదర్శ మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటాడు ఆదర్శ. నేను చెప్పేది వింటేనే కదా నీకు అర్థం అయ్యేది అని అంటాడు మురారి ఏం చెప్తావ్ రా నేను ఏం తినాలి రా అని అంటాడు ఆదర్శ. నీకోసం చేశాను నీకోసం వచ్చాను, ఈ సోదంతా విని విని నాకు ఇప్పటికే చాలా కోపంగా ఉంది అయినా మీరు నాకు చెప్పాల్సిందేమీ లేదు నేను వినాల్సిందేమీ లేదు అని అంటాడు. వెంటనే అందుకు చెప్పేది వింటేనే కదా అని అంటే అసలు ఇద్దరు మగ పిల్లలు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఆడపిల్లలను దూరతావ్ ఏంటి, ఇకనుంచి బయటికి వెళ్ళు అని అరుస్తాడు. అయినా నేను వెళ్ళిపోయినప్పుడు మీరు నా కోసం రాలేదు, వచ్చేవాళ్లే అయితే నేను వెళ్ళంగానే వచ్చేవాళ్ళు అంతేకానీ ముకుంద అడ్డు తొలగించుకోవడానికి, నాకోసం వచ్చారు అని అంటాడు ఆదర్శం నువ్వు చెప్పిందే చెప్పి విసిగిస్తున్నావు అని అంటుంది నందు. మురారి వాడి ఎంత చెప్పినా వినడు వాడంతటి వాడు నిజం తెలుసుకునేదాకా మన మాట నమ్మడు. మనం ఇక నుంచి వెళ్దాం పద అని నందును తీసుకొని రూమ్ లో నుంచి బయటికి వస్తాడు మురారి. మీ గురించి నిజాలు తెలుసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది ఇక నాకు ఏ నిజం తెలుసుకోవాలని లేదు అని పెద్దగా అరుస్తాడు ఆదర్శ.

Krishna Mukunda Murari Today Episode March 28 2024 Episode 430 highlights
Krishna Mukunda Murari Today Episode March 28 2024 Episode 430 highlights

ఇక మరోవైపు ఇద్దరినీ చూసి రేవతి ఏమైంది అని అడుగుతుంది నందు ఆదర్శ అన్నయ్య తిట్టాడు అని చెప్తుంది వెంటనే కృష్ణ మీరు నన్ను కిందకి రమ్మని చెప్పి ఆదర్శ్ దగ్గరికి ఎందుకు వెళ్లారు అని అడుగుతుంది.ఇప్పుడు ఆదర్శ పరిస్థితి ఏంటో తెలిసి కూడా ఎందుకు వెళ్లారు అని అంటుంది రేవతి. వాడితో మాట్లాడకుండా ఉండడం నా వల్ల కావట్లేదు అమ్మ చాలా కష్టంగా ఉంది అని అంటాడు మురారి. మాక్కూడా అలానే ఉంది ఏసీబీ సార్. మనం దగ్గరికి వెళ్తే ఆయన ఇంకా ఎక్కువ ఆవేశపడుతున్నాడు. తన కోపం పోయేవరకు మనం కొంచెం దూరంగా మౌనంగా ఉండటమే మంచిది అని అంటుంది కృష్ణ. అయినా మీ పెద్దమ్మ వచ్చింది కదా ఆవిడే ఆదర్శనీ దారిలో పెడుతుంది అని అంటే మీరాని ఇంటికి తీసుకువస్తే ఇప్పుడు ఎంత గొడవ చేస్తాడు అని అంటుంది నందు ఎవరి దగ్గరైనా వేషాలు వేస్తాడు కానీ అక్కయ్య దగ్గర అలాంటివన్నీ కుదరదు అని రేవతి అంటుంది ఇక అప్పుడే కారులో మీరా భవానీ దేవి దిగుతారు.

Krishna Mukunda Murari Today Episode March 28 2024 Episode 430 highlights
Krishna Mukunda Murari Today Episode March 28 2024 Episode 430 highlights

ఇక మీరా కార్ల నుంచి ఎంట్రీ ఇస్తుంది. మొదటిసారి ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాను అనుకున్నది సాధించలేక వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ ఈసారి మాత్రం వెనకడికి వేసేది లేదు అని అనుకుంటూ కారులో నుంచి దిగుతుంది ముకుంద.అక్కడే ఆగిపోయావ్ ఏంటి రా లోపలికి అని అంటుంది భవాని దేవి. ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళిద్దర్నీ చూస్తూ ఉంటారు. కుడికాలు లోపల పెట్టి ముకుంద ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. కృష్ణ నీ ఇంట్లో వాళ్ళని చూసి తనకి చేసిన అవమానాన్ని గుర్తు చేసుకుంటుంది ముకుంద. ముకుందని చివర్లో కృష్ణ అన్న మాటలు అన్ని గుర్తు చేసుకుని కృష్ణుని చూస్తూ లోపలికి వస్తుంది ముకుంద. ఇక భవానీ దేవి మీరాగా అందరికీ పరిచయం చేస్తుంది. ఇంట్లో అందర్నీ మీరాకీ పరిచయం చేస్తుంది భవానీ దేవి. రేవతి మీరా దగ్గరికి వచ్చి నా బిడ్డ ప్రాణం కాపాడావుని ఈ మెయిల్ ఈ జన్మలో మర్చిపోలేను అమ్మ అని అంటుంది. ఇప్పటివరకు మేడం పొగుడుతూనే ఉన్నారు మీరు ఇప్పుడు మొదలు పెట్టకండి అని అంటుంది రేవతి తో మీరా, సాటి మనిషిగా నేను ఆయనకి సహాయం చేశాను. ఇక ఇంట్లో అందరికీ నీ పరిచయం చేసుకున్నాక, మురారి గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వే కాపాడావు కాబట్టి అని అంటుంది భవాని దేవి. నా ప్రాణాన్ని నేను కాపాడుకోక ఇంకెవరు కాపాడుతారు అని మనసులో అనుకుంటుంది. ఇక నీకు ఇంట్లో ముఖ్యంగా పరిచయం చేయాల్సిన వ్యక్తి, నా ప్రియమైన తింగరి కోడలి కృష్ణ అని అంటుంది భవాని దేవి. నాకు మాత్రం ప్రియమైన శత్రువు అత్తయ్య అని మనసులో అనుకుంటుంది మీరా. ఇక్కడ నీకు ఏ సమస్య వచ్చినా కృష్ణతో చెప్పు చాలు అని అంటుంది భవానీ దేవి నీ మనసులో సంతోషాన్ని నింపుతుంది అని అంటుంది. నా అసలు సమస్య ఈ కృష్ణయ్య అని నీకు ఎలా చెప్పాల అత్తయ్య ఈ కృష్ణకి లేకుండా చేయడానికి నేను ఇంత రిస్క్ చేశాను దీనికి నా సమస్యలు చెప్పబడింది నాన్సెన్స్ అని మనసులో అనుకుంటుంది మీరా, మేడం మీ గురించి మాట్లాడుతున్నారంటే మీరు అంత గొప్ప వాళ్ళు అని కృష్ణతో నాటకాలు ఆడినట్టు మాట్లాడుతుంది. నాకే సమస్య వచ్చినా మీతోనే చెప్తాను అని అంటుంది. తప్పకుండా మీరా నువ్వు ఏది అడిగినా కానీ నేను నీకు సహాయం చేస్తాను అని అంటే నీ మొగుడు కావాలి అని మనసులో అంటుంది మీరా. అయినా నువ్వు నాకు ఇచ్చేదేంటి లాక్కోడానికే ఇక్కడికి వచ్చాను అని అనుకుంటుంది మనసులో, ఇక అప్పుడే అక్కడికి ఆదర్శం వస్తాడు భవానీ దేవి మీరా అని ఆదర్శ్ కి పరిచయం చేస్తుంది. ఆదర్శ్ మాత్రం మీరా వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి ఇంత కోపంగా చూస్తున్నాడు చూడగానే కోపం రావడానికి నేను ముకుందని కాదు కదా ఈ మీరా మీద ఎందుకు అంత కోపం అని అనుకుంటుంది మనసులో, అక్కడే ఉన్న భవానీ దేవి తన భార్య చనిపోవడంతో కొంచెం డల్ గా ఉన్నాడు లే అని కవర్ చేస్తుంది. ఇక అందరికీ ఒక మాట చెప్తాను వినండి మీరా ఇకమీదట మన ఇంట్లో కుటుంబ సభ్యురాలు. ఇకమీదట మన ఇంట్లో ఇక్కడే మనతో పాటే ఉంటుంది అని చెప్తుంది భవానీ దేవి. ఆదర్శ్ మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంట్లో అందరూ సంతోషిస్తారు ఒక ఆదర్శ తప్ప. ఆ విషయం అందరికీ అర్థమవుతుంది ఇక ఆదర్శ కోపంగా పైకి వెళ్ళిపోతాడు. నందు ముకుంద కి అని పొరపాటున మీరు అని ముకుందగా మాట్లాడుతుంది భవానీ దేవి, సారీ ఏదో పొరపాట్లు అనేశాను అని అంటుంది. నందు ముకుంద రూమ్ చూపించు మీరాకి అని అంటుంది. ఇక మీరా నీ ఫస్ట్ ప్లాన్ సక్సెస్ అయిపోయింది. ఈ ఫోటో దండే బాలేదు హాల్లో ఇవి ఏం చేయాలి అని మనసులో అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode March 28 2024 Episode 430 highlights
Krishna Mukunda Murari Today Episode March 28 2024 Episode 430 highlights

ఇక మరోవైపు మీరా ఆలోచిస్తూ ఉంటుంది ఆదర్శ ఎందుకు అంత కోపంగా ఉన్నాడు ఆదర్శ్ కోపాన్ని ఎలాగైనా చల్లార్చలి లేదంటే, వాళ్ళ అమ్మతో చెప్పి ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు అని మనసులో అనుకుంటుంది అసలు నా మీద ఎందుకు అంత కోపంగా ఉన్నాడో, ముకుంద చావు కి మురారి కారణం అయితే నేను మురారిని బయటకు తీసుకొచ్చాను అని నామీద కోపంగా ఉన్నట్టున్నాడు. ఎలాగైనా ఆ కోపాన్ని పోగొట్టాలి అని మనసులో అనుకుంటుంది మీరా, ఇక అంతలో మీరా ఎదురుగా మురారి డ్రెస్ ఆరేయడం చూసి ఆ షర్టు వైపు చూస్తూ ఎంత కాలం ఇలా నీ షట్లని వాచీలని చూసి ఆనంద పడాలి, ఇక ఎంతో కాలం లేదులే తొందరలోనే నేను నిన్ను సొంతం చేసుకుంటాను కరెక్ట్ గా నెల తిరిగేసరికి నువ్వు నా వాడి గా మారిపోతావు అని అనుకుంటుంది. ఇక కిందకి వెళ్లి మురారి షర్టు దగ్గరికి వెళ్లి మురారి షట్ ని తీసుకోవాలనుకుంటుంది. నువ్వు నా సొంతం అయ్యేదాకా నీ షర్ట్ అయినా నా దగ్గర ఉంచుకుంటాను అని అనుకోని కిందకి వెళ్ళబోతుంది.

Krishna Mukunda Murari Today Episode March 28 2024 Episode 430 highlights
Krishna Mukunda Murari Today Episode March 28 2024 Episode 430 highlights

ఇక మరోవైపు భవానీ దేవి,కృష్ణ,మురారి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి ఒక సెం ఏరియాలో ఉందంటే నువ్వు నమ్ముతావా అని మురారి అని అడుగుతుంది భవాని దేవి. ఆ అమ్మాయి ఉండే వాతావరణ చూస్తే మొదటి నాకు నమ్మబుద్ధి అవ్వలేదు అని అంటుంది. కానీ తరువాత తన పరిస్థితి తెలిసి ఆ అమ్మాయికి నీ కష్టాలు ఎందుకు అని అనుకున్నాను అని అంటుంది భవాని. అప్పుడే కృష్ణ నాకు ఒక డౌట్ అత్తయ్య అని అంటుంది నువ్వు డౌట్ పడకపోతే ఆ చనిపోవాలి ఏంటో చెప్పు అని అంటాడు మురారి. ఆ అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి మంచి ఉద్యోగం వస్తుంది కనీసం పాతికవేలు 50,000 జీతం వచ్చే ఉద్యోగమే వస్తుంది మరి అలాంటప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తీసుకొని మంచి ఏరియాలో ఉండొచ్చు కదా ఆ రూమ్ లో ఎందుకు ఉంది ఆ రూమ్ లో ఉండాల్సిన అవసరం ఏంటి అని డౌట్ పడుతుంది కృష్ణ మీరా మీద, నాకు ఆ డౌట్ వచ్చింది కానీ జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తిన్నట్లుంది అందుకనే కొంతమంది ఎదురు దెబ్బలు తగ్గిన తర్వాత జీవితం మీద విరక్తి వస్తుంది అలాంటి వాళ్ళు అలాంటి లైఫ్నే కావాలని కోరుకుంటారు మీరా కూడా అలాంటిదే ఏ ఆశలు కోరికలు లేనట్లు అనిపించింది అని భవాని పొగుడుతుంది మీరాని, కృష్ణ ఆ మాటలకుమీరా మీరా జాలి చూపించి తనకి ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అని అంటుంది. వెంటనే మురారి నువ్వు ఇక మమ్మల్ని మర్చిపోయి తనకి హెల్ప్ చేయడం మొదలుపెట్టేస్తావు అని అంటాడు ప్రేమ జాలి మోతాదుకు మించి ఎక్కువ ఉండకూడదు కృష్ణ అది మనకే నష్టం అంటుంది అని అంటాడు మురారి ముకుంద విషయంలో జరిగింది కూడా అదే నీ లిమిట్స్ లో నువ్వు ఉండు అని కృష్ణకి సలహా ఇస్తాడు మురారి.

ఇక మరోవైపు కిందకి వచ్చినా మీరా మురారి డ్రెస్ ని తీసుకొని ఆ షర్ట్ ని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి నందు వస్తుంది నందు షర్ట్ తీసుకోవడం గమనించిందేమోనని మీరా అనుకుంటుంది కానీ నందు అదంతా చూడదు ఇకమీద నేను ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి వచ్చాను. ఇంత పెద్ద ఇంట్లో చోటు ఇచ్చారు కదా అని నా పనులు నేను మానేయలేను కదా అందుకనే ఎక్కడ ఖాళీ ఉందా అని చూస్తున్నాను అని అంటుంది. నందు ఈ అమ్మాయి ఈ అమ్మ చెప్పినట్లు చాలా సింపుల్ గా ఉంది అని అనుకుంటుంది. మీరా నీ మంచి గా అర్థం చేసుకుంటుంది నందు.

రేపటి ఎపిసోడ్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు మీరా నేను వడ్డిస్తాను అని అంటుంది సుమలత ఎందుకమ్మా నీకు అంత శ్రమ అని అంటుంది వెంటనే కృష్ణ ఏం పర్లేదులే అత్తయ్య అది తన కోరిక అంటుంది కదా ఒకసారి వడ్డించనివ్వండి అని అంటుంది. ఇక మీరా అందరికీ భోజనం వడ్డిస్తుంది. అందరికీ వడ్డించడం అయిపోయిందిగా నువ్వు కూడా కూర్చో అని అంటుంది కృష్ణ. ఇక మీరా వచ్చి కృష్ణ ఎదురుగా చైర్ లో కూర్చొని అన్నం కలుపుతూ ఉంటుంది కృష్ణ చూసి నువ్వు అచ్చం మా ముకుందా అన్నం కలిపినట్లే కలుపుతున్నావే అని అంటుంది. ఇక అందరూ ఒక్కసారిగా మీరా వైపు చూస్తారు. మీరా కూడా షాక్ అవుతుంది.

Related posts

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N