NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్ నుండి జగన్ నేర్చుకోవాల్సినవి ఎన్నెన్నో!

అధికారం దక్కడం ఒక అదృష్టం.కానీ దాన్ని నిలబెట్టుకోవటం అనేది పాలకుల స్వహస్తాల లోనే ఉంటుంది.ఈ విషయం ఆరేళ్ల క్రితం తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్కు బాగా తెలుసు .అందుకే తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి ఆయన నిర్విరామంగా కృషి చేస్తున్నారు.ముఖ్యంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆయన ముందుకు సాగుతున్నారు.తెలంగాణా రాష్ట్రంలో రైతులకు వ్యవసాయానికి ఆయన అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా రైతు బంధు పథకం అమలు చేస్తున్నారు.

రైతులకు 5లక్షల భీమా,రైతు బంధు వంటి వినూత్న కార్యక్రమాలతో రైతులకు అండగా నిలుస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ యాసంగిలో 52 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది తెలంగాణా రాష్ట్రం.మొత్తంగా ఈ ఏడాదిలో కోటి మెట్రిక్ టన్నులకు పైగా వరి పండించే స్థాయికి ఎదిగింది. పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి,హరితహారం వంటి కార్యక్రమాలతో పల్లెలు,పట్టణాల స్వరూపం మార్చే ప్రణాళికలు రూపొందించారు.కొత్త పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలతో పంచాయతీ లు,మున్సిపాలిటీ ల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. యాదాద్రి దేవాలయంను కనీవినీ ఎరుగని రీతిలో పునర్నిర్మిస్తున్నారు సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. పొరుగు రాష్ట్రాల తో నీటి వివాదాలకు స్వస్తి పలికి ఒప్పందాలు చేసుకుని ప్రాజెక్టులను రీ డిజైన్ చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేసి కాళేశ్వరం గా మార్చారు. అనుమతులు సాధించి శరవేగంగా మూడేళ్ళ ల్లోనే పూర్తి చేశారు. గోదావరి పై తల పెట్టిన సీతారామ, దేవాదుల ఫేస్ 3,ప్రాజెక్టుల పనులు పరుగులు పెట్టిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పెండింగులో ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు,కోయిల్ సాగర్ పనులు పూర్తి చేశారు. పాలమూరు,డిండి ప్రాజెక్టుల పనులు వేగంగా కొనసాగిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యం చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ వంటి భారీ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.మిషన్ కాకతీయలో భాగంగా రాష్ట్రంలో ని చెరువుల పూడిక తీత,సుందరీకరణ పనులు చేపట్టారు. రూ. 35 వేల కోట్లతో ఇంటింటికి నీరందించే మిషన్ భగీరథ పథకం దాదాపు పూర్తయింది.కంటి వెలుగు కార్యక్రమంతో కోటిన్నర మందికి ఉచిత పరీక్షలు నిర్వహించి,35 లక్షల మందికి కళ్ళద్దాలు పంపిణీ చేశారు. కొత్త రాష్ట్రంలో పాలనను ప్రజలకు చేరువగా తీసుకెళ్లేలా సంస్కరణలు చేపట్టారు. అందులో భాగ౦గా కొత్త జిల్లాలు,మండలాలు,గ్రామపంచాయతీ లు ఏర్పాటు చేశారు.రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించి అధికారాన్ని వికేంద్రీకరించారు ఒకటేమిటి ఈ ఆరేళ్లలో కెసిఆర్ చేసిన పనులు, అమలు చేసిన పథకాలు అన్నీ కూడా రాష్ట్రాభివృద్ధికి ప్రజా సంక్షేమానికి ఉపకరించేవే.అందువల్లే ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.కెసిఆర్ ను విపరీతంగా అభిమానించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన గురువు నుండి ఇలాంటి విషయాల్లో శిక్షణ పొందితే ఆయనకు రాష్ట్రంలో తిరుగుండదు.ఏడాది పాలన పూర్తి చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల విషయంలో అగ్రగామిగా నిలుస్తున్నప్పటికీ ఇంకా చాలా అంశాలలో వెనుకబడినట్లే కనిపిస్తోంది.ఓటు బ్యాంకు రాజకీయాలను నమ్ముకున్న జగన్మోహన్రెడ్డి అందుకు భిన్నంగా శాశ్వత ప్రాతిపదికన ప్రజలకు రైతులకు మేలు చేస్తే ఆయనకు ఆంధ్రప్రదేశ్లో ఎదురుండదని చెప్పవచ్చు .

Related posts

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?