NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత

మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూశారు. వట్టి వసంత కుమార్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవేళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ హయాంలో వట్టి వసంత కుమార్ గ్రామీణాభివృద్ధి, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వట్టి వసంత కుమార్ స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా వూళ్ల గ్రామం. ఆయన ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. వసంత కుమార్ భౌతకకాయాన్ని ఆయన స్వగ్రామం తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Vatti Vasanth Kumar

 

కాగా వట్టి వసంత కుమార్ 2014 ఎన్నికలకు ముందు టీడీపీ, కాంగ్రెస్ కలయికతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2014 నుండి కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కావడంతో ఆ పార్టీ లో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఆయన ఖండించారు. పవన్ కళ్యాణ్ తో రాజకీయాలు ఏమీ చర్చించలేదనీ, మర్యాదపూర్వకంగానే తను కలిసినట్లు నాడు పేర్కొన్నారు.

వసంత కుమార్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అపోలో ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు చేరుకుంటున్నారు. వసంత్ కుమార్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఇవేళ సాయంత్రం తమ స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నట్లు వసంత కుమార్ కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.

YS Viveka Murder Case: మొదటి సారి సీబీఐ విచారణ ఎదుర్కొన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఏమన్నారంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju