“డయాబెటిస్“ ను చక్కెర వ్యాధి అని కూడా పిలుస్తారు. ఈ రోజుల్లో చిన్న వయస్సు ఉన్నవారిని సైతం ఈ వ్యాధి వేధిస్తోంది . శరీరం లో ఉండే చక్కెర హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది . అయితే , మధుమేహాన్ని వ్యాధిగా భావించవద్దు. ఇది కేవలం ఆరోగ్యం సమస్య మాత్రమే. సరైన డైట్ పాటిస్తే.. మధుమేహం పూర్తిగా మాయమవుతుంది.
చక్కెర వల్ల మధుమేహం వస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ అది అపోహ మాత్రమే. చక్కెర వ్యాధికి, చక్కెరకు ప్రత్యక్ష సంబంధం ఏదీ లేదు. చక్కెర ఎక్కువగా తీసకుంటే శరీరం బరువు పెరుగుతుంది. అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. స్థూలకాయం వల్ల కూడా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది’’ అని కేర్ డయాబెటిస్‌కు చెందిన డాన్ హోవర్త్ అన్నారు.
మధుమేహానికి దారితీసే మరికొన్ని కారణాలు తెలుసుకుందాం.
సరైన వేళ ల్లో భోజనం, నిద్ర లేకపోవడం మధుమేహానికి దారి తీస్తుంది. వైరస్ ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా మధుమేహం రావచ్చు.కొవ్వు పదార్థా లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, శరీరక శ్రమ తగ్గడం వల్ల చాలామంది చిన్నవయస్సులోనే మధుమేహానికి గురవుతున్నారు. వంశ పారంపర్యంగా తల్లిదండ్రులు, వారి ముందు తరాల నుంచి కూడా టైప్-2 మధుమేహం వస్తోంది. మధుమేహం మొత్తం మూడు రాకలు. టైప్-1, టైప్-2 ముఖ్యమైనది. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహాన్ని ‘గెస్టేషనల్’ అంటారు. బాల్యం నుంచే సంక్రమించే మధుమేహాన్ని టైప్-1 డయబెటీస్ అంటారు. టైప్-1 డయాబిటీస్ సోకితే జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాలి .ఈ లక్షణాలు కనిపిస్తే, వైద్యులను సంప్రదించాలి.
తరచు మూత్రం రావడం, దాహం ఎక్కువగా వేయటం, గొంతు ఎండిపోతున్నట్లు ఉండటం, అకారణంగా బరువు తగ్గడం, బాగా నీరసం, చూపు మందగిస్తుంది. పంటి చిగుళ్ల లో ఇన్ఫెక్షన్లు వస్తాయి. శరీరం పై గాయాలు త్వరగా మానవు. అతిగా ఆకలి వేస్తుంది. కాళ్ల లో స్పర్శ తగ్గుతుంది. కొంత మందికి కాళ్లు తిమ్మిర్లు ఎక్కుతాయి. రక్తం లో చక్కెర ల స్థాయి నిర్ధారిత మోతాదు కు మించి పెరిగి తే మధుమేహం ఉన్నట్లే. కొందరి లో తరచు ఆయాసం, వాంతులు, విరేచనాలు, చర్మం, మర్మావయాల వద్ద ఇన్ఫెక్షన్ లు కనిపించవచ్చు. వృషణాల దురద. అంగం లో మంటగా ఉండటం, శృంగార కోరికలు సన్నగిల్లడం,చర్మం ముడత పడటం. టైప్-2 డయాబిటీస్ తొలిదశ లో గుర్తించడం కష్టం. రక్త నాళాలు, మూత్రపిండాలు, గుండె సమస్య లు వచ్చిన తర్వాతే ఎక్కువ మంది గుర్తిస్తారు.