NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

ప‌ల్నాడు జిల్లా ప‌రిధిలోని కీల‌క‌మైన పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం న‌ర‌స‌రావుపేట‌. ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున పైర్‌బ్రాండ్ నాయ‌కుడు, నెల్లూరు నుంచి దిగుమ‌తి చేసుకున్న పోలుబోయిన అనిల్‌కుమార్ యాద‌వ్ ఉన్నారు. ఇక‌, టీడీపీ త‌ర‌ఫున వైసీపీ సిట్టింగ్ ఎంపీ, అభివృద్ధి త‌ప్ప‌.. అన‌వ‌స‌ర రాజ‌కీయం చేయ‌ని నేత‌గా పేరు తెచ్చుకున్న విద్యావంతుడు.. లావు శ్రీకృష్ణ దేవ‌రాయులు ఉన్నారు. ఆయ‌న‌కు సీటు మారుస్తామంటే.. దానికి ఇష్ట‌ప‌డ‌క‌.. పార్టీ మారి మ‌రీ పోటీ చేస్తున్నారు.

అయితే.. ఈ ఇద్ద‌రూ యువ‌నాయ‌కులే అయినా.. ప్ర‌జ‌లు ఎటు మొగ్గు చూపుతున్నారు? అనేది కీల‌కం. రాజ‌కీయాల్లో నేత‌ల క‌న్నా ప్ర‌జ‌ల బ‌ల‌మే కీల‌కంగా ప‌నిచేస్తుంది. ఇలా చూసుకుంటే.. లావు ఇంట్లో కూ ర్చున్నా గెలుస్తాడ‌నే టాక్ పేట‌లో వినిపిస్తోంది. దీనికి ప్ర‌ధాన కారణం.. గ‌త ఐదేళ్ల‌లో ఆయ‌న రాజకీయా ల‌కు అతీతంగా అంద‌రికీ చేరువ‌య్యారు. పార్టీల‌తో సంబంధం లేకుండా.. త‌ల్లో నాలుక‌లా వ్య‌వ‌హ‌రిం చారు. వివాదాల‌కు దూరంగా ఉన్నారు.

సంక్లిష్ట‌మైన స‌మ‌స్య‌గా ఉన్న వ‌రిక‌పూడిసెల ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిదులు తీసుకువ‌చ్చిన ఘ‌నత కూడా లావుకే ద‌క్కుతుంది. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఎంపీ లాడ్స్‌ను తూచ త‌ప్ప‌కుండా ఖ‌ర్చుచేయిస్తూ.. జ‌వాబుదారీగా ఉన్నారు. ఈ ప‌రిణామ‌మే లావును ప్ర‌జ‌ల‌కు చేరువ చేసింది. ఇక‌, ఒకానొక ద‌శ‌లో వైసీపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో నాయ‌కుల‌ను క‌ట్ట‌డి చేసింది. కానీ, లావు మాత్రం రాజ‌దాని రైతుల‌ను క‌లుసుకున్నారు వారికి సంఘీభావం బ‌హ‌రంగంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా.. వారి క‌ష్టాలు విన్నారు.

ఈ సానుభూతి కూడా లావు సొంతం చేసుకున్నారు ఇక‌, వైసీపీ త‌ర‌ఫున పోటీ లో ఉన్న అనిల్‌.. మాట‌లే త‌ప్ప చేత‌ల్లో చేసింది ఏమీ లేద‌ని.. నెల్లూరు సిటీలో ఆయ‌న గురించి బోర్డులే పెట్టిన సొంత నేతలే ఉన్నారు. సొంత బాబాయి.. మాజీ మేయ‌ర్ రూప్ కుమార్ సైతం ఆయ‌న‌తో విభేదించారు. ఇక‌, పేట‌కు ఆయ‌న కొత్త‌కావ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించ‌డం మానేసి.. స‌వాళ్లు విస‌ర‌మే రాజ‌కీయం అన్న‌ట్టుగా ప‌నిచేస్తున్నారు. దీనిని ప్ర‌జ‌లు హ‌ర్షించ‌లేక పోతున్నారు. దీంతో లావు గెలుపు ఖాయ‌మ‌నే వాద‌న ఉంది.

ఇవీ లావుకు క‌లిసి వ‌స్తున్న విష‌యాలు..
+ వివాద ర‌హిత నాయ‌కుడు.
+ అభివృద్ధి త‌ప్ప‌.. రాజ‌కీయాలు చేయ‌క‌పోవ‌డం.
+ అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం.
+ క‌మ్మ సామాజిక వ‌ర్గం టాక్‌
+ టీడీపీలోనూ నిర‌స‌న లేక పోవ‌డం.. క‌లిసి రావడం.
+ బ‌ల‌మైన బీసీ సామాజిక వ‌ర్గాలు కూడా ఆయ‌న‌కు అండ‌గా ఉండ‌డం.

Related posts

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella