ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TDP: వైసీపీ స్వీప్ జిల్లాలో టీడీపీకి రిజైన్.. బాబుని టెన్షన్ పెట్టిన ఆ ఇద్దరూ..!

Share

TDP: గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే పార్టీ బలోపేతానికి అడుగులు వేస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో రెండున్నరేళ్ల వరకూ ఎన్నికలు లేకపోయినా ముందస్తు ఎన్నికలు వస్తాయి అన్నట్లుగానే చంద్రబాబు పార్టీ శ్రేణులను సన్నద్దం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాలతో కొన్ని వర్గాలు వైసీపీకి దూరం అవుతున్నాయని ప్రచారం జరుగుతోంది.  ఈ పరిస్థితులను క్యాష్ చేసుకోవాలని టీడీపీ భావిస్తున్న తరుణంలో ఆ పార్టీకి ఉత్తరాంధ్రలో ఊహించని షాక్ తగలింది.

Two TDP leaders join ysrcp
Two TDP leaders joined ysrcp

 

TDP: టీడీపీకి గుడ్ బై ..వైసీపీలో చేరిక

ఉత్తరాంధ్రలో టీడీపీలో కీలకంగా పని చేసిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమవతి, మాజీ ఎంపీ డీవీజీ శంకరరావులు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. వీరు ఇద్దరు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే వీరు ఇద్దరు పార్టీని వీడటం వల్ల పెద్దగా నష్టం లేదని ఆ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే శృంగవరపుకోట ఎమ్మెల్యేగా పని చేసిన శోభా హైమవతి అనేక సంవత్సరాలుగా టీడీపీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఆమెకు టికెట్ ఇవ్వలేదు. కోళ్ల లలిత కుమారికి 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆమె ఓటమి పాలైయ్యారు. ప్రస్తుతం లలిత కుమారి నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్నారు.

 

వైసీపీలోకి మాజీ ఎంపీ శంకరరావు. మాజీ ఎమ్మెల్యే హైమవతి

మరో పక్క శోభా హైమవతి కుమార్తె కుమార్తె స్వాతిరాణి వైసీపీలో కీలకంగా పని చేస్తున్నారు. దీంతో పార్టీలో ఆమెకు ప్రాధాన్యత తగ్గింది. ఈ తరుణంగా శోభా హైమవతి పార్టీని వీడారు. అదే విధంగా 1999 ఎన్నికల్లో పార్వతీపురం ఎంపిగా పని చేసిన శంకరరావు 2004 ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. ఆ తరువాత నుండి టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇక ముందు కూడా ఆయనకు టికెట్ ఇస్తారన్న గ్యారెంటీ లేదు. దీంతో శంకరరావు ఇటీవల వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. నిన్న సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. ప్రస్తుతం టీడీపీలో యాక్టివ్ గా లేని ఈ ఇద్దరు పార్టీని వీడటం వల్ల పెద్దగా నష్టం లేదని టీడీపీ భావిస్తోందట.


Share

Related posts

ఎల్ఐసీ స్కాలర్‌షిప్‌లు..! ఏటా రూ.20 వేలు..!

bharani jella

మిడతల మీద కే‌సి‌ఆర్ స్ట్రాంగ్ మిస్సైల్ .. దేశం మొత్తం నేర్చుకోవాలి!

somaraju sharma

చిరంజీవి ఆచార్య : కొరటాల శివ ప్లానింగ్ ఈ రేంజ్ లో ఉందా ? అబ్బో ఇక ఫాన్స్ కి పూనకాలే ! 

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar