NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 15 2024 Episode 384: కావ్య గురించి గొప్పగా చెప్పిన రాజ్.. వెన్నెల ఎంట్రీ చూసి షాక్ అయిన కావ్య..? ఎండి సీటు పైన కన్నేసిన రాహుల్..

Brahmamudi Today Episode April 15 2024 Episode 384 highlights

Brahmamudi April 15 2024 Episode 384: రాజ్ రీ యూనియన్ ఫంక్షన్ కి కావ్య ని కూడా తీసుకువెళ్లాలి అనుకుంటాడు. శ్వేత హెల్ప్ తో రాజ్ కావ్యను బతిమిలాడి ఫంక్షన్ కి రమ్మంటాడు దాంతో కావ్య వస్తానంటుంది. కావ్య ఫంక్షన్ కి వెళ్లే ముందు కృష్ణుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటూ ఉంటుంది. వెన్నెల కనక దొరికితే ఇదే నాకు ఆఖరి రోజు అవుతుంది ఇంట్లో అలా జరగకుండా ఉండేలాగా నేను చేసే ఈ ప్రయత్నంలో నువ్వు నాకు సహాయం చేయకపోయినా పర్లేదు కానీ న్యాయం చెయ్యి అని కృష్ణుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అదంతా గమనించిన ఇందిరాదేవి లోపలికి వచ్చి కావ్యతో, నేను ఇదంతా చేయకుండా ఉండాల్సింది కావ్య అసలు అని అంటుంది అంటే మీరు నిజాన్ని సమాధి చేయాలనుకుంటున్నారా అని అంటుంది కావ్య లేదు నువ్వు నాతోనే ఉండాలని అనుకుంటున్నాను అంటుంది ఇందిరా దేవి. మీరు అనుకున్నట్లు జరిగితే ఆ బిడ్డ తల్లి ఎవరు ఎలా తెలుస్తుంది అని అంటుంది కావ్య. నేను నీకు సమాధానం చెప్పలేకపోతున్నాను కావ్య అని అంటుంది ఇందిరా దేవి. నేను ఫంక్షన్ కి వెళ్తే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది అమ్మమ్మ గారు అంటుంది. కానీ నువ్వు వస్తావో రావో తెలియదు కదా అంటుంది ఇందిరా దేవి తిరిగి రావాలని కోరుకుంటున్నాను అని అంటుంది కావ్య. మళ్లీ ఇంటికి రావాలని కోటి ఆశలతో వెళుతున్నాను. కానీ నేను పడుతున్న ఆశకు ఇంకొన్ని గంటలు మాత్రమే ఊపిరి ఉంది దానికి తిరిగి ప్రాణం పోస్తాడో లేక అర్ధంతరంగా ఆపేస్తాడు మీ మనవడి నిర్ణయం అని అంటుంది కావ్య. ఆ మాట చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కావ్య.

Brahmamudi Today Episode April 15 2024 Episode 384 highlights
Brahmamudi Today Episode April 15 2024 Episode 384 highlights

ఇక మరోవైపు ఆఫీసులో రాహుల్ కళ్యాణ్ ని గమనిస్తూ ఉంటాడు. నేను చేయబోతున్న పాపం గురించి తెలియక సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నాడు. వీడికి నిజం తెలిసే టయానికి ఆ పోస్ట్ నుంచి విడీని గెంటేస్తారు అని అనుకుంటూ ఉంటాడు రాహుల్. టోనీ కి ఫోన్ చేస్తాడు రాహుల్, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటాడు టోనీ. నువ్వు నాకోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం అనుకున్న టైం వచ్చేసింది. నువ్వు అబ్రాడ్ నుంచి తెచ్చిన 10 కిలోల బంగారాన్ని మా కంపెనీ కొనేలా చేస్తాను అని అంటాడు. పోలీసులతో ప్రాబ్లం అవుతుందేమో అప్పుడు మాత్రం నేను ఉండను అని అంటాడు నేను కూడా ఉండను దానికోసం బలవడానికి నేనొకడిని సిద్ధం చేసి పెట్టానులే అని అంటాడు రాహుల్. అయితే అగ్రిమెంట్ మీద సైన్ చేయించు పని మొదలు పెడదాం అని అంటాడు టోనీ, అగ్రిమెంట్ మీద సంతకం చేయిస్తాలే కానీ నాకు ఇవ్వాల్సిన 20% మాత్రం ఎక్కడా తగ్గకూడదు అని అంటాడు రాహుల్. దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటాడు టోనీ అయితే ఉంటాను అని పెట్టేస్తాడు ఫోన్. రాహుల్ ఆ దొంగ బంగారం ఫైల్ ని తీసుకువెళ్లి కళ్యాణ్ కి ఇవ్వాలనుకుని వెళ్తాడు.

