ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chandra Babu: బాబుకి ఎన్ని నాలుకలు..!? ఏమిటో డొంక తిరుగుడు..!?

Share

Chandra Babu: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలని సంకల్పించారు. అదే మాదిరిగా దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరును కృష్ణాజిల్లాకు పెట్టారు. ఎన్టీఆర్ అభిమానులకు ఈ వార్త హాపీనే. కానీ టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు ఎవ్వరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలియజేయలేదు. కాకపోతే ఎన్టీఆర్ తనయ, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, ఎన్టీఆర్ కుమారుడు, ఎమ్మెల్య నందమూరి బాలకృష్ణ ఈ విషయంపై హర్షం వ్యక్తం వ్యక్తం చేశారు.

Chandra Babu comments on ntr dist name
Chandra Babu comments on ntr dist name

Read More: TDP: వైసీపీ స్వీప్ జిల్లాలో టీడీపీకి రిజైన్.. బాబుని టెన్షన్ పెట్టిన ఆ ఇద్దరూ..!

Chandra Babu: ఎన్టీఆర్ ను ఎవరు గౌరవించినా స్వాగతిస్తాం

కృష్ణా జిల్లాకు జగన్మోహనరెడ్డి సర్కార్ ఎన్టీఆర్ పేరు పెట్టడంపై చంద్రబాబు స్పందనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా సూటిగా స్పష్టంగా వ్యాఖ్యలు చేయకుండా ఎన్టీఆర్ పేరు పెడితే తాము ఎందుకు వ్యతిరేకిస్తామని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ను ఎవరు గౌరవించినా స్వాగతిస్తామన్నారు. దాంతో పాటు మరో ట్విస్ట్ ఇచ్చారు చంద్రబాబు. ఎన్టీఆర్ ఒక ప్రాంతానికి చెందిన నేత కాదని వ్యాఖ్యానించారు. ఆంటే చంద్రబాబు ఉద్దేశం ఆంధ్ర రాష్ట్రానికే ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న భావన ఉందా సెటైర్ లు పేలుతున్నాయి. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని తాము ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్న చంద్రబాబు..యూపిఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఎప్పుడూ దానిపై మాట్లాడలేదు

ఎన్టీఆర్ విగ్రహాలను ద్వంసం చేస్తూ..

ఒ పక్క ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ లను మూసివేశారు. మరో పక్క ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు ఇప్పుడు ఎన్టీఆర్ పై ప్రేమ ఉన్నట్లుగా చేస్తున్నారని విమర్శించారు చంద్రబాబు. నాడు హైదరాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెడితే వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత తీసేశారనీ ఈ సందర్భంగా పేర్కొంటూ, కడపకు వైఎస్ఆర్ కడప జిల్లాగా రోశయ్య హయాంలో పేరు పెడితే తాము అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు చంద్రబాబు. అయితే నాడు కడపకు వైఎస్ఆర్ పేరు పెట్టిన సమయంలో వైఎస్ జగన్ గానీ, వైఆర్ఆర్ కుటుంబ సభ్యులు గానీ స్పందించి నాటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు వ్యక్తం చేయలేదు. ఎందుకంటే ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి వెళుతుందని వారు స్పందించలేదు. ఇప్పుడు జగన్ కు క్రెడిట్ వస్తుందన్న భావనతో చంద్రబాబు, టీడీపీ ధన్యవాదాలు తెలియజేయడం లేదని అనుకోవచ్చు.

 


Share

Related posts

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రవికి.. కూతురు బిగ్ సర్ప్రైజ్..!!

sekhar

AP High Court: కొండపల్లి మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!

somaraju sharma

హనుమంతుడు దళితుడు కాదు…ముస్లిం!

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar