NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Midhili Cyclone: బంగాళాఖాతంలో వాయుగుండం ..నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు

Share

Midhili Cyclone: ఆంధ్రప్రదేశ్ కు మిథిలీ తుఫాను గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది గంటకు 13 కిలో మీటర్ల వేగంతో వాయువ్య దిశగా పయనిస్తొందని అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. విశాఖపట్నానికి ఆగ్నేయంగా 470 కిలో మీటర్ల కిలో మీటర్లు, పరదీప్ (ఒడిశా)కు దక్షిణ – ఆగ్నేయంగా 620 కిలో మీటర్ల, దిఘా (పశ్చిమ బెంగాల్) కు దక్షిణంగా 770 కిలో మీటర్ల దూరంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తొలుత వాయువ్య దిశలో, అనంతరం ఉత్తర – వాయువ్య దిశగా పయనిస్తూ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇవేళ (గురువారం) తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అనంతరం దిశ మార్చుకుని ఉత్తర – ఈశాన్య వైపు పయనించి శుక్రవారం నాటికి ఒడిశా, శనివారం నాటికి పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ తుఫానుకు మిథిలీగా నామకరణం చేయనున్నారు. దీని ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా నేడు, రేపు (గురు, శుక్రవారం) తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 18 వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.

IT Raids: తెలంగాణలో మరో సారి ఐటీ సోదాల కలకలం .. అభ్యర్ధుల గుండెల్లో గుబులు


Share

Related posts

Ramappa Temple: బిగ్ బ్రేకింగ్ ..చారిత్రక రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు..! ఫలించిన తెలంగాణ ప్రభుత్వ కృషి..!!

somaraju sharma

Samantha : ఓ మై గాడ్ ఇంతకంటే సూపర్ న్యూస్ ఉంటుందా ? నాగ చైతన్య , సమంత మళ్ళీ కాలుస్తున్నారా ? ఇదే సాక్ష్యం ?

Ram

కొత్త కామెడీ షో లో బూతుల పర్వం..! నాగబాబు పక్కనే నిహారిక, శ్రీ ముఖి

arun kanna