Brahmamudi Today Episode April 15 2024 Episode 384 highlights
Brahmamudi Today Episode April 15 2024 Episode 384 highlights

ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్లిన రాహుల్ నీకో గుడ్ న్యూస్ చెప్పాలి కళ్యాణ్ అని అంటాడు ఏంటో చెప్పు అంటాడు. మనకి గోల్డ్ తక్కువ రేట్ కి వస్తుంది శకుంతల గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు మనకి తక్కువ రేటుకే గోల్డ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు అని అంటాడు. తక్కువ రేట్ కి ఎందుకు ఇస్తారు అని కళ్యాణ్ అడుగుతాడు. వాలు అబ్రా నుంచి తెచ్చుకున్న దానికి టాక్స్ మినహాయించి మనకి అమ్ముతారుట అని అంటాడు. అవునా అని అంటే కళ్యాణ్, వెంటనే రాహుల్ అంత చిన్నగా అంటావేంటి ఇంత పెద్ద సంతోషకరమైన వార్త చెప్తే అయినా వాళ్ళు మనకి గోల్డ్ సప్లై చేసిన వాళ్లే వాళ్లకు అనుభవం కూడా ఉంది ఇప్పుడు మనం గోల్డ్ ని తక్కువ రేటు కొంటే మనకి ఉపయోగం కదా అని అంటాడు రాహుల్. అయితే నేను ఒకసారి అన్నయ్యని అడిగి చెప్తాను అని అంటాడు కళ్యాణ్. సరే కళ్యాణ్ ముందు ఈ ఫైల్ చదువు అని ఫైల్ ఇచ్చేసి వెళ్లిపోతాడు రాహుల్. బయటికి వచ్చిన తర్వాత ఆ పిచ్చోడా ఆ రాజ్ ఇప్పుడు ఫంక్షన్లో ఉన్నాడు నువ్వు రాజ్ వచ్చేలోపునీతో సంతకం చేయించి నేను ఆ ఫైల్ ని తీసుకుంటాను చూస్తూ ఉండు అని అంటాడు.

Brahmamudi Today Episode April 15 2024 Episode 384 highlights
Brahmamudi Today Episode April 15 2024 Episode 384 highlights

ఇక మరోవైపు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది అప్పుడే రాజ్ కావ్య ఇద్దరు బిడ్డని తీసుకొని ఫంక్షన్ కి వస్తారు. అక్కడే ఉన్న శ్వేతా వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. ఈరోజు కాలేజీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకునే రోజు అని శ్వేత రాజ్ ని చూసి అనుకుంటుంది. అసలు వెన్నెల బాబుని రాజ్ కి ఎందుకు ఇచ్చింది వీళ్ళ చీకటి కోణం గురించి ఇప్పుడుతెలిసిపోతుంది అని శ్వేత అనుకుంటుంది. శ్వేతను చూసిన తర్వాత రాజ్ మొత్తానికి నన్ను పట్టుబడి ఇక్కడికి వచ్చేలా చేసావు అని అంటాడు. తప్పలేదు రాజ్ మన గతాన్ని మనం మర్చిపోకూడదు కదా అని అంటుంది శ్వేత. నా గతం నువ్వు అనుకునే అంత గొప్పది కాదులే అని అంటాడు రాజ్. కానీ పాత మిత్రుని గుర్తు పెట్టుకోవడం వల్ల పోయేదేం లేదు కదా అని అంటుంది శ్వేత. మనం అప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం ఆస్తి ఎలా ఉంది. స్నేహం అల్లరి గొడవలు అన్నీ గుర్తు చేసుకోవచ్చు రాజ్ అని అంటుంది శ్వేత. పక్కనే ఉన్న కావ్య కరెక్ట్ శ్వేత. కొన్ని పరిచయాలు అక్కడితోనే ఆగిపోవచ్చు కొన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండొచ్చు. ఏ స్నేహం ఏ మలుపు తిప్పుతుందో ఎవరికి తెలుసు అని అంటుంది కావ్య. శ్వేత సరే సరే మనం అందరం ఇక్కడే ఉంటే బాగోదు వెళ్దాం పదండి అని లోపలికి తీసుకువెళ్తుంది. ఇక అందరికీ పరిచయం చేస్తుంది శ్వేత రాజ్ ని కావ్య నీ బిడ్డని, బాబు ఏడుస్తూ ఉంటే ఆయాన్ తీసుకురమ్మని శ్వేత చెప్తుంది ఇక ఆయా వచ్చి బిడ్డను తీసుకొని వెళ్తుంది.బిడ్డని ఇవ్వడానికి రాజ్ సందేహిస్తాడు ఏం పర్లేదు రాజ్ ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలందరినీ చూసుకోవడానికి నేనే ఏర్పాటు చేశాను ఆయనే ఇవ్వు అని అంటుంది. దాంతో బిడ్డని ఇస్తాడు రాజ్.

Brahmamudi Today Episode April 15 2024 Episode 384 highlights
Brahmamudi Today EpisoBrahmamudi Today Episode April 15 2024 Episode 384 highlightsde April 15 2024 Episode 384 highlights

ఇక ఫంక్షన్ కి, రాజ్ ఫ్రెండ్ వస్తాడు. అదేంటి నువ్వు ఈ అమ్మాయి తో కలిసి వచ్చావు మీరిద్దరూ విడిపోయారు కదా అని అంటాడు రాజ్. లేదు రాజు మేమిద్దరం ఒకరికి ఒకరు అర్థం చేసుకున్నాము పైన ఉన్న దేవుడు కూడా బ్రహ్మముడిని ఒకసారి కలిపిన తర్వాత వేరు చేయలేదు మేమిద్దరం విడిపోదామనుకున్నాం విడాకులు కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ మాకు వేసిన బ్రహ్మ ముడి మా ఇద్దరిని విడిపోకుండా చేసింది అని అంటాడు. పక్కనే ఉన్న కావ్య అంటే ఎప్పటి నుంచో మీరు భార్యాభర్తలను విడగొట్టే పని పెట్టుకున్నారు అన్నమాట అని అంటుంది. అంటే పీటల మీద నుంచి పెళ్లి కొడుకుని తీసుకొని వెళ్లారు కదా అని అంటుంది కావ్య ఇక పక్కనే ఉన్న శ్వేత చాలా మంచి పని చేశావు సందీప్ అని అంటుంది. నీ భార్యని నువ్వు అర్థం చేసుకున్నావు అని అంటుంది సందీప్ తో శ్వేత. అలా అర్థం చేసుకుంటే లైఫ్ లాంగ్ కలిసి ఉంటాము. అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ దొరకడం కూడా చాలా అదృష్టం అని అంటాడు సందీప్. పీటల మీదే తనని నేను వదిలేసి వచ్చినా తను నన్ను అర్థం చేసుకుంది. అర్థం చేసుకునే భార్య ఉంది కాబట్టి నువ్వు మారావు అని అంటుంది శ్వేత అర్థం చేసుకునే భార్య ఉండి కూడా మారకపోతే వాడు మూర్ఖుడే అని అంటాడు సందీప్. బాగా చెప్పావు సందీప్ ఈ విషయం కనుక అందరూ తెలుసుకుంటే ఎంత బాగుంటుందో అని రాజ్ వైపు చూస్తూ అంటుంది శ్వేత. ఇక కావ్య శ్వేతని పక్కకు తీసుకొని వెళుతుంది.

Brahmamudi Today Episode April 15 2024 Episode 384 highlights
Brahmamudi Today Episode April 15 2024 Episode 384 highlights

ఇక కావ్య చేతితో వెన్నెల రాలేదా అని అడుగుతుంది వీళ్ళలో వెన్నెల లేదా అని అంటుంది. లేదు అని అంటుంది శ్వేత అంటే అని ఆశ్చర్య పోతుంది కావ్య, రావడం లేదా ఏంటి అని అడుగుతుంది. ముందు రాజు లాగా తను కూడా రానని చెప్పింది కానీ ఇప్పుడు వస్తానని ఒప్పుకుంది తను కూడా రాజు లాగా ఎక్కువ మాట్లాడదు అని కావ్యతో చెప్తుంది శ్వేత. వెన్నెల ఇప్పుడు కచ్చితంగా వస్తుంది అని అంటుంది. తన మాటలు నీకు కొంచెం బాధ కలిగిస్తాయి తను మాట్లాడడమే చాలా కఠినంగా మాట్లాడుతుంది అని అంటుంది శ్వేత. మాట్లాడాల్సింది మాత్రమే మాట్లాడి ఫోన్ పెట్టేసింది అని అంటుంది శ్వేత. మా ఆయన గురించి ఏమన్నా అడిగిందా అని అంటుంది కావ్య ఏం అడగలేదు అని అంటుంది. అసలు రాజ్ మాట కూడా ఎత్తలేదు. ఎంతసేపు ఎట్లా వస్తుందో ఫోన్ చేసి కనుక్కో అని అంటుంది కావ్య. ఇప్పుడే కాల్ చేస్తాను శ్వేత వెన్నెలకి కాల్ చేస్తుంది. వెన్నెల ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఎక్కడ ఉన్నావ్ అని అడుగుతుంది శ్వేత. కారులో దారిలో అని అంటుంది వెన్నెల. అందరూ వచ్చేసారు నీకోసమే వెయిటింగ్ అని అంటుంది శ్వేత వచ్చేస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తుంది వెన్నెల. తను ఎలాంటిదైనా సరే ఇక్కడికి వస్తే చాలు నా భర్తని, బాబుని చూపించి ఎందుకు ఇలా చేసిందో కనుక్కుంటాను అని అంటుంది కావ్య. ఈరోజు బాబు సమస్యకి నా సమస్యకి ఒక పరిష్కారం దొరకాల్సిందే అని అంటుంది.

ఇక మరోవైపు కనకం ఇంటికి, గజలక్ష్మి వస్తుంది. రావడంతోనే కనకం ఎక్కడ అని అడుగుతుంది కృష్ణమూర్తిని కనకం లోపల ఉంది అని చెప్తాడు అంతలో అక్కడే ఉన్న అప్పు, వచ్చినా గజలక్ష్మితో వెటకారంగా మాట్లాడుతుంది నీకు మాత్రం వెటకారం తగ్గలేదే ఇంకా అని అంటుంది. ఇక కనకం వచ్చి ఏంటే ఇలా వచ్చావు అని అడుగుతుంది. ఇంకెందుకు అసలు వస్తుందమ్మా ఏ పప్పు కోసం ఉప్పు కోసమా అయ్యి ఉంటుంది అని అంటుంది అప్పుడు లేదే నీకోసమే అని అంటుంది గజలక్ష్మి. వెంటనే కనకం ఏంటి అప్పు కోసం వచ్చావా అని అంటే అవును అప్పుడు కోసం ఒక పెళ్లి సంబంధం తీసుకొని వచ్చాను అని అంటుంది గజలక్ష్మి. ఆ మాట విని అందరూ షాక్ అవుతారు. ఇక పెళ్ళికొడుకు డీటెయిల్స్ చెప్తుంది. అబ్బాయి పేరు శంకరం, వాళ్లకి నాలుగు టిఫిన్ షాపులు ఉన్నాయి నెలలకు లక్షల్లో సంపాదిస్తున్నారు అని అంటుంది. సొంత