NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ స్వీప్ చేయడం ఖాయమని పేర్కొన్న సీఎం వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి గత కొద్ది రోజులుగా నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో భేటీ లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఇవేళ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజా ప్రభుత్వంగా పేరు దక్కించుకున్నామని పేర్కొన్న సీఎం వైఎస్ జగన్.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ స్పీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు మరో 18 నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే సన్నద్దం కాావాలనీ, క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి ప్రజలకు వివరించడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు.

AP CM YS Jagan

 

ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల్లో ఒక్క టెక్కలి నియోజకవర్గంలోనే అక్షరాాలా రూ.1026 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా లబ్దిదారులకు అందించామని అన్నారు. గతానికి భిన్నంగా అర్హులందరికీ మేలు చేశామని వివరించారు. నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుంటే 87 శాతం ఇళ్లకు మంచి చేశామనీ, ఆ మంచి జరిగిన ఇళ్లలోని వారు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు ఎందుకు మనం 175కు 175 సాధించలేమని మనం గుండెల మీద చేయి వేసుకుని ప్రశ్నించుకోవాలన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధ సంక్షేమ కార్యక్రమాలను వివరించిన సీఎం జగన్… నేతలను ఉద్దేశించి ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా అవి పక్కన పెట్టి ముందుకు సాగాలన్నారు. రేపు ఎన్నికల్లో మనం గెలిస్తే వచ్చే 30 ఏళ్లూ మనమే అధికారంలో ఉంటామనీ, ఇవాళ మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా వచ్చే కాలంలో మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు.

AP CM YS Jagan meeting With Tekkali constituency leaders
AP CM YS Jagan meeting With Tekkali constituency leaders

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju