NewsOrbit
రాజ‌కీయాలు

‘ఏపీలో శాసనసభే సుప్రీమ్’

అమరావతి: ఏపీ శాసనమండలి చైర్మన్ టీడీపీ కార్యకర్తలా పని చేశారని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడం వల్ల ఏ ప్రయోజనం ఉండదన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో శాసనసభే సుప్రీమ్ అని చెప్పారు. శాసనమండలి చైర్మన్ షరీఫ్ ను చంద్రబాబు ప్రభావితం చేసి తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారని ఆరోపించారు. మండలి గ్యాలరీలో కూర్చుని ఓ కార్యకర్త కంటే హీనంగా చంద్రబాబు వ్యవహరించారని దుయ్యబట్టారు.

మండలి రద్దును ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో ఇటీవల చర్చ జరిగిందని, కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని వర్గాల సలహాలు తీసుకుంటే మంచిదని భావించి సమయం ఇచ్చామని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్సీలను కొనుగోలు చేసి తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నామన్న ఆరోపణలను సజ్జల ఖండించారు. టీడీపీ ఎమ్మెల్సీలను కొనుగోలు చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేయాల్సిన అవసరం సీఎం జగన్‌కు లేదని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు కొడుకును ఓడించి.. తమను గెలిపించిన ప్రాంతాన్ని ఎలా వదిలేస్తామని ప్రశ్నించారు. అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

సీఎం జగన్‌ నవతరం నాయకుడైతే.. చంద్రబాబు నాయుడు అంతరించిపోతున్న నాయకుడని సజ్జల వ్యాఖ్యానించారు.  151 మంది ఎమ్మెల్యేలతో సీఎం జగన్‌ ప్రజా సంక్షేమ పథకాలు చేపడుతున్నారని తెలిపారు. అయితే మండలిలో ఉన్న మెజార్టీతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడుతోందని ఆరోపించారు. ప్రజల సంపూర్ణ మద్దతు, తీర్పు తమవైపే ఉందని సజ్జల చెప్పారు.

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

Leave a Comment