NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

Mamagaru Today Episode April 18  2024 Episode 189 highlights

Mamagaru April 18  2024 Episode 189: గంగాధర్ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో గంగ ఇంటికి వస్తుంది. ఏమండీ బాగా అలసిపోయాను ఒక కాఫీ పెట్టి ఇవ్వండి అని అడుగుతుంది. గంగాధర్ వెళ్లి కాఫీ పెట్టి తెచ్చి గంగకి ఇస్తాడు. ఏంటండీ కాఫీ ఇలా పెట్టారు అని గంగ అంటుంది. ఎలా పెట్టాను గంగ పనీపాటా లేని వాడిని కాపీ పెట్టడం కూడా రాదు అలా బయటికి వెళ్లి వస్తాను అని గంగాధర్ అంటాడు. ఏమండీ నేను ఇప్పుడే వచ్చాను మీరు కాసేపు ఇంట్లో ఉండొచ్చు కదా అని గంగ అంటుంది. పని పాట లేని వాన్ని కదా గంగ అలా బయటకు వెళ్లి వస్తాను అని గంగాధర్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 18  2024 Episode 189 highlights
Mamagaru Today Episode April 18  2024 Episode 189 highlights

 

దేవమ్మ సుధాకర్ ని పిలిచి పెళ్లి పనులన్నీ మీ నాన్న నీకే అప్ప చెప్పాడు అంట కదా ఎవరిని మర్చిపోకుండా పిలువు అని చెబుతుంది. అవునమ్మా నాన్న  నాకే అప్పజెప్పాడు అని సుధాకర్ అంటాడు. సుధాకర్ నీ పనిలో పడి మర్చిపోకు రా అందరిని పిలువు ఒకరిని పిలిచి ఒకరిని పిలవకపోతే బాధపడతారు ఈ పెళ్లి తోటైనా అందరూ కలిసి ఉండాలి అని దేవమ్మ అంటుంది. గంగాధర్ గంగని చంగయ్య పిలువద్దన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు సుధాకర్. ఎన్నిసార్లు చెప్పిందే చెప్తావ్ అమ్మ నాకు గుర్తుంది లే అని సుధాకర్ అంటాడు. పనిలో పడి మర్చిపోతావేమోనని చెబుతున్నాను రా ఎవ్వరిని వదిలిపెట్టకుండా అందర్నీ పిలువు అని దేవమ్మ చెబుతుంది. సుధాకర్ అలాగే అంటూ వెళ్లిపోతాడు. భగవంతుడా ఈ పెళ్లి తోటి అయినా విడిపోయిన అందరూ ఒకటయ్యేలా చూడు స్వామి అని దేవమ్మ అనుకుంటుంది.కట్ చేస్తే,

Mamagaru Today Episode April 18  2024 Episode 189 highlights
Mamagaru Today Episode April 18  2024 Episode 189 highlights

ఏమండీ భోజనం చేద్దాం రండి ఆకలేస్తుంది అని గంగ అంటుంది. నాకు ఆకలిగా లేదు పని పాట లేని వాణ్ణి కదా నాకు ఆకలి ఎక్కడ వేస్తుంది గంగ నువ్వు తిను అని గంగాధర్ అంటాడు. పొద్దున ఏదో ఆవేశంలో అలా అన్నాను సారీ కూడా చెప్పాను కదండీ సారీ ఇంకెప్పుడు అలా అనను అని గంగ గుంజీలు తీస్తుంది. సరే ఇక్కడే తిందాం రండి అని గంగ అన్ని తెచ్చి అక్కడ పెట్టి అన్నం వేస్తుంది. అన్నం తింటూ గంగాధర్ ఇప్పుడు కూడా గ్యాస్ ఎలా వచ్చిందండి అని అడగడం లేదు చూడు గంగ అn బాధపడతాడు. ఏమైందండీ అన్నం ఎందుకు తినట్లేదు అని గంగ అడుగుతుంది. గంగ గ్యాస్ ఎలా వచ్చిందని అడగవా గ్యాస్ అయిపోయింది బుక్ చేసావ్ గ్యాస్ కి డబ్బులు పెటీపొలేదు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవు అదే సమయానికి నాన్న వచ్చాడు నన్ను చేతగాని వాడినని తిట్టి వెళ్ళిపోయాడు అని గంగాధర్ అంటాడు. గ్యాస్ కోసం డబ్బులు మీ పాయింట్ జోబులో పెట్టి వెళ్లాను కదా అండి ఏదో ప్రాజెక్టు వర్క్ టెన్షన్ లో ఉండి ఫోన్ ఎత్త లేకపోయాను డబ్బులు పెట్టి వెళ్లాలనిని ధీమాతో ఉన్నానండి అని గంగ అంటుంది. ఇల్లంతా వెతికాను గంగ డబ్బులు ఎక్కడ దొరకలేదు అని గంగాధర్ అంటాడు.

Mamagaru Today Episode April 18  2024 Episode 189 highlights
Mamagaru Today Episode April 18  2024 Episode 189 highlights

మీ పాయింట్ జోబులో పెట్టాను ఉండండి తెస్తాను అంటూ గంగ వెళ్లి చూసేసరికి అక్కడ బట్టలు లేవు ఏంటండి అని గంగ అడుగుతుంది. బట్టలన్నీ పిండేసి ఇక్కడ ఆరేసాను గంగ అని గంగాధర్ చెబుతాడు. గంగ వెళ్లి గంగాధర్ పాయింట్ జేబులో నుంచి డబ్బులు తెచ్చి ఇదిగో నండి డబ్బులు అని ఇస్తుంది.చూసావా గంగ నా దురదృష్టం డబ్బులు ఉండి కూడా తిట్లు పడ్డాను డబ్బులు వేరే వాళ్ళని అడిగి గ్యాస్ తెచ్చాను అని గంగాధర్ అంటాడు.సారీ అండి అని గంగ అంటుంది.నువ్వెందుకు గంగ సారీ చెప్తావు నేనే సారీ చెప్పాలి అని గంగాధర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.గంగ గంగాధర్ కి అన్నం తినిపిస్తుంది. కట్ చేస్తే.

Mamagaru Today Episode April 18  2024 Episode 189 highlights
Mamagaru Today Episode April 18  2024 Episode 189 highlights

సుధాకర్ వసంత శ్రీ లక్ష్మీ వల్ల ఇంటికి వస్తారు. అన్నయ్య వదిన రండి అంటూ పాండురంగ ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. ఏంటి అన్నయ్య విశేషాలు అందరూ బాగున్నారా అని పాండురంగ అంటాడు. మేమంతా బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు రా అంతా సవ్యంగా నడుస్తుందా అని సుధాకర్ అంటాడు. ఏదో బాగున్నాము అన్నయ్య అదే జీతం అయ్యే డబ్బులు అక్కడ అయితే ఇంటి నిండా మనుషులు ఉండేవాళ్ళం ఇక్కడ నలుగురు మేము అంతే తేడా అని పాండురంగ అంటాడు. శ్రీ లక్ష్మీ వాళ్ళకు జ్యూస్ తెచ్చి ఆయన అలాగే అంటారు బావగారు మేమైతే చాలా ఆనందంగా ఉన్నాం అని శ్రీలక్ష్మి అంటుంది. పాండు సిరికి మంచి సంబంధం కుదిరింది రేపు పెళ్లి చూపులు మాట్లాడుకోవాలి అని సుధాకర్ అంటాడు.

Mamagaru Today Episode April 18  2024 Episode 189 highlights
Mamagaru Today Episode April 18  2024 Episode 189 highlights

చాలా మంచి విషయం చెప్పావు అన్నయ్య రేపు ఆఫీస్ కి లీవ్ పెట్టేస్తాను అని పాండురంగ అంటాడు. ఇంతలో చంగయ్య ఫోన్ చేస్తాడు.  సుధాకర్ నీ చుట్టుపక్కల అందరూ ఉండే ఉంటారు కదా నేను చెప్పేది మాత్రమే విను ఏమీ మాట్లాడకు నువ్వు పాండు శ్రీలక్ష్మిని మాత్రమే పిలిచి ఇంటికి వచ్చేసేయ్ పై పోర్షన్ లో గంగాధర్ ఉన్నాడు వాడిని మాత్రం పిలవకు బయటికి వచ్చాక ఫోన్ చేసి రమ్మని చెప్పు అని చంగయ్య అంటాడు.  పాండు నాకు బయట పని ఉంది వెళ్ళొస్తాను అని సుధాకర్ అంటాడు.అన్నయ్య పై పోర్షన్లో మన గంగాధర్ ఉంటున్నాడు వాడికి కూడా ఒక మాట చెప్పు అన్నయ్య అని పాండురంగ అంటాడు. అవునా ఇప్పుడు పిలవడం కుదరదు రా పని ఉంది మళ్లీ ఎప్పుడైనా వచ్చి పిలుస్తాను అని సుధాకర్ అంటాడు.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N