NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS: బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు .. పేరు మార్పుతో ఫేట్ మారుతుందా..?

BRS: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ పేరు మార్చే ఆలోచన చేస్తున్నామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ టీఆర్ఎస్ గా మార్చేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత పార్టీకి కలిసి రావడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీ పేరు మార్పుపై ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తం అయ్యిందని ఆయన అన్నారు.

బీఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని స్వయంగా క్షేత్రస్థాయి నాయకులు అధిష్టానం వద్ద మొరపెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పేరుతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ.. పేరు మార్చగానే అధికారం కోల్పోయిందని అన్నారు. ఇదే క్రమంలో తాను పార్టీ మారబోతున్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ మారను అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంత వరకూ బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ చేపట్టిన రైతు పోరు బాట కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు రైతు దీక్షలు చేస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో చేపట్టిన దీక్షలో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకరరావు ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసిఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ మార్పు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ను ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించేందుకు అటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో కమిటీలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో పలు మీటింగ్ లు నిర్వహించారు. ఏపీలో పలువురు కీలక నేతలతో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కీలక నేతలు వరుసగా గుడ్ బై చెబుతూ వచ్చారు. ఏపీ కమిటీ నేతలు వేరువేరు పార్టీల్లో చేరిపోయారు.

తెలంగాణలో అనేక మంది నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరగా, కొందరు బీజేపీలో చేరి లోక్ సభ టికెట్ లు తెచ్చుకున్నారు. పార్టీ తీవ్ర గడ్డుపరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల రావడానికి కారణంపై బీఆర్ఎస్ నేతలు సమాలోచనలు  చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ భవనంలో వాస్తు దోషాలను గుర్తించి సరి చేసే పనిలో ఉన్నారు. మరో పక్క పార్టీ పేరు మార్పు కలిసి రాలేదని గుర్తించారు. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గా మార్పు చేయాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పేరుతోనే పోటీ చేస్తామని ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?