మెగా హీరోలంతా కమర్షియల్ సక్సస్ కోసం మాస్ జపం చేస్తుంటే నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ మాత్రం తనకంటూ ఒక స్పెషల్ మార్కెట్ ని చేసుకుంటున్నాడు. కొత్త రకం సినిమా చూడాలనుకునే సినీ అభిమానుల అభిరుచికి తగ్గట్లు చిత్రాలు చేస్తున్న వరుణ్, ప్రతి కథలో వైవిధ్యం చూపిస్తున్నాడు.
కంచె, తొలిప్రేమ, ఎఫ్ 2… ఇలా చేసిన ప్రతి సినిమాలో వేరియేషన్ చూపిస్తున్న వరుణ్ తేజ్, పాత్రకి తగ్గట్లు తనని తాను మార్చుకోవడంలో సక్సస్ అవుతున్నాడు. హీరో అనే వాడు ఏ రోల్ అయినా ప్లే చేయగలడు కానీ కామెడీ చేయడం అందరి వల్లా కాదు, కానీ రీసెంట్ గా వచ్చిన ఎఫ్ 2 సినిమాలో వరుణ్ తేజ్… తన కామెడీ టైమింగ్ తో మెగా ఫ్యాన్స్ ని మెప్పించాడు. వెంకటేష్ అంత కాకున్నా తన పాత్ర పరిధి మేరకు ది బెస్ట్ ఇచ్చిన వరుణ్ తేజ్, థియేటర్ లో నవ్వులు పూయించాడు.
మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో ఈ సంక్రాంతికి హిట్ అందుకున్న వరుణ్ తేజ్, చేయబోతున్న నెక్స్ట్ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం జిమ్ లో కష్టపడుతున్న వరుణ్ తేజ్, తన హైట్ కి తగ్గ ఫీజిక్ కోసం కసరత్తులు చేస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాని కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌కి కోచ్‌గా సీనియర్ నటుడు అర్జున్ గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారని నటిస్తారని సమాచారం.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!