రెగ్యులర్ హాట్ టబ్ స్నానం చేయటం వలన గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వచ్చి మరణించే ప్రమాదం తక్కువగా ఉందని పరిశోధకులు కనుకొన్నారు. రోజువారీ వేడినీటి స్నానం ,హృదయ ఆరోగ్యానికి మంచిది, వారానికి ఒకటి లేదా రెండుసార్లు కంటే ఎక్కువ వేడినీళ్లు స్నానం చేయడం గుండె ఆరోగ్యానికి రక్షణఇస్తుంది .
వారానికి ఒకటి లేదా రెండుసార్లు వేడినీటి స్నానం చేసిన వారితో పోల్చితే, లేదా చేయని వారితో పోల్చినప్పుడు, రోజువారీ వేడి నీటి స్నానం చేసే వారి హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదం 28 శాతం తక్కువ ఉందని అని తేలింది . మీరు వేడినీటిలో స్నానం చేసినప్పుడు లేదా బాత్ టబ్‌లో వేడినీటిలో కాసేపు మునిగినట్లు ఉండడం ద్వారా, నాడీవ్యవస్థ విశ్రాంతికి లోనవడం, నొప్పులు మరియు వాపు తగ్గడం తో పాటు ఒత్తిడి ,ఆందోళనను కూడా పోగొడుతుంది .
వేడినీరు శరీరానికి ఉపశమనం కలిగించటం మాత్రమే కాకుండా, శరీర కండరాలకు కూడా విశ్రాంతిని ఇస్తుంది. తద్వారా శరీరానికి భౌతికంగా మరియు మానసికంగా విశ్రాంతి దొరికినట్టు ఉంటుంది. మానసిక ప్రశాంతత కలిగి, మంచి నిద్ర కు కారణమవుతుంది. క్రమంగా గుండెకు ఎంతో మేలు చేకూరుతుంది. వేడినీటి స్నానం రక్తంలోని గ్లూకోజ్ మరియు చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా బరువు కోల్పోవడానికి సహాయపడుతుంది.
వేడినీటిలో స్నానం చేయడం వలన శరీర రక్తనాళాలకు వ్యాయామం చేసినట్టు ఉంటుంది. గుండెకు సరైన రక్త ప్రసరణ అందివ్వడంలో సహాయం చేస్తుంది. తద్వారా ఆరోగ్యకర హృదయ స్పందనలు నమోదవుతాయి. గుండె, శరీరమంతటికీ రక్తాన్ని సరఫరా చేస్తుంది. మరియు రక్తంలోని ప్రాణవాయువు అన్ని భాగాలకు చేరడం అత్యవసరం. వేడినీటితో స్నానం మూలంగా గుండెకు రక్త ప్రసరణ బాగా జరగడం మూలంగా దాని చర్యలకు ఎటువంటి ఆటంకం కలగకుండా సహాయపడుతుంది.