NewsOrbit
రాజ‌కీయాలు

పోలవరంలో అవినీతి ఎక్కడ?

ఏలూరు: పోలవరంలో అవినీతి ఎక్కడ జరిగిందో వైసీపీ ప్రభుత్వం కనిపెట్టలేకపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ అన్నారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం పనులను శుక్రవారం ఏపీ బీజేపీ నేతలు సందర్శించనున్నారు. ప్రాజెక్టుకు బయల్దేరి వెళ్లేముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తవుతోందని… ఈ నేపథ్యంలో, పోలవరం పనులు ఎంత వరకు వచ్చాయో చూద్దామని అక్కడకు వెళ్తున్నామని తెలిపారు. పోలవరంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం… ఆ అవినీతిని నిరూపించి రివర్స్ టెండరింగ్ కు వెళ్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

నరేంద్ర మోదీ తొలిసారి ప్రధాని అయిన తర్వాత పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపారని చెప్పారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులను ఇస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును గత టీడీపీ ప్రభుత్వం ఒక పర్యాటక ప్రాతంగానే చూసిందని… సీరియస్ గా పని పూర్తి చేయాలని అనుకోలేదని కన్నా విమర్శించారు. ఈనెల 13న కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని కలిసి ఒక నివేదిక అందజేస్తామని చెప్పారు. పోలవరం పురోగతి, అవినీతి ఆరోపణలపై వివరిస్తామన్నారు. పోలవరంలో అవినీతి జరింగిందని ఆరోపిస్తూ, కావాల్సిన పనులను ముఖ్యమంత్రి జగన్ చేయించుకుంటున్నారని దుయ్యబట్టారు. పోలవరం త్వరగా పూర్తి కావాలనేదే బీజేపీ సంకల్పమని కన్నా స్పష్టం చేశారు.

ఇటీవలే పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు పెంచారని, టెండర్ నామినేషన్ల పద్దతిలో వేల కోట్ల రూపాయల పనులు అప్పగిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. పోలవరంపై విచారణ జరపాలని కేంద్ర జలశక్తి శాఖను సూచించింది. పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్‌ను ఫిర్యాదుగా భావించాలని తెలిపిన సంగతి తెలిసిందే.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

Leave a Comment