NewsOrbit
రివ్యూలు

`విజిల్‌` రివ్యూ & రేటింగ్‌

కోలీవుడ్ స్టార్ హీరోలో ఒక‌డైన విజ‌య్ ఈ మ‌ధ్య త‌న సినిమాల‌ను త‌మిళంతో పాటు తెలుగులో ఏక కాలంలో విడుద‌లయ్యేలా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నాడు. ఆ క్ర‌మంలో ఈ హీరో న‌టించిన త‌మిళ చిత్రం `బిగిల్‌` తెలుగులో `విజిల్‌` పేరుతో అనువాద‌మై విడుద‌లైంది. విజ‌య్‌తో రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన అట్లీ డైరెక్ట్ చేసిన హ్యాట్రిక్ చిత్రం కావ‌డంత సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తెలుగులో దాదాపు ఏడు వంద‌ల థియేట‌ర్స్‌లో ఈ సినిమా విడుద‌ల కావ‌డం విశేషం. మ‌రి ఈ సినిమా ఎంత మేర‌కు విజయాన్ని సాధించిందో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం..

విడుద‌ల‌: ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌
బ్యాన‌ర్‌: ఏజీఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
న‌టీన‌టులు: విజ‌య్‌, న‌య‌న‌తార‌, జాకీష్రాఫ్‌, యోగిబాబు, జాకీష్రాఫ్‌, క‌దిర్, డేనియ‌ల్ బాలాజీ త‌దిత‌రులు
సంగీతం: ఎ.ఆర్.రెహ‌మాన్‌
కెమెరా: జీకే విష్ణు
ఎడిటింగ్‌: రూబెన్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: ముత్తురాజ్
నిర్మాత‌లు: క‌ల్పాతి అగోరాం, క‌ల్పాతి ఎస్‌.గ‌ణేష్‌, క‌ల్పాతి ఎస్‌.సురేశ్‌
ద‌ర్శ‌క‌త్వం: అట్లీ

క‌థ‌:
వైజాగ్‌లోని ఓ బ‌స్తీలోని వారికి పెద్ద దిక్కు రాజ‌ప్ప‌(విజ‌య్‌). త‌న బ‌స్తీ ప్ర‌జ‌ల‌ను కాపాడ‌టానికి ఆయ‌న రౌడీగా మారుతాడు. ఆయ‌న్ని చంపాల‌ని చాలా మంది ప్ర‌త్యర్థులు వేచి చూస్తుంటారు. అయితే రాజ‌ప్ప కొడుకు మైకేల్(విజయ్) స్టేట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రాణిస్తుంటాడు. తనలా కాకుండా ఫుట్‌బాల్‌లో నేషనల్ ప్లేయర్ కావాలని రాజప్ప కోరుకుంటాడు. మైకేల్ నేషనల్ టీమ్‌కి సెలక్ట్ అయ్యి పోటీలకు వెళ్లే సమయంలో రాజప్పను ప్రత్యర్థులు చంపేస్తారు. దాంతో రాజప్ప స్థానంలో మైకేల్ ప్రజలకు అండగా నిలబడతాడు. అయితే ఐదేళ్ల తర్వాత మైకేల్ స్నేహితుడు(కదిర్) నేషనల్ ఉమెన్స్ టీమ్ కోచ్ అవుతాడు. ఓ సందర్భంలో మైకేల్‌పై చేసిన ఎటాక్‌లో అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడతాడు. దాంతో మైకేల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఉమెన్స్ ఫుట్‌బాల్ టీమ్‌ కోసం మైకేల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఈ ప్రయాణంలో మైకేల్ ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేష‌ణ‌:
సోసైటీ ఎంత ఎదుగుతున్నా, మ‌హిళ‌ల‌కు సాధికార‌త ఉండ‌దు. వారిపై జ‌రిగే అఘాయిత్యాలు జ‌రుగుతుంటాయి. ఇలాంటి ప్ర‌ధానాంశాలుగా తెర‌కెక్కిన చిత్రంలో ఓ సూప‌ర్‌స్టార్ న‌టిస్తే ఎలా ఉంటుంది? సినిమా నెక్ట్స్ రేంజ్‌కు చేరుకుంటుంది. `విజిల్‌`లో విజ‌య్ వంటి స్టార్ హీరో చేయ‌డం కూడా అంతే లాభించింది. సినిమా రేంజ్ మ‌రో లెవ‌ల్‌కు చేరుకుంది. విజ‌య్ డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించాడు. రాజ‌ప్ప అనే రౌడీ పాత్ర‌ధారిగా.. మైకేల్ అనే ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌గా రెండు పాత్ర‌ల్లో చ‌క్క‌గా వేరియేష‌న్‌ను చూపిస్తూ న‌టించాడు విజ‌య్‌. విజ‌య్ పాత్ర‌లో హీరోయిజాన్ని డైరెక్ట‌ర్ అట్లీ చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. ఫ‌స్టాఫ్ అంతా రాజ‌ప్ప అనే పాత్ర మీద న‌డిస్తే.. సెకండాఫ్ అంతామైకేల్ పాత్ర మీద‌నే న‌డుస్తుంది. ఇక న‌య‌న‌తార‌, యోగిబాబు, అనంత్ రాజ్‌, క‌దిర్‌, విల‌న్‌గా న‌టించిన జాకీష్రాఫ్ ఇలా అంద‌రూ పాత్రల ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు.
డైరెక్ట‌ర్ అట్లీ.. విజ‌య్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌కెక్కించిన తెరి, మెర్స‌ల్ చిత్రాలు బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యాయి. హ్యాట్రిక్ మూవీగా తెర‌కెక్కిన విజిల్ చిత్రాన్ని ఎమోష‌న్స్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ల‌ను మేళ‌వించి తెర‌కెక్కించారు. స‌న్నివేశాల‌కు మంచి డైలాగ్స్ కుదిరాయి. ఇక ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ చ‌క్క‌టి నేప‌థ్య సంగీతాన్ని అందించారు. విష్ణు కెమెరా ప‌నిత‌నం సింప్లీ సూప‌ర్బ్‌. ఎందుకంటే ఫుట్‌బాల్ మ్యాచ్‌ల‌ను విష్ణు అద్భుతంగా తెర‌కెక్కించాడు. నిర్మాణ విలువ‌లు అద్భుతంగా ఉన్నాయి. అయితే సినిమా క‌థ‌లో ప్రేక్ష‌కుల‌కు అహా ఓహో అనుకునేంత ట్విస్టులు లేవు. అయితే సెకండాఫ్‌లో ఉమెన్ ఫుట్‌మ్యాచ్‌లు అద్భుతంగా అనిపిస్తాయి. వెండితెర‌పై చూస్తుంటే మంచిఫీలింగ్ క‌లుగుతాయి

చివ‌ర‌గా.. ఓకే అనిపించే క‌మ‌ర్షియ‌ల్ ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ స్పోర్ట్స్ డ్రామా
రేటింగ్‌: 2.75/5

Related posts

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Leave a Comment