ఇల్లు కూడా ఉంది ఇదిగో ఫోటో కూడా తీసుకొచ్చాను చూడు అని కనకానికి ఇస్తుంది గజలక్ష్మి. ఫోటో చూసి కనకం షాక్ అవుతుంది పక్కనే ఉన్న కృష్ణమూర్తి ఏది ఇలా ఇవ్వు అని ఫోటో చూస్తాడు కృష్ణమూర్తి అబ్బాయి కొంచెం వయసు ఎక్కువగా ఉంది కదా అని అంటాడు. అదేం లేదు అన్నయ్య జస్ట్ 40అని అంటుంది. కానీ నాలుగు చేతుల సంపాదిస్తున్నాడు అని అంటుంది గజలక్ష్మి ఆ మాటలు విని అప్పుకి కోపం వస్తుంది. ఇక గజలక్ష్మి కాకపోతే మొదటి పెళ్ళాం చనిపోయింది అన్నయ్య, ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు ఇప్పుడు అప్పు తీసి చేశామంటే అప్పు హ్యాపీగా ఉంటుంది అని ఉంటుంది ఇక వెంటనే కనుక కోపంగా, ఏంటి గజలక్ష్మి ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని అంటుంది. నా కూతురికి నువ్వు ఇలాంటి సంబంధం తీసుకొస్తాం అనుకోలేదు అని అంటుంది కనుకమ్. నేను తీసుకొచ్చిన సంబంధం లేదు తప్పేం లేదు లక్షలు సంపాదిస్తున్నాడు. అదే కదా మనకి ముఖ్యం అని అంటుంది చాలా ఆపు అని అంటుంది కనుకమ్.డబ్బు ముఖ్యమని మేము ఎప్పుడైనా నీతో చెప్పాము అని అంటుంది. చెప్పాలా ఏంటి అర్థం కావట్లేదా మొదటి కూతురు డబ్బుకోసం ఒకని ప్రేమించి పెళ్లి చేస్తుంది రెండో కూతురు ఆ ఇంటికి వెళ్లి, డబ్బు కోసం అక్కడే ఉండిపోయింది. పైగా ఇప్పుడు ఇంకో బిడ్డని కూడా తీసుకొచ్చాడంట కదా మీ అల్లుడు అని అంటుంది గజలక్ష్మి. ఆ రెండు సంబంధాలతో పోల్చుకుంటే ఇది మంచి సంబంధం అని అంటుంది. నువ్వెక్కడ నుంచి వెంటనే పారిపోవడం నీకు కూడా మంచిది అని అంటుంది అప్పు. అంటే పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉండిపోతావా అని అంటుంది గజలక్ష్మి. కచ్చితంగా కాదు అని అంటుంది అప్పు. ఇలా ఉప్పు పప్పు అని ఊరి మీద పడకుండా ఏదో ఒకటి కచ్చితంగా సాధిస్తాను అని అంటుంది అప్పు. అవునవును మొన్ననే వెళ్ళావు కదా పోలీస్ అవ్వాలని పోయిందంటగా, బయట చెప్పుకుంటున్నారు లే అని అంటుంది. నువ్వెక్కడ నుంచి వెళ్లకపోతే, పప్పు కోసం వచ్చి పచ్చడి అయిపోయిన గజలక్ష్మి అని, అదే వీధిలో వాళ్ళు అందరూ అనుకునేలా చేస్తాను అని అంటుంది. గజలక్ష్మి ఫోటో తీసుకొని వెళ్ళిపోతుంది. కనకం కృష్ణమూర్తి ఇద్దరు బాధపడుతుంటే అప్పు, నువ్వు ఏడ్చి మమ్మల్ని ఏడిపించేది అమ్మ అని అంటుంది. ప్రశాంతంగా ఉన్న నన్ను ఇబ్బంది పెట్టమాకండి అని వెళ్ళిపోతుంది.

