ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఎమ్మెల్యే, ఇన్ చార్జి.. కొత్తగా పరిశీలకుడు ! టికెట్ ఈజీ కాదు.. జగన్ మాస్టర్ స్కెచ్ !

Share

పోటీ పెరిగిన చూట పనితీరు మెరుగు పడుతుందట. ఇది ప్రాధమిక సూత్రం. కార్పోరేట్ సెక్టార్ లో ఇటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. అలానే స్కూల్స్ లో కూడా ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. వాళ్లలో వాళ్లకు పోటీ పెడితే దాని రిజల్ట్ బాగా వస్తుందనేది వాళ్ల నమ్మకం. అయితే ఇప్పుడు ఇదే విధానాన్ని రాజకీయాల్లో కూడా పార్టీలో కూడా సీఎం జగన్ చొప్పిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే ..2019 లో ఒక అభ్యర్ధిని ఎంపిక చేయడానికి జగన్మోహనరెడ్డి చాలా కసరత్తు చేశారు. కొన్ని కొన్ని నియోజకవర్గాలకు ఇద్దరు ముగ్గురు బాధ్యులను పెట్టి చివరి నిమిషంలో స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ద్వారా ఆయన ఇచ్చిన సూచనల ద్వారా సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని చాలా జాగ్రత్తగా ఆచిచూసి అడుగులు వేసి టికెట్ సెలక్షన్ విషయంలో కరెక్ట్ నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి మంచి ఫలితం పొందారు.

YSRCP CM YS Jagan

ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేల పట్ల చాలా చూట్ల వ్యతిరేకత పెరిగింది. సాధారణంగా అధికార పార్టీ అన్న తర్వాత వ్యతిరేకత ఉంటుంది. ఎమ్మెల్యేల మీద ఇంకా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. ఆ వ్యతిరేకతను పొగొట్టుకుని ఎలా తనకు అనుకూలంగా మార్చుకోవాలి..? అనే ఐడియాలజీని జగన్మోహనరెడ్డి రకరకాలుగా సోధిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలతో పాటు పరిశీలకులు (అబ్జర్వర్) కూడా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అదనపు (అడిషనల్) ఇన్ చార్జిలు కూడా ఉంటారు. ఒక్కో నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేదా ఇన్ చార్జితో సహా ముగ్గురు నాయకులు ఉంటారు.

వీళ్లలో ఎవరికి టికెట్ ఇస్తారు అనేది ఇప్పుడే చెప్పలేరు. ఎందుకంటే పని తీరు ఆధారంగానే టికెట్ లు ఉంటాయని పదేపదే చెబుతున్నారు సీఎం జగన్మోహనరెడ్డి. నియోజకవర్గంలో సర్వే ద్వారా ముగ్గురిలో ఏ నాయకుడి పేరు వస్తే వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇద్దరు ముగ్గురు మద్య పోటీ సృష్టించి వారిలో ఎవరి పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తే వాళ్లకు టికెట్ ఇస్తారు. నియోజకవర్గంలో ముగ్గురు నాయకులు ఎమ్మెల్యే  లేదా ఇన్ చార్జి, అబ్జర్వర్, అదనపు ఇన్ చార్జిలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి వాళ్లతో మమేకం అవ్వాల్సి ఉంటుంది.

జగన్ చేతికి అందిన పీకే రిపోర్టు..! 5 అంశాలపై సీరియస్: ఎమ్మెల్యేలతో భేటీ..?


Share

Related posts

ఆర్ ఆర్ ఆర్ తెచ్చిన ఒత్తిడి త్రివిక్రం తట్టుకుంటాడా ..?

GRK

అవిసె గింజలు : అవిసె గింజలు తింటే ఏమవుతుందో తెలుసుకోండి..!

Ram

PADMA AWARDS: కన్నుల పండువగా పద్మ అవార్డుల పంక్షన్.. ఎస్పీబీకి కూడా..

Ram