NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: చంద్రబాబు ఊహించిందే జరిగింది.. చంద్రబాబును అరెస్టు చేసిన ఏపీ సీఐడీ

Advertisements
Share

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఊహించిందే జరిగింది. రెండు రోజుల క్రితం తనను అరెస్టు చేస్తారు లేదా తనపై దాడి చేసే అవకాశం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన ఊహించినట్లే ఏపీ సీఐడీ అధికారులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. చంద్రబాబు ప్రస్తుతం నంద్యాల పర్యటనలో ఉన్నారు. చంద్రబాబు బస చేసిన నంద్యాల ఆర్ కే ఫంక్షన్ హాలు వద్ద శుక్రవారం ఏపీ సీఐడీ అధికారులు భారీ పోలీసు బలగాలతో చేరుకున్నారు.

Advertisements

ముందుగా చంద్రబాబు భద్రతా అధికారులతో మాట్లాడిన పోలీసు అధికారులు తర్వాత చంద్రబాబుతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ డవలప్ మెండ్ కేసుకు సంబందించి చంద్రబాబును అరెస్టు చేసినట్లుగా సీఐడీ పోలీసులు తెలిపారు. చంద్రబాబును విజయవాడ తరలించేందుకు సీఐడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అరెస్టుకు సంబంధించి పత్రాలపై చంద్రబాబు సంతకం చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం .. ఆయన కాన్వాయ్ లోనే ఎస్పీజీ భద్రతతో విజయవాడ తరలించనున్నారు.

Advertisements

చంద్రబాబు అరెస్టు పై ఆయన తరపు న్యాయవాదులు స్పందించారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించగా హైబీపీ, షుగర్ ఉందని చెప్పారు. హైకోర్టు లో బెయిల్ కు ప్రయత్నిస్తున్నామన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని అన్నారు. కేసుతో సంబంధం లేని సెక్షన్ లు నమోదు చేశారనీ, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 37 వ నిందితుడుగా చంద్రబాబును పేర్కొన్నారని తెలిపారు.  మరో పక్క చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేశారు.


Share
Advertisements

Related posts

Money Earning : మీ మొబైల్ లో ఇంటర్నెట్ ఉందా.. అయితే డబ్బు సంపాదించండిలా..!!

bharani jella

జబర్దస్త్, బిగ్ బాస్ షోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్..??

sekhar

వైసీపీ వాయిస్ సడన్ గా పడిపోయింది ! ఎందుకంటే?

Yandamuri