స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు రెండో రోజు సీఐడీ విచారణ సాగుతోంది. తొలి రోజు మాదిరిగానే చంద్రబాబును ప్రశ్నించేందుకు సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకుని విచారణ ప్రక్రియను ప్రారంభించారు. తొలుత కోర్టు ఆదేశాల ప్రకారం విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం సెంట్రల్ జైల్ కాన్ఫరెన్స్ హాలు నందు చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో అధికారుల బృందం .. చంద్రబాబు న్యాయవాదుల సమక్షంలో విచారణ కొనసాగిస్తున్నారు. నిన్న విచారణ ఆలస్యం కాగా ఇవేళ సమయానికే విచారణను మొదలు పెట్టినట్లుగా తెలుస్తొంది. తొలి రోజు ఆరు గంటల పాటు విచారణ జరపగా ఈవేళ దాదాపు 8 గంటలకుపైగా చంద్రబాబును అధికారులు విచారించనున్నారు. కాగా, చంద్రబాబు సీఐడీ కస్టడీ నేటితో ముగియనున్నంది సాయంత్రం విచారణ అనంతరం సీఐడీ అధికారులు చంద్రబాబును వర్చువల్ పద్దతిలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. తదుపరి విచారణ నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు అందజేయనున్నారు.
ఇదిలా ఉండగా, చంద్రబాబు రెండో రోజు విచారణ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్నాయి. జైల్ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. చంద్రబాబుకు సంఘీభావంగా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుండి రాజమండ్రికి చేరుకుంటున్న నేపథ్యంలో పోలీస్ లు అప్రమత్తమైయ్యారు. లోకేశ్ క్యాంప్ సైట్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
Chandrababu Arrest: చంద్రబాబు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఒక్కరొక్కరు విదేశాలకు జంప్..?
ఏపీ రాజధానిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక కామెంట్స్.. బుగ్గన వ్యాఖ్యలు వక్రీకరించారంటూ..