NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ స్పీకర్‌‌గా శ్రీనివాసరెడ్డి


హైదరాబాద్, జనవరి 18: తెలంగాణ శాసన సభాపతిగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు. అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా పోచారంను ఎన్నుకోవడంతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ శుక్రవారం  ఆయనను స్పీకర్‌గా ప్రకటించారు.
ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క, మజ్లిస్ సభ్యుడు అహ్మద్ బలాల, తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు రేఖానాయక్, అబ్రహం, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పోచారం అభ్యర్ధిత్వాన్ని గురువారం ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి వినతి మేరకు కాంగ్రెస్, బిజెపి, ఎంఐఎంలు ఆయనకు మద్దతు ప్రకటించాయి. దీంతో పోచారం ఎన్నిక ఏకగ్రీవమైంది.
తెలంగాణ ఉద్యమంలోకి రావాలనే కెసిఆర్ పిలుపుతో 2011లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన పోచారం టిఆర్‌ఎస్
లో చేరారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం తెరాస పోలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులయ్యారు. 2014లో టిఆర్‌ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణా తొలి వ్యవసాయశాఖా మంత్రిగా ఆయన పనిచేశారు. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 18వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

1949 ఫిబ్రవరి 10న నిజామాబాద్ జిల్లా, బాన్సువాడ మండలం, పోచారం గ్రామంలో ఆయన జన్మించారు. పరిగె రాజిరెడ్డి, పాపవ్వ తల్లిదండ్రులు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఇప్పటివరకు ఆయన ఆరు సార్లు బాన్సువాడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
పోచారం ఇంజనీరింగ్ విద్యకు మధ్యలోనే స్వస్థి చెప్పి 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1976లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1977 దేశాయిపేట సింగిల్ విండో ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1987లో డిసిసిబి చైర్మన్‌గా పనిచేశారు. 1989లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుండి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 1992లో టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. 1994లో బాన్సువాడ ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించారు. 1998లో గ‌ృహ నిర్మాణ శాఖామంత్రిగా, 1999 మళ్లీ అదే నియోజకవర్గం నుండి గెలిచి భూగర్భ గనుల శాఖామంత్రిగా, 2001-2002లో గ్రామీణాభివృద్ది, పంచాయితీరాజ్ మంత్రిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్ధి గోవర్ధన్ చేతిలో ఓటమి చెందారు. 2005నుంచి 2007వరకు టిడిపి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో బాన్సువాడనుంచి టిడిపి తరపున శాసన సభ్యుడిగా గెలిచారు.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Leave a Comment