ఇక మరోవైపు ఫంక్షన్ లో శ్వేత ట్రూత్ ఆర్ డైర్ గేమ్ ఆడిస్తూ ఉంటుంది. ధైర్యం ఉంటే నిజం చెప్పండి లేదంటే సైలెంట్ గా ఉండండి అని అంటుంది. ఇక బాటిల్ ని టేబుల్ మీద పెట్టి తిప్పుతుంది ఆ బాటిల్ ఎవరి వైపు వస్తే వాళ్ళు నిజం చెప్పాలి అని అంటుంది. ఇక బాటిల్ ఫస్ట్ టైం తిప్పినప్పుడు శ్వేత వైపు తిరుగుతుంది. ఇక పక్కనే ఉన్న సందీప్ మొదట నువ్వే చెప్పాలిట్రూత్ ఆర్ డై ఏదో చెప్పు అని అంటాడు. వెంటనే ట్రూత్ అని అంటుంది శ్వేత అయితే క్యూస్షన్ నేను అడుగుతాను అని, సందీప్ అంటే అడగమని శ్వేత అంటుంది నీకు ఇంతమంది ఫంక్షన్లో ఎవరంటే ఇష్టం అని అంటారు. రాజ్ అని అంటుంది శ్వేత మరి నీకు నచ్చని వ్యక్తి ఎవరు అని అడుగుతారు. అది కూడా రాజ్ అని అంటుంది శ్వేత. అదేంటి ఒక మనిషి నచ్చడం నచ్చకపోవడం ఏదో ఒకటే జరగాలి కానీ ఒక మనిషిలోని రెండు ఎలా ఉంటాయి అని అడుగుతాడు సందీప్. నాకు హెల్ప్ చేసే క్రమంలో నాకు నచ్చాడు. తన దగ్గరికి వచ్చేసరికి ఫెయిల్ అయ్యాడు అందుకే నాకు నచ్చట్లేదు అని అంటుంది శ్వేత. గణేష్ ఎవరి వైపు బాటిల్ తిరుగుతుంది అని చూస్తూ ఉంటారు. నెక్స్ట్ సందీప్ వంతు వస్తుంది. ట్రూత్,డేరా అని అడుగుతుంది శ్వేత. ఆల్వేస్ డేర్ అని అంటాడు సందీప్.పక్కనే ఉన్న సందీప్ భార్య అయితే నేను చెప్పినట్టు చేయండి అని అంటుంది ఊరికే చేస్తాను చెప్పు అని అంటాడు సందీప్ అయితే మీ అమ్మగారికి కాల్ చేయండి అని అంటుంది. చేసిన తర్వాత ఒకటే చెప్పండి నువ్వు చేసిన వంటకం నా భార్య చేసిన వంట బాగుంటుంది అని చెప్పండి చూద్దాం అని అంటుంది. ఇటువంటి నీ శ్వేత చెయ్ ఫోన్ చెయ్ డేర్ చెయ్ అని అంటుంది సందీప్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు ఏంటి నాన్న అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మమ్మీ నువ్వు చేసే వంటలు బాగోవు, నా భార్య చేసే వంటలే బాగుంటాయి అని అంటాడు. వెంటనే వాళ్ళ అమ్మ తిట్టడం ప్రారంభిస్తుంది. పాతికేయులు నిన్ను పెంచింది ఎవరు నా వంటలు తినే పెరిగావు అని అంటుంది. నువ్వు ఇంటికి వచ్చిన చెప్తారా నీ సంగతి అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక తర్వాత రాజ్ వంతు వస్తుంది. శ్వేతా ట్రూత్ ఆర్ డేర్ చెప్పు రాజ్ అని అంటుంది. ట్రూత్ అని అంటాడు. నీ భార్య మీద నీకు ఎంత ప్రేమ ఉందో చెప్పు అని అంటుంది శ్వేత. నా భార్య పేరు కావ్య. నేను కళావతి అని పిలుస్తాను. కావ్య గురించి చెప్పాలంటే ఒక కావ్యమే రాయాలి అని అంటాడు. రాజ్ మాట్లాడుతుంటే కావ్య ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. ఒక భార్య తన భర్తతో మీ అమ్మ వంటలు బాగా లేవని చెప్పమంది. ఒక భార్య భర్త మీద మూడేళ్లుగా అని ఇచ్చి పెట్టుకున్న కోపాన్ని చూపించి చంప దెబ్బ కొట్టింది కానీ నా భార్య, మా అమ్మకి ఎదురు చెప్పదు. కుటుంబ సభ్యులు అందరూ అవసరాలు చూస్తుంది.ముఖ్యంగా నా మీద కోపం వచ్చినా అది ఒక పూట కూడా ఉండదు. మాటల్లో ఇష్టాన్ని చూపిస్తుంది. నా కళ్ళల్లో కష్టానికి గమనిస్తుంది. ఆమెలో నాకు నచ్చే గుణం ఏంటంటే, కోల్పోయిన వాటి గురించి ఆలోచించదు. అందులో నుంచి కోలుకోవడం ఎలాగో ఆలోచిస్తుంది. అలా రాజ్ కావ్య గురించి గొప్పగా చెప్తుంటే కావ్య సంతోషంతో రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్లో శ్వేత బయట ఎదురు చూస్తూ ఉంటుంది. రాజ్ వచ్చి ఏంటి ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు నేను ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను అని అంటుంది నాకు తెలియని ఫ్రెండ్ ఎవరు అని అడుగుతాడు. వెన్నెల అని అంటుంది శ్వేత అప్పుడే అక్కడ ఉన్న కావ్య వెన్నెల అని అంటుంది. అదేంటి నీకు వెన్నెల తెలుసా అని అంటుంది శ్వేత. నాకు ఒక వెన్నెల తెలుసు ఆ వెన్నెల ఈ వెన్నెల ఒక్కటో కాదు మా ఆయనే చెప్పాలి అని అంటుంది. రాజ్ టెన్షన్ పడుతూ వెన్నెల ఇక్కడికి వస్తే నిజం తెలిసిపోతుంది ఇప్పుడు ఎలాగో అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే వెన్నెల కారు వస్తుంది వెంటనే శ్వేత అదిగో వెన్నెల వచ్చింది అని అంటుంది. కార్ లోనుంచి వెన్నెల దిగుతుంది. వెన్నెలను చూసి కావ్య షాక్ అవుతుంది.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N