NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘బిజెపికి మృత్యుఘంటిక’!

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి సవాలుగా మహా కూటమి నిర్మించేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా శనివారం కొల్‌కతాలో భారీ ర్యాలీ జరగనున్నది. పశ్చిమ బెంగాల్  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో జరగనున్న ఈ బహిరంగసభలో కనీసం ముగ్గురు ముఖ్యమంత్రులు, పలువురు ప్రతిపక్ష నాయకులు పాల్గొననున్నారు.

బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్‌లో సభ ఏర్పాట్లు చూసేందుకు వెళ్లిన మమత మీడియాతో మాట్లాడుతూ, ఈ ర్యాలీ బిజెపికి మృత్యు ఘంటిక అవుతుందని అన్నారు. ప్రధాని పదవికి పోటీ పడగలిగే నేతగా మమతను ఈ ర్యాలీ నిలబెడుతుందని భావిస్తున్నారు. సభ అనంతరం ప్రతిపక్ష నాయకులు కలిసి కూర్చుని బిజెపికి వ్యతిరేకంగా నిర్మించే ఐక్య సంఘటన రోడ్ మ్యాప్ గురించి చర్చిస్తారు.

కొల్‌కతా ర్యాలీకి కాంగ్రెస్ అగ్రనాయకత్వం హజరవుతుందా లేదా అన్న మీమాంస కూడా తేలిపోయింది. సోనియా, రాహుల్‌ గాంధీలు దీనికి హాజరు కారనీ, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గె, అభిషేక్ మను సింఘ్వీ హాజరవుతారనీ ఆ పార్టీ ప్రకటించింది.

దీనిని మమత ఐక్య భారత ర్యాలీగా అభివర్ణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఎన్సీపి నేత శరద్ పవార్, హెచ్‌డి దేవెగౌడ, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్, డిఎంకె అధినేత స్టాలిన్ తదితరులు ర్యాలీలో పాల్గొననున్నారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటున్న తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఈ ర్యాలీకి హజరయ్యే అవకాశం లేదు. చంద్రబాబుతో ఆయనకు పొసగటం లేదు. నిజానికి మమత కూడా మొదట్లో ఫెడరల్ ఫ్రంట్ అన్న వ్యక్తే. కెసిఆర్ మమతను ఒకసారి కలిశారు కూడా.

విచిత్రంగా బిజెపి ఎంపి శతృఘ్న సిన్హా కూడా ర్యాలీకి హజరవుతున్నారు. మాజీ ఆర్ధికమంత్రి యశ్వంత్ సిన్హాతో కలిసి ఆయన కొంత కాలంగా అసమ్మతి గళం వినిపిస్తున్నారు. యశ్వంత్ పార్టీ ప్రతినిధిగానే తాను కొల్‌కతా ర్యాలీకి హాజరవుతున్నట్లు ఆయన చెప్పారు. బిజెపి నాయకులు ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాలకు హాజరు కావడం లా అని ఆయన ప్రశ్నించారు.

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

Leave a Comment