Naga Panchami November 15 2023 Episode 201: చూడమ్మా పంచమి నా మోక్ష ప్రాణాలు నీ చేతుల్లో పెడుతున్నాను ఇకనుంచి ఇంటిని నువ్వే కాపాడాలి నా మోక్షని నువ్వే కాపాడాలి ఎలాగైనా ఆ మోక్షని బ్రతికించు తల్లి అని వైదేహి అంటుంది. పంచమి ఇప్పుడు నాకు భార్య మాత్రమే కాదు ఇంటి యజమానురాలివి కూడా డబ్బులు అవసరమైతే నేను నిన్ను అడుగుతాను వాటికి లెక్కలు మాత్రం అడగకు పంచమి అని మోక్ష అంటాడు .

కట్ చేస్తే, అక్క ఆ పాముల పిల్ల పంచమి కంటే నేనేమన్నా తక్కువ ఉన్నానా అక్క ఇంటి పెత్తనం నన్ను కాదని దానికి ఇచ్చారు నాకు కాకుండా నీకు ఇచ్చిన సంతోషించే దాన్ని అక్క అని చిత్ర అంటుది. ఇంట్లో వాళ్లకి ఎంత ధైర్యం నా ముందే దానికి పెత్తనం అంటగడతారా చదువు సంధ్య లేదు దానికి నేను మ్యాస్ లో చాలా తెలివిగల దాన్ని, అలాంటి నాకు ఇంటి పెత్తనం ఇస్తే లెక్కలు చేసి పెట్టే దాన్ని ఆ పల్లెటూరు చదువురాని మోద్దుకు అంటగట్టారు దాని సంగతి చూస్తాను అని జ్వాలా అంటుంది. అక్క అయితే ప్రపంచంని చంపేద్దామా అని చిత్ర అంటుంది.

దాన్ని చంపేస్తే మనకేం వస్తుంది చిత్ర మోక్షని చంపేశామనుకో అది జైలుకు వెళుతుంది అప్పుడు ఆస్తి మన ఇద్దరికీ వస్తుంది అది జైలుకు వెళుతుంది ఇద్దరి పీడా విరగడవుతుంది అని జ్వాల అంటుంది. కానీ వాళ్ళిద్దరూ సెకండ్ ఇచ్చుకుంటారు. వాళ్లు అలా చేతులు ఇచ్చుకునేసరికి సుబ్బు మాయాజాలంతో వాళ్ల చేతులు అతుక్కుపోతాయి. అక్క చేతులు అతుక్కుపోయాయి అంటే ఇది ఆ సుబ్బు మాయాజాలమే అని చిత్ర అంటుంది. ఇంతలో సిసిరా వచ్చి అమ్మ మీరు ఏ ఆట ఆడుకుంటున్నారు నేను కూడా ఆడతాను అని అంటుంది. వద్దు సిసిరా మమ్మల్ని ముట్టుకోకు ఆ సుబ్బు ఎక్కడ ఉన్నాడు పిలుచుకురా అని జ్వాల అంటుంది. సుబ్బు చిన్నపిల్లాడు ఏం చేస్తాడు ఇంట్లో వాళ్ళందరిని పిలుచుకొస్తాను ఉండు అని సిసిరా వెళ్ళిపోతుంది. ఇంతలో సుబ్బు అక్కడికి వస్తాడు. సుబ్బు ఇంకోసారి ఎవరిని చంపాలని చూడము మమ్మల్ని విడిపించు అని చిత్ర అడుగుతుంది. ఏంటి చంపాలనుకున్నారా అని సుబ్బు అంటాడు. అదేమీ లేదు సుబ్బు ప్లీజ్ ప్లీజ్ మా చేతులు విడిపించవా అని జ్వాల అడుగుతుంది. నేనేమీ చేయలేదు అంటూ సుబ్బు వెళ్ళిపోతాడు.

సుబ్బు వెళ్ళిపోగానే వాళ్ళ చేతులు విడిపోతాయి అక్క అ సుబ్బు సంగతి తర్వాత చూద్దాం ఇంట్లో వాళ్ళు వస్తే బాగోదు వెళ్దాం పద అని వాళ్లిద్దరూ కలిసి వెళ్ళిపోతారు. కట్ చేస్తే, నాగదేవత నువ్వు కోరుకున్నట్టుగానే నేను మనలోకానికి వస్తాను యువరాణిగా ఉంటాను కానీ నేను మోక్షని కాటు వేసి చంపిన తరువాత బ్రతికించు ఎందుకంటే నేను ఎంతైనా మోక్ష భార్యని కదా అది నా ధర్మం తనను కాపాడుకోవడం నీ నాగలోకపు యువరాణి ఎక్కడ ఉన్నాసరే తప్పు చేయకూడదు కదా నాకు ఒక్కసారి ప్రత్యక్షమై కనిపించు నాగదేవత అని ప్రార్థిస్తుంది. ఇంతలో ఫణీంద్ర ప్రత్యక్షమై యువరాణి నేను నాగలోకపు యువరాజుని నా పేరు ఫణీంద్ర మన లోకానికి తీసుకువెళ్లడానికి వచ్చాను అని ఫణీంద్ర అంటాడు. నేను మన లోకానికి రావాలి అంటే నా భర్త ప్రాణాలు కాపాడిన తర్వాతే అని పంచమి అంటుంది. నాగదేవత నీకు పౌర్ణమి వరకే గడువు ఇచ్చింది,

పంచమి ఆలోపు మోక్షని కాటు వేయకపోతే నేనే కాటు వేసి చంపేస్తాను అప్పుడు నీకు నాగలోకానికి దారి ఉండదు నా మాట విని నువ్వు మోక్షని కాటు వేసి మన లోకానికి రా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఫణీంద్ర అంటాడు. ఇంతలో మోక్ష పంచమి అని పిలుచుకుంటూ వస్తాడు. మోక్ష పిలుపు వినగానే ఫణీంద్ర పాముగా మారి దూరంగా వెళ్ళిపోతాడు. పంచమి దగ్గరికి వచ్చి తనని ఎత్తుకొని గిరగిరా తిప్పి తన చేతులు పట్టుకొని ముద్దు పెట్టి పంచమి ఈరోజు నుంచి నువ్వు ఈ ఇంటికి యజమానురాలివి నువ్వు నా పక్కన ఉంటే ఏ పాము నన్ను కాటు వేయలేదు పంచమి నాకు చాలా ఆకలి వేస్తుంది రా పంచమి అని తీసుకువెళ్తాడు మోక్ష.

వాళ్ళిద్దరిని అలా చూసినా ఫణీంద్ర కోపంతో రగిలిపోతాడు. నాగదేవత ప్రత్యక్షమై ఆవేశం పనికిరాదు ఫణీంద్ర ఏ పని చేసిన ఆలోచన ఉండాలి ఆవేశంతో ఏమీ చేయలేము మన యువరాణి ఇప్పుడు మనిషిగా ఉంది కాబట్టి తనకు ప్రేమ ఆప్యాయత తన భర్త మీద పెంచుకుంది వాటి అన్నిటికీ దూరం చేసి మన లోకానికి తీసుకురా అంతేకానీ తొందరపడి ఏ హాని చెయ్యకు అని నాగదేవత అంటుంది.