(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దుబాయిలో దీపావళి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా దుబాయి పోలీసు బ్యాండ్ ఇండియా జాతీయగీతం జనగణమన వాద్యాలాపన చేసింది.
Dubai Police band plays India’s national anthem during the mega Diwali celebrations at Dubai Festival City #Diwali #DiwaliUAE pic.twitter.com/lJAaTbdoMA
— Gulf News (@gulf_news) October 24, 2019
దుబాయి టూరిజం డిపార్ట్మెంట్, అక్కడి ఇండియా రాయబార కార్యాలయం కలిసి దుబాయిలో దీపావళి వేడుకలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణాసంచా కాల్పులతో నగరంలో సందడి చేశారు. దానికి ముందు పోలీసు బ్యాండ్ జనగణమన వాయించింది. ఆ సమయంలో అక్కడ చేరిన భారతీయులు జాతీయగీతం ఆలాపనలో తామూ గొంతు కలిపారు. పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు.
#Dubai dazzled thousands who gathered to witness the Diwali celebrations with special fireworks and the lovable Hathi’s laser show displayed on dancing fountains. The diplomatic community also joined the celebrations organized by Dubai tourism and the Indian Consulate @cgidubai. pic.twitter.com/Qu19xqDe7U
— DD India (@DDIndialive) October 25, 2019