NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

రాజ‌కీయంగా చైత‌న్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ‌. అటు క్రికెట్ అయినా.. ఇటు రాజ‌కీయాలైనా.. తెలంగాణ లో హాట్ టాపిక్కే. ఇక్క‌డ భారీ ఎత్తున పందేలు కూడా సాగుతుంటాయి. అనేక సంద‌ర్భాల్లో ఇక్క‌డ పెద్ద ఎత్తున దాడులు కూడా జ‌రిగాయి. అయిన‌ప్ప‌టికీ.. ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా.. ఇక్క‌డ బెట్టింగులు ఖాయం . ఎక్క‌డ క్రికెట్ జ‌రిగినా.. ఇక్క‌డ కోట్లు క‌ద‌ల‌డం ఖాయం. సో.. ఇప్పుడు కూడా ఏపీ ఎన్నిక‌ల విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతోంది. మొత్తంగా 5 నియోజ‌క‌వ‌ర్గాల‌పై తెలంగాణ‌లో బెట్టింగులు క‌ట్టిన‌ట్టు స‌మాచారం.

హైద‌రాబాద్‌, నిజామాబాద్ కేంద్రంగా సాగుతున్న ఈ బెట్టింగుల‌పై పోలీసులు కూడా నిఘా పెట్టార‌ని స‌మాచారం. నిజానికి తెలంగాణ‌లో కూడా పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. ఏపీలో ఉన్నంత హాట్ టాపిక్అక్క‌డి ఎన్నిక‌ల‌పై మాత్రం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధానంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌హా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌పై బెట్టింగులు క‌ట్టారు. వీరితోపాటు.. నారా లోకేష్ పైగా బెట్టింగులు సాగుతున్నాయి. అలాగే.. టీడీపీ సీనియ‌ర్ నేత‌.. గంటా శ్రీనివాసరావుపైనా బెట్టింగులు సాగుతున్నాయి. అలాగే ష‌ర్మిల పైనా పందేలు క‌ట్టారు.

చంద్ర‌బాబు: కుప్పంలో ఈ సారిఆయ‌న‌ను ఓడిస్తామ‌ని.. వైసీపీ ప్ర‌తిజ్ఞ చేసింది. దీంతో ఆయ‌న గెలుపుపై జోరుగా పందేలు క‌డుతున్నారు. ఇది ఒక్క తెలంగాణ‌లోనే కాదు.. తిరుప‌తిలోనూ సాగుతోంది.

జ‌గ‌న్‌: వైనాట్ పులివెందుల నినాదంతో టీడీపీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. అయితే.. ఆయ‌న గెలుపు కంటే కూడా.. మెజారిటీపైనే ఎక్కువ‌గా పందేలు క‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల కంటే ఎక్కువ‌గా మెజారిటీ వ‌స్తుంద‌ని ఒక‌రు.. రాద‌ని మ‌రొక వ‌ర్గం పందేలు క‌డుతోంది.

ప‌వ‌న్: పిఠాపురంలో హాట్‌గా ఉన్న ప‌వ‌న్ ప్ర‌చారంపైనా ఎక్కువ‌గా బెట్టింగులు కడుతున్నారు. ఆయన గెలుస్తార‌ని కొంద‌రు.. లేద‌ని ఎక్కువ మంది చేతులు క‌లిపారు.

నారా లోకేష్‌: మంగ‌ళ‌గిరిలో మ‌రోసారి పోటీ చేస్తున్న నారా లోకేష్ గెలుపుపై ఎక్కువ మంది పందెం క‌డితే.. ఓడిపోతార‌ని.. అంతే స్థాయ‌లో మ‌రికొంద‌రు క‌ట్టారు.

గంటా : ఈయ‌న భీమిలిలో ఈ ద‌ఫా ఓట‌మి ఖాయ‌మ‌ని ఎక్కువ మంది పందెం క‌ట్ట‌డం విశేషం.

ష‌ర్మిల‌: క‌డప ఎంపీ బ‌రిలో ఉన్న ష‌ర్మిల చిత్తుగా ఓడిపోతార‌ని.. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుడు పందెం క‌ట్ట‌డం చ‌ర్చ‌గామారింది. అయితే.. ఈయ‌న కు ఒకే ఒక్క‌రు పోటీలో ఉన్నారు. ఆయ‌న మాత్రం బ‌ల‌మైన గెలు పు ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?